తపోవనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తపోవనము
తపోవనము
తపోవనము
కృతికర్త: బెళ్లూరి శ్రీనివాసమూర్తి
అంకితం: వాల్మీకి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: ఖండకావ్య సంపుటి
విభాగం(కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ:
విడుదల: 1954
పేజీలు: 125


రాయలసీమ కవులలో అగ్రగణ్యుడు మధురకవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి వ్రాసిన ఖండకావ్యాల సంపుటము ఈ తపోవనము[1]. దీని లోని కవితలు వివిధ సందర్భాలలో వ్రాసినవి. భారతి, ఆంధ్రపత్రిక,శ్రీసాధన పత్రిక, రేనాడు,ప్రకృతిమాత మొదలైన పత్రికలలో ప్రచురితమైనవి. ఈ గ్రంథానికి కళ్యాణదుర్గం బోర్డు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గుమ్మగట్ట శ్రీనివాసరావు ఆంగ్లంలో ముందుమాట వ్రాశాడు. ఈ కావ్యాన్ని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, బులుసు వెంకటేశ్వర్లు, జమ్మలమడక మాధవరామశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, సి.వి.సుబ్బన్న శతావధాని, దుర్భాక రాజశేఖర శతావధాని, తలమర్ల కళానిధి మొదలైన వారు ప్రశంసిస్తూ వ్రాసిన వాక్యాలుపుస్తకంలో ఉన్నాయి.

అంకితం[మార్చు]

ఈ పుస్తకాన్ని వాల్మీకికి ఈ విధంగా అంకితమిస్తున్నాడు కవి.

రామకథ పాడి మోక్షసామ్రాజ్యమునకు
ఏకపథ మారసితివి వాల్మీకి సుకవి,
ప్రేమ నేకైక సుతునభి 'రామగాథ'
నల్లుకొని యల్లుకొని శాంతి యలవరింతు.

ఈ కావ్యములోని ఖండికలు[మార్చు]

కళాజీవి (పూర్వఖండము)[మార్చు]

  1. శిశిరవర్ణములు
  2. కుసుమదామము
  3. నేను
  4. స్వేచ్ఛావిహంగము
  5. సౌందర్యపూజ
  6. తొలుకారుశోభ
  7. ప్రభాత పల్లకి
  8. ఋతుపరిదేవనము
  9. ఎట్లు మరణింతు!
  10. పశ్చాత్తాపము
  11. అంగవైకల్యము
  12. ఊరడింపు
  13. పడవపదము
  14. సహవాసకాంక్ష
  15. ఉపదేశము
  16. ముక్తి
  17. అభాగ్యజీవి
  18. గాఢయత్నము
  19. ఇంద్ర గోపము
  20. విషాదగీతి
  21. ఉగాదివేకువ
  22. అజ్ఞానము
  23. అమరత్వము
  24. ముదల
  25. అమృతసిద్ధి

కళాజీవి (ఉత్తరఖండము)[మార్చు]

  1. వివిక్త వీధి
  2. కృషి
  3. శ్రీ అరవిందోపాసన
  4. సుమమాలిక
  5. అఖండస్వాగతము
  6. కాళిదాసు
  7. గురూపదేశము
  8. ధన్యజీవితము
  9. శ్రీరాజశేఖర కవిసార్వభౌములు-రాణాప్రతాప
  10. మునివృత్తి
  11. రాయలసీమ
  12. జోహారులు
  13. ఉగాది
  14. తృప్తి
  15. కమండలువు

సాన్నిధ్యము (పూర్వఖండము)[మార్చు]

  1. ఝంఝామారుతము
  2. నా జీవిత స్వర్గము
  3. కావ్యమల్లిక
  4. గీతికలు
  5. గురుపూజ
  6. స్వర్గద్వారము
  7. పయనం
  8. పూజ
  9. భిక్షువు
  10. గీతాయోగము
  11. శాంతి
  12. శకుంతల
  13. నుతి
  14. సంధ్య
  15. ప్రకృతిమహిమ
  16. తిక్కశర్మ
  17. స్వాగతము
  18. అర్చన
  19. కవీంద్ర
  20. స్నేహస్మరణము
  21. ఆశీర్మాలిక
  22. నేడు
  23. కష్టేఫలి
  24. అక్కమ్మగార్ల కొండ
  25. అంకితగీతి

సాన్నిధ్యము (ఉత్తర ఖండము)[మార్చు]

  1. అద్వైతం
  2. సానుభూతి
  3. జలదపుత్రుడు
  4. స్మరణవీధి
  5. ఆహ్వానము
  6. కుందమాల
  7. సాన్నిధ్యము
  8. చిఱుపాట
  9. భావకుసుమములు
  10. ఉపాయనము
  11. ముక్తాదామము
  12. సారస్వతేయులకు కృతజ్ఞత
  13. నిర్యాణానంతరము
  14. కవితపస్వి
  15. నందన

స్వర్గద్వారము (పూర్వఖండము)[మార్చు]

  1. ఆంధ్రమాత
  2. రాజర్షి
  3. సంయుక్త చేటిక
  4. విపణి వీధి
  5. నా ప్రభూ
  6. సృష్టి మర్మము
  7. వెఱ్ఱిపాట
  8. నవ్య సందేశం
  9. గురుస్మరణ
  10. స్వర్గీయ రాయలసీమ చిత్రకారుడు
  11. గంజికేంద్రము
  12. నమస్తే
  13. సంక్రాంతికన్యలు
  14. సందేహము
  15. తెలుగు శిల్పి

స్వర్గద్వారము (ఉత్తరఖండము)[మార్చు]

  1. ప్రకృతిసందేశము
  2. నాస్తి ఇహపరచింతా
  3. స్వామిరామదాసు
  4. శ్రీ అనంతాశ్రమ సందర్శనము
  5. సమాధి
  6. అంక సప్తకము
  7. ఉత్తరుని విజృంభణము
  8. శివభారతము
  9. కట్టమంచి
  10. నిద్రాదేవి
  11. ఊదరా
  12. భావ భాగీరథి
  13. వేగుజుక్క
  14. యాత్రావిరతి
  15. ఖండకావ్యము

మచ్చుతునక[మార్చు]

జోహారులు
చిగురులుమేసీ
గుబురులఁ గూసే
కోయిలపాటల
తీయఁదనాలకు-
వార్షుకాభ్రములు
వంగి కురిసితే
కొండలలోన, కోనలలోన
వరదలుగా వాగులుగా
వాహినిగా ప్రవహించే
సెలపాటలకు-
వేగుజుక్క వెలుఁగులకు
కోడికూఁతసొబగులకు
కళావికాసం కల్పించే
కాపుయువకుని
కపిలెపదాలకు-
చేతులు జోడించీ
జోహారులు గూర్చీ
ప్రకృతిదేవీహృదయములోన
పగలూ రాతిరి కలిగించే
బ్రహ్మానందం చిలికించే
భవ్యమైన నా కవితాగీతం,
పాడుకొందు నవకవితా గేయం.

మూలాలు[మార్చు]

  1. [1] భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తక ప్రతి
"https://te.wikipedia.org/w/index.php?title=తపోవనము&oldid=2342245" నుండి వెలికితీశారు