తన్మయ్ అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తన్మయ్ అగర్వాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు తన్మయ్ ధరంచంద్ అగర్వాల్
జననం (1995-05-03) 1995 మే 3 (వయసు 28)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగ్ శైలి ఎడమచేతి వాటం
బౌలింగ్ శైలి లెగ్ బ్రేక్ గూగ్లీ
పాత్ర బ్యాట్స్‌మన్
సంబంధాలు నితిషా జలన్ అగర్వాల్ (భార్య)
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2014–ప్రస్తుతం హైదరాబాదు
2017–ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లిస్టు-ఏ ట్వంటీ20
మ్యాచులు 42 29 40
సాధించిన పరుగులు 2,609 1,084 1,087
బ్యాటింగ్ సగటు 37.81 40.14 28.60
100 పరుగులు/50 పరుగులు 8/10 2/8 0/5
ఉత్తమ స్కోరు 135 136 91
వేసిన బాల్స్ 70 6
వికెట్లు 0 1
బౌలింగ్ సగటు 1.00
ఇన్నింగ్స్ లో వికెట్లు 0
మ్యాచులో 10 వికెట్లు 0
ఉత్తమ బౌలింగు 1/1
క్యాచులు/స్టంపింగులు 19/– 12/– 11/–
Source: Cricinfo, 6 మే 2020

తన్మయ్ ధరంచంద్ అగర్వాల్, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. హైదరాబాదు తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన తన్మయ్ అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-22, అండర్-25 వంటి వివిధ ఏజ్-గ్రూప్ స్థాయిలలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లలోనే రెండింటిలోనూ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.[1][2]

2017 ఫిబ్రవలో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన్మయ్ ను 10 లక్షలకు కొనుగోలు చేసింది.[3] 2018 జనవరిలో, 2018 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.[4]

జననం[మార్చు]

తన్మయ్ అగర్వాల్ 1995 మే 3న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం[మార్చు]

ఫస్ట్-క్లాస్[మార్చు]

2014, డిసెంబరు 14 నుండి 17 వరకు హైదరాబాదులో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[5] 42 మ్యాచ్‌ల్లో 37.81 బ్యాటింగ్ సగటుతో 2,609 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 10 అర్థసెంచరీలు ఉన్నాయి. 135 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

లిస్టు-ఎ[మార్చు]

2014, నవంబరు 11న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] 29 మ్యాచ్‌ల్లో 40.14 బ్యాటింగ్ సగటుతో 1,084 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. 136 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

ట్వంటీ20[మార్చు]

2015, మార్చి 25న కొచ్చిలో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] 40 మ్యాచ్‌ల్లో 28.60 బ్యాటింగ్ సగటుతో 1,087 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థసెంచరీలు ఉన్నాయి. 91 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "Tanmay Agarwal". ESPNcricinfo. Retrieved 26 March 2015.
  2. "Tanmay slams a ton on debut". www.thehindu.com. The Hindu. Archived from the original on 2021-11-23. Retrieved 26 March 2015.
  3. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved 20 February 2017.
  4. "List of sold and unsold players". ESPN Cricinfo. Archived from the original on 2022-07-11. Retrieved 27 January 2018.
  5. "Full Scorecard of Hyderabad vs Goa Group C 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-08-06. Retrieved 2022-09-14.
  6. "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-09-14. Retrieved 2022-09-14.
  7. "Full Scorecard of Tamil Nadu vs Hyderabad South Zone 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-23. Retrieved 2022-09-14.

బయటి లింకులు[మార్చు]