తనూజ్ పునియా
| తనూజ్ పునియా | |||
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జూన్ 4 | |||
| ముందు | ఉపేంద్ర సింగ్ రావత్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బారాబంకి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1985 January 16 అలీఘర్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | పి.ఎల్. పునియా | ||
| జీవిత భాగస్వామి | శ్రద్ధా సింగ్ | ||
| నివాసం | నవాబ్‌గంజ్ , బారాబంకి ఉత్తర ప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
తనూజ్ పునియా (జననం 16 జనవరి 1985) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]తనూజ్ పునియా తన తండ్రి పి.ఎల్. పునియా అడుగుజాడల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర సింగ్ రావత్ చేతిలో 29181 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర సింగ్ రావత్ చేతిలో 1,06,016 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]
తనూజ్ పునియా 2019లో జైద్‌పూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి 43,983 ఓట్లతో మూడవస్థానంలో నిలిచాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాబంకి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజ్‌రాణి రావత్ పై 2,15,704 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 719,927 ఓట్లతో విజేతగా నిలవగా, రాజ్‌రాణి రావత్ 5,04,223 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). India Today. 13 July 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Lok Sabha Elections 2019: Young contenders lock horns in poll arena". Hindustan Times. 15 May 2019. Archived from the original on 10 June 2025. Retrieved 10 June 2025.
- ↑ "Barabanki Constituency Lok Sabha Election Result 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Barabanki" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.