Jump to content

తరుణ్ అగర్వాల్

వికీపీడియా నుండి

తరుణ్ అగర్వాల్ ( 1956 మార్చి 3- 2025 మార్చి 30) మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.

కెరీర్

[మార్చు]

అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో తరుణ్ అగర్వాల్ పట్టాను అందుకున్నాడు. 1981లో తరుణ్ అగర్వాల్ అలహాబాద్ హైకోర్టు లో జూనియర్ న్యాయవాదిగా పనిచేశాడు. 2005 ఆగస్టు 18న తరుణ్ అగర్వాల్ అలహాబాద్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ తరుణ్ అగర్వాల్ 2009లో ఉత్తరాఖండ్ హైకోర్టు బదిలీ చేయబడ్డారు అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.[1] 2018 ఫిబ్రవరి 12న మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తరుణ్ అగర్వాల్ పదోన్నతి పొందారు.[2] పదవీ విరమణ తరువాత, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ముంబై ట్రిబ్యునల్ అధికారిగా తరుణ్ అగర్వాల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.[3][4] రోడ్డు ప్రమాదం తరువాత గుండెపోటుతో బాధపడుతున్న తరుణ్ అగర్వాల్ 2025 మార్చి 30న 69 సంవత్సరాల వయసులో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Former Hon'ble Judges: Former Hon'ble Judges". highcourtofuttarakhand.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-04.
  2. "Hon'ble Mr Justice Tarun Agarwala | Official Website of High Court of Meghalaya, India". meghalayahighcourt.nic.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-04.
  3. "Justice Tarun Agarwala appointed Securities Appellate Tribunal presiding officer". Business Standard India. Press Trust of India. 2018-12-12. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-04.
  4. "Justice Tarun Agarwala appointed Securities Appellate Tribunal presiding officer". www.businesstoday.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-04.