Jump to content

తమెంగ్‌లాంగ్

అక్షాంశ రేఖాంశాలు: 24°59′26.39″N 93°30′3.26″E / 24.9906639°N 93.5009056°E / 24.9906639; 93.5009056
వికీపీడియా నుండి
తమెంగ్‌లాంగ్
పట్టణం
తమెంగ్‌లాంగ్ is located in Manipur
తమెంగ్‌లాంగ్
తమెంగ్‌లాంగ్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
తమెంగ్‌లాంగ్ is located in India
తమెంగ్‌లాంగ్
తమెంగ్‌లాంగ్
తమెంగ్‌లాంగ్ (India)
Coordinates: 24°59′26.39″N 93°30′3.26″E / 24.9906639°N 93.5009056°E / 24.9906639; 93.5009056
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాతమెంగ్‌లాంగ్
Elevation
1,580 మీ (5,180 అ.)
జనాభా
 (2011)
 • Total19,363
భాషలు
 • అధికారికరోంగ్మీ, లియాంగ్‌మై, జెమ్, ఇన్‌పుయి
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795141
టెలిఫోన్ కోడ్03877
Vehicle registrationఎంఎన్
అక్షరాస్యత86.95%
Websiteఅధికారిక వెబ్‌సైటు

తమెంగ్‌లాంగ్, మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఈ పట్టణంలో రోంగ్మీ ప్రజలు నివసిస్తున్నారు, రోంగ్మీ భాష మాట్లాడుతారు.[1]

భౌగోళికం

[మార్చు]

ఈ పట్టణం 24°59′26.39″N 93°30′3.26″E / 24.9906639°N 93.5009056°E / 24.9906639; 93.5009056 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సమద్రమట్టానికి 1,580 మీ. (5,180 అ.) ఎత్తులో ఉన్న ఈ పట్టణం, మణిపూర్ రాష్ట్ర పశ్చిమం వైపు ఉంది. పట్టణమన్న కొండపైన బరాక్ నది ప్రవహిస్తోంది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరానికి పశ్చిమం వైపు 160 కి.మీ.ల దూరంలో ఈ పట్టణం ఉంది. దీనికి తూర్పు వైపు సేనాపతి జిల్లా, పశ్చిమం వైపు అస్సాంలోని ఉత్తర కచార్ హిల్స్ జిల్లా, ఉత్తరం వైపు నాగాలాండ్ రాష్ట్ర పెరెన్ జిల్లా, దక్షిణం వైపు చురచంద్‌పూర్ జిల్లా ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఇక్కడ 19,363 జనాభా ఉంది. ఇందులో 9,837 మంది పురుషులు, 9,526 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 2,683 (13.86%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 86.95% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 90.64% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 83.15% గా ఉంది.[2]

ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 95.90%, హిందువులు 3.22%, ముస్లింలు 0.42%, సిక్కులు 0.10%, బౌద్ధులు 0.27%, జైనులు 0.03%, ఇతరులు 0.05% ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

ఈ పట్టణంలో మొత్తం 3,481 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు అందించబడుతున్నాయి. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది.[2]

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

‘ల్యాండ్ ఆఫ్ హార్న్‌బిల్’ గా పేరొందిన ఈ పట్టణం, వృక్ష జంతుజాలాలతో సమృద్ధిగా ఉంది. ఇక్కడ అరుదైన జాతుల మొక్కలు, జంతువులు, పక్షులు ఉన్నాయి. నదులు, జలపాతాలు, గుహలు, సరస్సులు, దట్టమైన ఉష్ణమండల అడవులు కూడా ఉన్నాయి.[3]

  1. జీలాడ్ సరస్సు
  2. జిలాడ్ వన్యప్రాణుల అభయారణ్యం
  3. బరాక్ జలపాతాలు
  4. కిషా ఖౌ
  5. థరోన్ కేవ్
  6. బన్నింగ్ మేడో

ప్రధాన తెగలు

[మార్చు]
  • రోంగ్మీ భాష మాట్లాడే రోంగ్మీ నాగ తెగ ఇక్కడ ఉంది.

• జెమే నాగా 2 లియాంగ్‌మై నాగా 3 ఇన్‌పుయి నాగ

వాతావరణం

[మార్చు]

ఇక్కడ తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఇది ఒక ఎత్తైన ప్రదేశం. జూలై నెలలో ఎక్కువ వర్షం కురుస్తుంది, డిసెంబరు నెలలో పొడిగా ఉంటుంది.[4]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Villages & Towns in Tamenglong Sub Division of Tamenglong, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
  2. 2.0 2.1 "Tamenglong Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
  3. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.
  4. "Tamenglong - Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. Retrieved 2021-01-08.

ఇతర లంకెలు

[మార్చు]