తరుణ్ భాస్కర్ దాస్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తరుణ్ భాస్కర్
జననం (1988-11-05) 1988 నవంబరు 5 (వయస్సు 32)
చెన్నై
వృత్తిసినీ దర్శకుడు
జీవిత భాగస్వాములులత

తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది.[1] 2019 లో తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. 2020లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ లో అతిథి పాత్ర పోషించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తరుణ్ భాస్కర్ తండ్రి స్వస్థలం వరంగల్. తల్లి స్వస్థలం తిరుపతి. 1988 నవంబరు 5న చెన్నైలో పుట్టాడు. హైదరాబాదులో పెరిగాడు. ఇతని భార్య పేరు లత. ఆమె స్వస్థలం చిత్తూరు. ఆమె కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసింది.

వృత్తి[మార్చు]

మొదటి నుంచి తరుణ్ కు సినిమాల మీద ఆసక్తి ఉండేది. లఘు చిత్రాలను రూపకల్పన చేయడంతో మొదలు పెట్టాడు. మొదటగా తల్లి రాసిన ఓ కవితను ఓ లఘు చిత్రంలా తీసి ఐఐటీ మద్రాసులో జరుగుతున్న సారంగ్ అనే ఉత్సవాల కోసం పంపాడు. అక్కడ దానికి బహుమతి వచ్చింది. అదే ఉత్సాహంతో జర్నీ, సెరెండిపిటీ, మినిట్స్‌ టు మిడ్‌నైట్‌, అనుకోకుండా, సైన్మా లాంటి లఘు చిత్రాలను రూపొందించాడు. వీటిలో కొన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇంఫాల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి చిత్రోత్సవాలకు ఎంపికయ్యాయి. జునూన్ అనే సినిమాకు పీపుల్స్ చాయిస్ అవార్డు వచ్చింది. అనుకోకుండా అనే సినిమా యూట్యూబులో అత్యధికులు వీక్షించారు. సైన్మాకి కూడా పలు పురస్కారాలు దక్కాయి. ఈ సినిమా చూసిన మంచు లక్ష్మి తనతో ఓ చిత్రానికి పనిచేయమని కోరింది. ఆ సినిమా స్క్రిప్టు పని జరుగుతున్న సమయంలో తరుణ్ తండ్రి మరణించడంతో అది వాయిదా పడింది. తరువాత పెళ్ళి చూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో కథా నాయకుడైన విజయ్ దేవరకొండ, తరుణ్ ముందు నుంచి స్నేహితుడు కావడంతో ఆ పరిచయంతో నిర్మాత రాజ్ కందుకూరిని కలిసి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తన మొదటి సినిమాకే జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.

సినిమాలు[మార్చు]

Year Film Director Producer Actor Writer/Dialogues Screenplay Notes
2011 ద జర్నీ అవును కాదు కాదు అవును అవును Short Film
2012 అనుకోకుండా అవును కాదు కాదు అవును అవును Short Film
2015 సైన్మా అవును కాదు కాదు అవును అవును Short Film
2016 పెళ్ళిచూపులు అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును అవును 2 National Awards
2018 మహానటి కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు Released
2018 ఈ నగరానికి ఏమైంది? అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును అవును Released
2018 సమ్మోహనం కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు Released
2019 ఫలక్‌నుమా దాస్‌ కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు Released
2019 మీకు మాత్రమే చెప్తా[2] కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు style="background:#9F9;vertical-align:middle;text-align:center;" class="table-yes"|అవును కాదు style="background:#F99;vertical-align:middle;text-align:center;" class="table-no"|కాదు Released

మూలాలు[మార్చు]

  1. "మాటలు మురిపించి... ప్రతిభ పరిమళించి!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 April 2017. Retrieved 15 April 2017.
  2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (1 November 2019). "'మీకు మాత్ర‌మే చెప్తా' మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 1 November 2019. Retrieved 1 November 2019.