తన్వీ ది గ్రేట్
| తన్వీ ది గ్రేట్ | |
|---|---|
| దర్శకత్వం | అనుపమ్ ఖేర్ |
| రచన | అనుపమ్ ఖేర్ అంకుర్ సుమన్ అభిషేక్ దీక్షిత్ |
| కథ | అనుపమ్ ఖేర్ అభిషేక్ దీక్షిత్ |
| నిర్మాత | అనుపమ్ ఖేర్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | కీకో నకహార |
| కూర్పు | తుషార్ పరేఖ్ |
| సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థలు | అనుపమ్ ఖేర్ స్టూడియో ఎన్‌ఎఫ్‌డిసి |
| పంపిణీదార్లు | ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏఏ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2025 జూలై 18 |
సినిమా నిడివి | 160 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
తన్వి ది గ్రేట్ 2025లో విడుదలైన హిందీ సినిమా. అనుపమ్ ఖేర్ స్టూడియో, ఎన్‌ఎఫ్‌డిసి బ్యానర్స్‌పై అనుపమ్ ఖేర్ నిర్మించి దర్శకత్వం వహించాడు.[2][3] అనుపమ్ ఖేర్, శుభాంగి దత్, ఇయాన్ గ్లెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదలైంది.[4]
కథ
[మార్చు]పుట్టినప్పటి నుండే ఆటిజం (వయస్సుకు తగ్గ మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే ఒక పరిస్థితి) తో బాధపడుతుంది తన్వీ (సుభాంగీ దత్). ఆమె ఏడేళ్ళ వయసులో తండ్రి మేజర్ సమర్ రైనా (కరణ్ టక్కర్) సియాచిన్ కు ప్రయాణం చేస్తూ, తీవ్రవాదులు పెట్టిన ల్యాండ్ మైన్ కు బలవుతాడు. సియాచిన్ లోని జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాలన్నది అతని చిరకాల కోరిక. సింగిల్ మదర్ విద్య (పల్లవి జోషి) స్పెషల్ చైల్డ్ తన్వీని ఎలాంటి లోటు లేకుండా పెంచుతుంది. న్యూయార్క్ లో జరిగే వరల్డ్ ఆటిజమ్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కు ఆమె వెళుతూ తన్వీని ఉత్తరాఖండ్ కంటోన్మెంట్ హిల్ టౌన్ లాన్స్ డౌన్ లో తన్వీని తాతయ్య కల్నల్ ప్రతాప్ రైనా (అనుపమ్ ఖేర్) దగ్గర వదిలి వెళ్తుంది. అయితే తాతయ్య ఇంట్లో తన తండ్రి నివాసం ఉన్న గదిని, ఆయన పాత ఫోటోలను, వీడియోలను చూసిన తర్వాత తన్వీ మనసు మారిపోతుంది. తగిన శిక్షణ తీసుకుని ఆర్మీలో చేరాలనుకుంటుంది. ఆటిజమ్ ఉన్న వారిని సెన్యంలో తీసుకోరని తెలిసిన ప్రతాప్ రైనా (అనుపమ్ ఖేర్) అందుకు నిరాకరిస్తాడు. తన్వీ తండ్రితో పాటు మేజర్‌గా పనిచేసిన శ్రీనివాసన్ (అరవింద్ స్వామి) ఆమె గతాన్ని తెలుసుకుని ఆర్మీ ఎంట్రన్స్ కై ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్థ పడతాడు. ఇంటి గడపను సైతం సరిగా దాటలేని తన్వీ ఆర్మీలో ఉద్యోగం సంపాదించిందా ? సియాచిన్ కు వెళ్ళాలనుకున్న తన కోరికను నెరవేర్చుకుందా? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- కల్నల్ ప్రతాప్ రైనాగా అనుపమ్ ఖేర్
- తన్విగా శుభాంగి దత్[5][6][7]
- మైఖేల్ సిమ్మన్స్ గా ఇయాన్ గ్లెన్[8]
- రాజా సాహబ్ గా బోమన్ ఇరానీ
- బ్రిగేడియర్ జోషిగా జాకీ ష్రాఫ్
- మేజర్ శ్రీనివాసన్ గా అరవింద్ స్వామి[9]
- విద్యా రైనాగా పల్లవి జోషి
- కెప్టెన్ సమర్ రైనాగా కరణ్ టాకర్
- బ్రిగేడియర్ కె.ఎన్. రావుగా నాజర్
- జోవన్నా సియోసెక్ గా జోవన్నా అష్కా
- జావేద్ అలీ
పాటలు
[మార్చు]| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "గుడ్‌బై సాంగ్" | షగున్ సోధి | 4:14 |
| 2. | "రాజ్ పండిట్" | ఎం. ఎం. కీరవాణి, గోమతి అయ్యర్, బేబీ సాన్వి | 3:28 |
| 3. | "సోచే ఆస్మా" | రాజ్ పండిట్ | 3:24 |
| 4. | "సోచే ఆస్మా" | రమ్య బెహరా, నయన నాయర్ | 5:49 |
| 5. | "జిందగీ" | విశాల్ మిశ్రా | 6:35 |
| 6. | "సేనా కీ జై" | షగున్ సోధి | 4:51 |
| 7. | "తన్వి కీ జై" | షాన్, షగున్ సోధి & గోమతి అయ్యర్ | 5:31 |
| 8. | "తేరే సురో మే గానే లగా" | ఎం. ఎం. కీరవాణి, గోమతి అయ్యర్ | 1:51 |
| 9. | "డిఫరెంట్, బట్ నో లెస్" (షానన్ కె, డర్టీ గ్రిమ్) | షానన్ కె, డర్టీ గ్రిమ్ | 2:33 |
| 10. | "సేనా కి జై" (మేల్ వెర్షన్) | సోను నిగమ్ | 4:50 |
| 11. | "థీమ్ మ్యూజిక్ ఆఫ్ తన్వి ది గ్రేట్" | గోమతి అయ్యర్ | 2:44 |
| మొత్తం నిడివి: | 47:50 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Tanvi the Great (PG)". British Board of Film Classification (in ఇంగ్లీష్). 10 July 2025. Retrieved 10 July 2025.
- ↑ "'Tanvi The Great': Anupam Kher announces new directorial". The Hindu (in Indian English). 7 March 2024. Archived from the original on 14 April 2025. Retrieved 16 April 2025.
- ↑ "Anupam Kher announces next directorial 'Tanvi The Great' on 69th birthday". India Today (in ఇంగ్లీష్). 7 March 2024. Archived from the original on 14 May 2024. Retrieved 16 April 2025.
- ↑ "తన్వీ చిత్రం విడుదల తేదీ ఖరారు". Chitrajyothy. 19 May 2025. Archived from the original on 5 September 2025. Retrieved 5 September 2025.
- ↑ "'Tanvi The Great': Kajol introduces Shubhangi, the lead of Anupam Kher's upcoming directorial" (in Indian English). The Hindu. 28 April 2025. Archived from the original on 5 September 2025. Retrieved 5 September 2025.
- ↑ "అనుపమ్ ఖేర్ డైరెక్షన్‌లో 'తన్వి ది గ్రేట్'.. హీరోయిన్‌గా పరిచయం అవుతున్న శుభంగి". V6 Velugu. 29 April 2025. Archived from the original on 5 September 2025. Retrieved 5 September 2025.
- ↑ "Anupam Kher introduces Shubhangi as the lead in Tanvi The Great" (in ఇంగ్లీష్). The New Indian Express. 30 April 2025. Archived from the original on 5 September 2025. Retrieved 5 September 2025.
- ↑ "'Game of Thrones' actor Iain Glen joins cast of Anupam Kher's 'Tanvi The Great'" (in ఇంగ్లీష్). India Today. 21 August 2024. Archived from the original on 5 September 2025. Retrieved 5 September 2025.
- ↑ "Anupam Kher introduces Arvind Swami as Major Srinivasan in Tanvi The Great; check poster". The Times of India. 10 May 2025. Archived from the original on 2025-08-06. Retrieved 5 September 2025.