తలసరి ఆదాయం
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
This article needs more links to other articles to help integrate it into the encyclopedia. (అక్టోబరు 2016) |
తలసరి ఆదాయం, అనగా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మనిషికి సగటున లభించే ఆదాయం. ఆ ప్రాంతంలో అన్ని రకాలుగా వచ్చే ఆదాయాన్ని (స్థూల జాతీయోత్పత్తి) లెక్కించి జనాభాతో భాగించగా వచ్చేదాన్ని తలసరి ఆదాయం అంటారు.
శ్రేయస్సుకు కొలమానం
[మార్చు]తలసరి ఆదాయం = మొత్తం ఆదాయం/జనాభా. తలసరి ఆదాయం దేశం అభివృద్ధికి కొలమానంగా వాడుతారు (ముఖ్యంగా ఇతర దేశాలతో పోల్చేటప్పుడు). అది దేశ జీవన ప్రమాణాలను అంచనా వేయటానికి కూడా ఉపయోగపడింది.దీనిని ఎక్కువగా వాడే కరెన్సీలలో (రూపాయి లేదా డాలర్) వెల్లడిస్తారు. ఎందుకనగా జీడీపీ వగైరావన్ని అందులోనే లభిస్తాయి. ఇందులో అయితే వివిధ దేశాలతో పోల్చడానికి చాలా సులువుగా ఉంటుంది. ఏఏ దేశం ఏ స్థానంలో ఉందో తెల్సుకోవచ్చు.
విమర్శలు
[మార్చు]దీనిని అభివృధ్ధికి సూచికగా వాడటంలో చాలా లోపాలు ఉన్నాయనే విమర్శకులూ లేకపోలేదు.
వారు చెప్పే లోపాలు
[మార్చు]- తలసరి ఆదాయమును కాలంతో పాటు పోల్చేటప్పుడు ధరల పెరుగుదలతో సరి చేయాలి. లేకపోతే ద్రవ్యోల్బణ ప్రభావం వలన ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది. మన అంచనా తప్పుతుంది.
- అంతర్జాతీయంగా పోల్చేటప్పుడు ఆ ఆ దేశాల మారక విలువలలో కనిపించని జీవన వ్యయంలోని తేడాల వల్ల మన అంచనాలు వక్రీకరింబడతాయి. మన లక్ష్యం జీవన ప్రమాణాలను పోల్చడానికి కాబట్టి తలసరి ఆదాయాన్ని ఆయా దేశాల కొనుగోలు శక్తిని అనుసరించి సరి చేయగలిగితే నిజమైన ఫలితాలు వస్తాయి. అప్పుడు కచ్చితమైన అంచనా, నిజమైన భేదాలు తెలుస్తాయి.
- ఇది సగటు విలువ కనుక ఆదాయ పంపిణీ గురించి స్పష్టమైన అవగాహన రాదు. ఒకవేళ ఆ పంపిణీ వక్రంగా ఉన్నచో ఎక్కువ భాగస్తులైన బీద వర్గం ఉన్నా తక్కువ మంది ఉన్న ధనిక వర్గం వలన తలసరి ఆదాయం భారీగా మారుతుంది. కాబట్టి “మధ్యస్థ” విలువ దీనికి ఎక్కువ ఉపయోగ పడుతుంది. ఎందుకనగా ఇది ధనిక వారి వలన ఎక్కువగా మారదు.
- ద్రవ్య రూపంలో లేని ఆదాయలు ఉదాహరణ: కుటుంబంలో చేసే సేవలు, వస్తుమార్పిడి ద్వారా జరిగే లావాదేవీలు మొదలైనవి ఇందులో కలవవు. వీటి ద్వారా వచ్చే ఆదాయం దేశదేశానికి మారుతుంది.
- ఇందులో ఆదాయం ఏ ఏ మూలాల నుంచి వస్తుందో తెలియదు. అనగా అభివృద్ధికి ఉపయోగపడే రంగాల్లోనా (వైద్య, విద్య, రవాణా వగైరాలు) లేక స్వప్రయోజనాల కోసమో తెలియదు.