తనుజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tanuja Samarth
జననం (1943-09-23) 1943 సెప్టెంబరు 23 (వయస్సు: 76  సంవత్సరాలు)
క్రియాశీలక సంవత్సరాలు 1962 - 1975, 2002 - 2003
భార్య/భర్త Shomu Mukherjee (separated)
పిల్లలు Kajol

తనుజ సమర్థ్ (మరాఠీ: तनूजा समर्थ), అందరికీ తనుజ గా పరిచితురాలు (23 సెప్టెంబర్ 1943) ఒక భారతీయ నటి. ఈమె కాజోల్ మరియు తనిషాల తల్లి, ఈమె బహరెన్ ఫిర్‌బీ ఆయేంగీ (1966), జ్యువెల్ థీఫ్, హాతీ మేరీ సాథీ (1971), అనుభవ్ (1971) వంటి హిందీ సినిమాలలో తన పాత్రలకు గాను ప్రజల జ్ఞాపకాలలో నిల్చిపోయారు; అదే సమయంలో ఈమె ఆంథోనీ ఫిరింగీ, డేయా నేయా, తీన్ భువనర్ పారే (1969), ప్రోథోమ్ కదమ్ ఫూల్, రాజ్‌కుమారి వంటి పలు ప్రామాణిక బెంగాలీ సినిమాలలో కూడా కనిపించారు.[1]

జీవితచరిత్ర[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

తనుజ ముంబైలో నలుగురు పిల్లలున్న మరాఠీ కుటుంబంలో కవి కుమర్‌సేన్ సమర్థ్, శోభనా సమర్థ్‌ దంపతులకు జన్మించింది. పూర్తి పేరు తనుజా సమర్థ్. ఆమె తల్లి 1930 మరియు 1940ల కాలంలో సుప్రసిద్ధ నటి, ఆమె తండ్రి కవి, చిత్ర దర్శకుడు. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తనుజ బాలనటిగా సినిమాలలో ప్రవేశించి 1973వరకు పనిచేసింది.

కుమర్‌సేన్ సమర్థ్ ముంబైలోని విలె పార్లె (E) ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తనుజా సోదరి నూతన్ విలె పార్లె (E) అంటే ఎంతో మక్కువ.

వృత్తి జీవితం[మార్చు]

తనుజ తన చిత్రరంగ జీవితాన్ని పెద్దక్క నూతన్‌తో కలిసి హమారి బేటీ (1950) ' తో ప్రారంభించింది. తర్వాత ఛాబిలి (1960) సినిమాలో నటజీవితం ప్రారంభించింది, ఈ చిత్రానికి ఆమె తల్లి దర్శకత్వం వహించారు, నూతన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. హమారీ యాద్ ఆయేగీ (1961) హీరోయిన్‌గా ఆమె నిజమైన పరివర్తన మొదలైంది, దీనికి కైదార్ శర్మ దర్శకత్వం వహించారు. షహీద్ లతిఫ్ దర్శకత్వం వహించిన బహరెన్ ఫిర్ బి ఆయేంగి (1966) చిత్రంలో ఆమె చక్కటి నటన ప్రదర్శించింది. ఇది గురుదత్ టీమ్ చివరి చిత్రం కావడం కాకతాళీయమే కావచ్చు, ప్రత్యేకించి ఈమె వో హన్‌స్కే మిలె హమ్‌సే పాటలో కనిపించింది, ఇది గురు దత్ బతికి ఉండగానే చిత్రీకరించిన పాటగా చెప్పుకుంటున్నారు, గురుదత్ ఆమె నటనను మెరుగుపర్చుకోవడంలో విశేషంగా సహాయమందించారు. సహజంగానే అద్భుతమైన నటన ప్రదర్శించే తనుజ ఈ సినిమాలో అద్భుత పనితీరును ప్రదర్శించింది. ఈమె నటన మొత్తం సినిమాకే తలమానికంగా నిలిచింది. ఆమె కెరీర్ కూడా దీంతో తారాస్థాయికి చేరుకుంది, త్వరలోనే ఆమె ముఖ్య పాత్రలకు తరలి వెళ్లింది బహ్రెన్ ఫిర్ భీ ఆయేంగీ సమీక్ష] Upperstall.com.</ref>. ఆమె తదుపరి పెద్ద చిత్రం జితేంద్రతో కలిసి నటించిన జీనె కి రాత్ (1969), అద్భుత విజయం సాధించింది, అదే సంవత్సరం పైసా యా ప్యార్ సినిమా కోసం ఉత్తమ సహాయ నటికిగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను తనుజ గెల్చుకుంది. హాతీ మేరే సాథి (1971) విజయం తర్వాత, ఈమె మేరే జీవన్ సాథీ, దో ఛోర్ మరియు ఏక్ బార్ ముష్కరా దో (1972) సినిమాలలో నటించింది. ఈమె పవిత్ర పాపి, భూత్ బంగ్లా, అనుభవ్, వంటి ఇతర చిత్రాలలో కూడా నటించింది.

ఆ తరువాత, తనుజ సినిమాలనుంచి పలు సంవత్సరాలపాటు తప్పుకుంది కాని, తమ వివాహం ముగిసిన తర్వాత ఆమె ఇప్పుడు తిరిగి వచ్చింది. ఆమెకు ఇప్పుడు మాజీ హీరోల సరసన సహాయ నటిగా పాత్రలను ప్రతిపాదిస్తున్నారు. ఆమె నటించిన ప్యార్ కీ కహానీలో కథానాయకుడు అమితాబ్ బచ్చన్ ఆమెను ఖుద్దర్ (1982) లో బాబీ (వదిన) గా పిలవాల్సి వచ్చింది. ఈమె రాజ్ కపూర్' యొక్క ప్రేమ్ రోగ్ (1982) లో కూడా సహాయ నటిగా నటించింది.

ఈమె రాజ్ కపూర్ ' యొక్క ప్రేమ్ రోగ్ (1982) లో కూడా సహాయ నటిగా నటించింది. తర్వాత ఈమె ఆంథోనీ-ఫిరింగీ (1967) మరియు రాజ్‌కుమారి (1970) వంటి అద్వితీయ విజయాలు సాధించిన పలు చిత్రాలలో నటన కొనసాగించింది. అలనాటి సూపర్ స్టార్ సౌమిత్ర చటర్జీతో తనుజ తెరపై అద్బుతమైన కెమిస్ట్రీ ప్రదర్శించింది. తనతో కలిసి ఈమె తీన్ భువనేర్ పారీ (1969), ప్రొతోమ్ కదమ్ పూల్ వంటి అతిపెద్ద విజయాలు సాధించిన చిత్రాలలో నటించింది. ఈ బెంగాలీ చిత్రాలలో తనుజ తన సంభాషణలు తానే పలికింది. ఆమె చిత్రజీవితం 1960, 70, 80లలో కొనసాగింది.

ఆమె ఇటీవల సాథియా (2002), రూల్స్ (2003), మరియు ఖాకీ (2003) వంటి సినిమాలలో సహాయ నటిగా కనిపించింది. 2008లో తనుజా, కాజోల్, అజయ్ దేవ్‌గన్‌లతో పాటు జీ టీవీ ఫ్యామిలీ డ్యాన్స్ సీరీస్ ర్యాక్ అండ్ రోల్ ఫ్యామిలీకి జడ్జిగా వ్యవహరించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

నిర్మాత శషధర్ ముఖర్జీ చిన్న కుమారుడు, దర్శకుడు షోము ముఖర్జీని ఆమె ఏక్ బార్ ముష్కరా దో (1972) సినిమా సెట్‌పై కలిసింది. వీళ్లమధ్య సుడిగాలిలో ప్రారంభమైన ప్రేమ సంబంధం 1973లో వివాహంతో ముగిసింది. వీరికి ఇద్దరు బిడ్డలు: కాజోల్ ముఖర్జీ (b. 1975) మరియు తనిషా ముఖర్జీ (b. 1978). వీరు తదనంతరం విడిపోయారు కాని విడాకులు మాత్రం తీసుకోలేదు. షోము ముఖర్జీ 2008 ఏప్రిల్ 10న గుండెపోటుతో మరణించాడు.

పురస్కారాలు మరియు ప్రతిపాదనలు[మార్చు]

 • 1967 - జ్యువెల్ థీఫ్ కోసం ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ నామినేషన్
 • 1969 - పైసా యా ప్యార్ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు

ఫిల్మోగ్రఫీ[మార్చు]

నటిగా

width=33%
 • తూన్‌పూర్ కా సూపర్ హీరో (2009) [2]
 • హలె దిల్ (సినిమా) (2008)
 • ముక్తి (సినిమా) (2008)
 • దీవార్ (2004)
 • ఖాకీ (2004)
 • రూల్స్ (ప్యార్ కా సూపర్ హిట్ ఫార్ములా) (2003)
 • భూత్ (2003)
 • సాథియా (2002)
 • భాయ్ నంబర్.1 (2000)
 • సఫారి (1999)
 • స్వామి వివేకానంద్ (1998)
 • ముఖాడమా (1996)
 • Paandav (1995) పాండవ్
 • ఆగ్ (1994)
 • ఆతిష్ (1994)
 • అంతిమ్ న్యాయ్ (1993)
 • ఇజ్జత్ కి రోటి (1993)
 • గుజబ్ తమాషా (1992)
 • అభి అభి (1992)
 • బేఖుడి (1992)
 • ఏక్ లడకా ఏక్ లడకి (1992)
 • ఐ లవ్ యు (1992)
 • జవహర్ (1991)
 • ప్యార్ భారా దిల్ (1991)
 • దుష్మన్ (1990)
 • గవాహి (1989)
 • ఘరానా (1961)
 • టకాత్వర్ (1989)
 • మేరీ జబాన్ (1989)
 • పరయా ఘర్ (1989)
 • రఖ్వాలా (1989)
 • పాప్ కో జాలా కర్ రఖ్ కర్ దూంగా (1988)
 • ఉఖా డర్ బబే నానక్ డా (1987)
 • అగ్నీ (1988)
 • మేరా ముఖద్దర్ (1988)
 • మేరా సుహాగ్ (1987)
 • దిల్‍జలా (1987)
 • ఘర్ కా సుఖ్ (1987)
 • ఇతిహాస్ (1987)
 • మా బేటీ (1987)
width=33%
 • జాల్ (1986)
 • లవ్ 86 (1986)
 • మహబ్బత్ కి కసమ్ (1986)
 • నసిహట్ (1986)
 • సుహాగన్ (1986)
 • అధికార్ (1986)
 • అనోఖా రిష్టా (1986)
 • ఏక్ ఔర్ సికిందర్ (1986)
 • లవర్ బాయ్ (1985)
 • జబర్దస్త్ (1985)
 • ఘర్ ద్వార్ (1985)
 • యాద్గార్ (1984)
 • బాక్సర్ (1984)
 • కున్వారి బాబు (1984)
 • మాటి మాంగే ఖూన్ (1984)
 • నదనియన్ (1984)
 • పెట్ వ్యార్ ఔర్ పాప్ (1984)
 • సోహ్ని మహివాల్ (1984)
 • ప్యాస్ (1983)
 • ఏక్ జాన్ హైన్ హమ్ (1983)
 • ప్రేమ్ రోగ్ (1982)
 • రుస్తుమ్ (1982)
 • బాహు హో తూ ఐసీ (1982)
 • జానీ ఐ లవ్ యు (1982)
 • కామ్ కోర్ (1982)
 • యారానా (1981)
 • కమాండర్ (1981)
 • బాండిష్ (1980)
 • బిన్ మా కె బచ్చే (1980)
 • లాల్ కోఠి (1978)
 • ఆజా సనమ్ (1975)
 • హమ్ షకాల్ (1974)
 • హమ్ రాహి (1974)
 • ఇంతిహాన్ (1974)
 • అమీర్ గరీబ్ (1974)
 • ఇన్‌సాఫ్ (1973)
 • నన్హా షికారి (1973)
 • దో చోర్ (1972)
 • మేరే జీవన్ సాథి (1972)
 • మొమెకి గుడియా (1972)
 • దూర్ కా రాహి (1971)
 • ఏక్ పహేలి (1971) ...
 • ఏక్ థి రీతా (1971)
 • హాతీ మేరే సాథీ (1971)
 • ప్రీత్ కి దూరి (1971)
 • పురని పెహ్‌చన్ (1971)
 • ప్యార్ కి కహానీ (1971)
 • అనుభవ్ (1971)
 • బచ్‌పన్ (1970)
 • పవిత్ర పాపీ (1970)
 • ప్రియ (1970)
 • ఏక్ మాసూమ్ (1969)
 • గుస్టాఖీ మాఫ్ (1969)
 • జీనేకి రాహ్ (1969)
 • జియో ఔర్ జీనే దో (1969)
 • పైసా యా ప్యార్ (1969)
 • దో దోని చార్ (1968)
 • ఇజ్జత్ (1968)
 • జువరి (1968)
 • స్వప్నోం కా సౌదాగర్ (1968)
 • వాహన్ కే లాగ్ (1967)
 • జ్యుయెల్ థీఫ్ (1967)
 • నై రోష్ని (1967)
 • బహరెన్ ఫిర్ బీ ఆయేంగీi (1966)
 • సన్నాట (1966)
 • భూత్ బంగ్లా (1965)
 • చాంద్ ఔర్ సూరజ్ (1965)
 • నై ఉమహ్ కి నై ఫసల్ (1965)
 • బెనజీర్ (1964)
 • ఆజ్ ఔర్ కల్ (1963)
 • హమారీ యాద్ ఆయేగీ (1961)
 • మేమ్ దీదీ (1961)
 • ఛబిలి (1960)
 • అంబర్ (1952)
 • హమారీ బేటీ (1950)

అతిథిపాత్రలో నటిగా

 • మాసూమ్ (1983)

ప్రత్యేక పాత్రలో నటిగా

 • ఖుద్-దార్ (1982)
 • బేఖుడి (1992)

సూచనలు[మార్చు]

 1. "తనుజ ప్రొఫైల్, పిక్చర్ గ్యాలరీ". మూలం నుండి 2009-09-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-02. Cite web requires |website= (help)
 2. http://www.toonpur.com/synopsis

బాహ్య లింకులు[మార్చు]

మూస:Bollywood మూస:FilmfareBestSupportingActressAward

"https://te.wikipedia.org/w/index.php?title=తనుజ&oldid=2804370" నుండి వెలికితీశారు