తవాంగ్ బౌద్ధ విహారం
| తవాంగ్ బౌద్ధ విహారం | |
|---|---|
తవాంగ్ బౌద్ధ విహారం | |
| మతం | |
| అనుబంధం | Tibetan Buddhism |
| Sect | గెలుగ్ |
| ప్రదేశం | |
| ప్రదేశం | తవాంగ్, అరుణాచల ప్రదేశ్ |
| దేశం | భారతదేశం |
![]() తవాంగ్ బౌద్ధ విహారం యొక్క ఇంటరాక్టివ్ మ్యాప్ | |
| నిర్దేశాంకాలు | 27°35′11″N 91°51′27″E / 27.58639°N 91.85750°E |
| వాస్తుశిల్పం | |
| నిర్మాణశైలి | డ్జోంగ్ |
| స్థాపకుడు | మేరా లామా లోడ్రే గ్యాట్సో |
| స్థాపితం | 1680 |
తవాంగ్ విహారం భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం తవాంగ్‌లో ఉన్న ఒక బౌద్ధ విహారం. ఇది దేశంలోనే అతిపెద్ద విహారం. ఇది చైనా, భూటాన్ సరిహద్దుకు సమీపంలో, తవాంగ్ చూ లోయలో నెలకొని ఉంది.
తవాంగ్ విహారాన్ని టిబెటన్ భాషలో గాడెన్ నమ్గ్యాల్ ల్హాట్సే అని పిలుస్తారు, దీని అర్థం "సంపూర్ణ విజయ దైవిక స్వర్గం". 5వ దలైలామా, నవాంగ్ లోబ్సాంగ్ గ్యాత్సో కోరికల మేరకు దీనిని 1680–1681లో మేరాక్ లామా లోడ్రే గ్యాత్సో స్థాపించారు. ఇది వజ్రయాన బౌద్ధమతంలోని గెలుగ్ శాఖకు చెందినది. లాసాలోని డ్రెపుంగ్ విహారంతో దీనికి మతపరమైన అనుబంధం ఉండేది. ఇది బ్రిటిష్ పాలన కాలంలో కూడా కొనసాగింది.
విహారం మూడు అంతస్తులతో చుట్టూ 282 మీటర్ల పొడవైన ప్రహరీ గోడతో ఉంది. ఈ సముదాయంలో 65 నివాస భవనాలు ఉన్నాయి. విహారంలోని గ్రంథాలయంలో విలువైన పురాతన గ్రంథాలు, ప్రధానంగా కాంగ్యూర్, టెంగ్యూర్, ఉన్నాయి.
వ్యుత్పత్తి
[మార్చు]విహారం పూర్తి పేరు తవాంగ్ గల్దాన్ నామ్గ్యే లల్హాట్సే.'తా' అంటే 'గుర్రం', 'వాంగ్' అంటే 'ఎంచుకోబడిన', ఇవి రెండూ కలిసి 'తవాంగ్ ' అనే పదాన్ని ఏర్పరుస్తాయి, దీని అర్థం "గుర్రం ఎంచుకున్న ప్రదేశం". ఇంకా, ' గదాన్ ' అంటే 'స్వర్గం', 'నమ్గేల్' అంటే 'సంపూర్ణ విజయం', 'ల్హాత్సే ' అంటే 'దైవ సంబంధమైన'. అందువల్ల, తవాంగ్ గల్దాన్ నమ్గే లత్సే యొక్క పూర్తి అర్థం "గుర్రం ఎంచుకున్న ప్రదేశం సంపూర్ణ విజయం యొక్క దైవ స్వర్గం". [1]
స్థానం
[మార్చు]

ఈ విహారం ఒక పర్వతం శిఖరాగ్రానికి సమీపంలో, సుమారు 10,000 feet (3,000 m) ఎత్తున ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, శంఖాకార చెట్ల అడవులతో కూడిన తవాంగ్ చూ లోయ అద్భుతమైన దృశ్యం ఇక్కడి ఆకర్షణ. దీనికి దక్షిణ పశ్చిమాలలో ప్రవాహాలచే ఏర్పడిన నిటారు లోయలు, ఉత్తరాన ఒక ఇరుకైన కొండచరియ, తూర్పున తేలికపాటి వాలు ఉన్న భూభాగం ఉన్నాయి. ఆల్పైన్ వృక్షసంపద ఉన్న ఒక వాలుగా ఉన్న కొండచరియ వెంబడి ఉత్తరం వైపు నుండి విహారంలోకి ప్రవేశిస్తారు.[2][3][4][5][1] సమీపంలోని తవాంగ్ పట్టణాంనికి, విహారం పేరు మీదుగా ఆ పేరు వచ్చింది. ఇది రహదారి, రైలు, విమాన సేవలతో బాగా అనుసంధానించబడి ఉంది. సమీప రైల్వే స్టేషన్ అయిన భలూక్పాంగ్ రోడ్డు మార్గాన 280 kilometres (170 mi) దూరంలో ఉంది. తేజ్‌పూర్ విమానాశ్రయం అత్యంత సమీప విమానాశ్రయం. ఇది రోడ్డు మార్గంలో 350 కిలోమీటర్ల దూరంలో ఉంది.[6]
స్థల గాథలు
[మార్చు]
విహారం స్థాపనకు సంబంధించి మూడు గాథలు ఉన్నాయి. మొదటి గాథ ప్రకారం, 5వ దలైలామా ఒక విహారాన్ని స్థాపించమని అప్పగించిన పని మీద వెళ్ళిన మేరాగ్ లామా లోడ్రే గ్యాట్సోకు చెందిన ఒక గుర్రం, ప్రస్తుత విహారం ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసిందని చెబుతారు. తీవ్రంగా వెతికిన తరువాత, అతనికి అనువైన స్థలం దొరక్కపోవడంతో, ఆ స్థలాన్ని ఎంచుకోవడానికి దైవ సహాయం కోరుతూ ప్రార్థనలు చేయడానికి అతను ఒక గుహలోకి వెళ్ళాడు. అతను గుహ నుండి బయటకు వచ్చినప్పుడు, తన గుర్రం కనిపించకుండా పోయింది. అప్పుడు అతను గుర్రం కోసం వెతకడానికి వెళ్ళాడు. చివరకు అది తానా మందెఖాంగ్ అనే పర్వతం పైన మేస్తూ ఉండగా చూసాడు. అది గతంలో కాలా వాంగ్పో రాజుకు చెందిన రాజభవనం. అతను దీనిని దైవసంకల్పంగా, శుభ మార్గనిర్దేశంగా భావించి, ఆ ప్రదేశంలో విహారాన్ని స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక ప్రజల సహాయం కోరి, మేరా లామా 1681 చివరి భాగంలో ఆ ప్రదేశంలో విహారాన్ని స్థాపించాడు.[7][8]
తవాంగ్ అనే పేరు మూలానికి సంబంధించిన రెండవ గాథ, నిధుల అన్వేషకుడైన టెర్టన్ పెమాలింగ్పాతో ముడిపడి ఉంది. ఈ ప్రదేశంలో, అతను తమ్దిన్, కాగ్యాద్ల "దీక్షలు" ఇచ్చాడని చెప్పబడింది. దీని ఫలితంగా "తవాంగ్" అనే పేరు వచ్చింది. 'టా' అనేది "తమ్దిన్" కు సంక్షిప్త రూపం కాగా, 'వాంగ్' అంటే "దీక్ష".[7]

మూడవ గాథ ప్రకారం, లాసా యువరాజుకు చెందిన ఒక తెల్లని గుర్రం మోన్పా ప్రాంతంలో దారితప్పింది. ఆ గుర్రం కోసం వెతుకుతూ వెళ్ళిన ప్రజలు, ప్రస్తుతం విహారం ఉన్న ప్రదేశంలో ఆ గుర్రం మేస్తూ ఉండటాన్ని కనుగొన్నారు. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు ఆ గుర్రాన్ని, అది దొరికిన ప్రదేశాన్నీ పూజిస్తూ, ప్రతి సంవత్సరం దానికి గౌరవం ఇచ్చేవారు. చివరికి, ఆ పవిత్ర స్థలాన్ని గౌరవించటానికి, ఆ ప్రదేశంలో తవాంగ్ విహారాన్ని నిర్మించారు.
విహారంలోని థాంగ్కాపై చిత్రించిన దేవత గురించి చెప్పబడిన మరొక పురాణం పాల్డెన్ లామోకి సంబంధించినది.[9]
చరిత్ర
[మార్చు]
తన సమకాలికుడైన 5వ దలైలామా ఆదేశానుసారం, మెరెక్ లామా లోడ్రే గ్యామ్స్టో 1680–81లో ఈ విహారాన్ని స్థాపించాడు.[2][8][10] తవాంగ్ ప్రాచీన నామమైన త్సోసుమ్ అనే ఎంచుకున్న ప్రదేశంలో విహారాన్ని నిర్మించడంలో మెరెక్ లామా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు, ఆయనకు అన్ని విధాలా సహాయం చేయమని 5వ దలైలామా ఆ ప్రాంత ప్రజలకు ఆదేశాలు జారీ చేశాడు. జోంగ్ పరిధిని నిర్ణయించడానికి, దలైలామా ఒక నూలు ఉండను కూడా ఇచ్చాడు. ఆ నూలు పొడవే విహారం చుట్టుకొలతగా ఉండేది.[11]
తవాంగ్‌లో గెలుగ్ బౌద్ధ శాఖ ఆధిపత్యానికి ముందు, న్యింగ్మాపా లేదా బ్లాక్ హ్యాట్ బౌద్ధ శాఖ ఆధిపత్యం చెలాయించింది. ఇది వారి ఆధిపత్యానికి, వ్యవస్థాపకుడైన మెరెక్ లామా పట్ల శత్రుత్వ వైఖరికి కూడా దారితీసింది. న్యింగ్మాపా శాఖకు చెందిన భూటాన్‌కు చెందిన డ్రుక్పాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశారు. వారు తవాంగ్‌పై దాడి చేసి దానిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నించారు. అందువల్ల, తవాంగ్ విహారాన్ని ఒక కోట లాగా నిర్మించారు. రక్షణ దృక్కోణం నుండి ఒక వ్యూహాత్మక ప్రదేశాన్ని ఎంచుకున్నారు.[3]

1844 లో తవాంగ్ విహారం ఈస్ట్ ఇండియా కంపెనీతో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫిబ్రవరి 24న సంతకం చేసిన ఒక ఒప్పందం, మోన్పాలు తమ కార్లపరా దువార్ హక్కును వదులుకోవడానికి బదులుగా రూ. 5,000 వార్షిక రుసుము (పోసా) చెల్లించడానికి సంబంధించినది. మే 28 నాటి మరొక ఒప్పందం, షార్దుక్పెన్లు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన యొక్క ఏ ఆజ్ఞనైనా పాటించడానికి బదులుగా 2,526 రూపాయల ఏడు అణాల వార్షిక రుసుము చెల్లించడానికి సంబంధించింది. [12] విహారం నుండి విరాళాలు సేకరించడానికి తవాంగ్ అధికారులు దాదాపు అస్సాం మైదాన ప్రాంతాల వరకు ప్రయాణించేవారు.[13] 1874–75లో విహారాన్ని సందర్శించిన ట్రిగ్నోమెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన పండిట్ నైన్ సింగ్ ప్రకారం, విహారంలో ప్రధాన లామాలు సభ్యులుగా ఉండే 'కాటో' అని పిలువబడే పార్లమెంటరీ తరహా పరిపాలన ఉండేది. ఇది జోన్పాన్ (త్సోనా విహారం అధిపతి) పైన, లాసా ప్రభుత్వంపైనా ఆధారపడి లేదు. 1924లో విహారాన్ని సందర్శించిన జి.ఎ. నెవిల్ దీన్ని సమర్థించాడు.[14]

1914 వరకు, భారతదేశంలోని ఈ ప్రాంతం టిబెట్ నియంత్రణలో ఉండేది. అయితే, 1913-14 నాటి సిమ్లా ఒప్పందం ప్రకారం, ఈ ప్రాంతం బ్రిటిషు నియంత్రణలోకి వచ్చింది. [15] [14] టిబెట్, తవాంగ్ ప్రాంతం మొత్తాన్నీ, విహారంతో సహా, తన భూభాగంలోని అనేక వందల చదరపు మైళ్లను బ్రిటిష్ వారికి అప్పగించింది.[16] ఈ వివాదాస్పద భూభాగమే 1962 ఇండో-చైనా యుద్ధానికి ప్రధాన కారణంగా నిలిచింది.[15][14] 1962 అక్టోబరు 20న చైనా ఈశాన్య సరిహద్దు నుండి భారతదేశంపై దాడి చేసి, భారత సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేసింది. వారు విహారంతో సహా తవాంగ్‌ను ఆరు నెలల పాటు ఆక్రమించుకున్నారు. కానీ దానిని అపవిత్రం చేయలేదు.[17] తవాంగ్ టిబెట్‌కు చెందినదని చైనా వాదించింది. మావో సాంస్కృతిక విప్లవం నుండి ఎటువంటి నష్టం లేకుండా రక్షించబడిన టిబెటన్ బౌద్ధమతానికి చెందిన కొద్ది విహారాలలో ఇది ఒకటి. ఈ యుద్ధానికి ముందు, 1959లో, 14వ దలైలామా టిబెట్ నుండి పారిపోయి, కష్టతరమైన ప్రయాణం తర్వాత, 1959 మార్చి 31న భారతదేశంలోకి ప్రవేశించి, తవాంగ్ చేరుకుని, తేజ్‌పూర్‌కు వెళ్లే ముందు కొన్ని రోజుల పాటు విహారంలో ఆశ్రయం పొందాడు.[18] 50 సంవత్సరాల తరువాత, చైనా తీవ్ర నిరసనలు తెలిపినప్పటికీ, 2009 నవంబర్ 8న దలైలామా తవాంగ్ విహారాన్ని సందర్శించడం ఆ ప్రాంత ప్రజలకు ఒక చారిత్రాత్మక సంఘటనగా నిలిచింది. విహారాధిపతి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.[6]
2006 నాటికి విహారంలో 400 మంది సన్యాసులు ఉండేవారు.[19] 2010లో ఈ సంఖ్య 450 ఉన్నట్లు నివేదించబడింది. [4] 2006 ఆగస్టులో విహారంలో తవాంగ్ రాతప్రతుల సంరక్షణ కేంద్రాన్ని స్థాపించారు. ఇక్కడ 200 వ్రాతప్రతులను భద్రపరిచారు. 31 వ్రాతప్రతులను పరిరక్షణ కోసం చికిత్స చేసారు.[20] 2010 నవంబరులో విహారంపై కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని నివేదించబడింది. "దాని చుట్టూ భారీ కొండచరియలు విరిగిపడ్డాయి" అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. [21] యునైటెడ్ కింగ్డమ్ (UK) లోని డర్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన, గుర్తింపు పొందిన కొండచరియల నిపుణుడు, ప్రొఫెసర్ డేవ్ పెట్లీ ఇలా రాసాడు: "ఈ ప్రదేశపు ఉత్తర పార్శ్వంలో కొండచరియల స్కార్ప్ ఉన్నట్లు కనిపిస్తుంది ... దీనికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి - దక్షిణం వైపు ప్రవహించే నది, ఈ ప్రదేశం మలుపుకు వెలుపల ఉండటం వలన వాలు అడుగు భాగాన్ని కోతకు గురిచేస్తోంది. దీర్ఘకాలంలో, ఈ ప్రదేశాన్ని పరిరక్షించాలంటే అడుగు భాగంలో కోతను నివారించవలసి ఉంటుంది." [22]
ఈ విహారానికి ప్రస్తుతం పశ్చిమ కామెంగ్ జిల్లాలోని 17 గోంపాలపై నియంత్రణ ఉంది.[8] రెండు జోంగ్లపై పరిపాలనా నియంత్రణ ఉంది. ఒక్కొక్క దానికి ఒక సన్యాసి అధిపతిగా ఉంటారు; 1831 లో నిర్మించిన దరానా జోంగ్, కామెంగ్ జిల్లా నైరుతి భాగంలో ఉన్న సంగలేం జోంగ్, దీనిని తలుంగ్ గోంపా అని కూడా పిలుస్తారు. ఈ జోంగ్లు పన్నులు వసూలు చేయడమే కాకుండా, కామెంగ్‌లోని మోన్పాలు, షెర్డుక్పెన్లకు బౌద్ధమతాన్ని కూడా బోధిస్తాయి.[23] విహారానికి సోమా, నెర్గుయిట్ గ్రామాలలో సాగు చేయదగిన భూములు మరికొన్ని గ్రామాలలో కొన్ని చిన్న భూములూ ఉన్నాయి. వీటిని రైతులు దున్ని, సాగు చేస్తారు, వారు పండించిన పంటను విహారంతో పంచుకుంటారు. [24] విహారం ప్రస్తుత నివాస అధిపతి అవతార గ్యాల్సీ రిన్పోచే.[15]
2017 లో దలైలామా తవాంగ్ ఆశ్రమాన్ని సందర్శించాడు.[25]
విశేషాలు
[మార్చు]
ప్రవేశ ద్వారం, బయటి గోడలు
[మార్చు]విహారం ప్రవేశద్వారం వద్ద కాకాలింగ్ అని పిలువబడే రంగురంగుల ద్వార నిర్మాణం ఉంది. ఇది "గుడిసె లాంటి" ఆకారంలో నిర్మించబడింది. దీని ప్రక్క గోడలు రాతి కట్టడాలతో నిర్మించబడ్డాయి. కాకాలింగ్ పైకప్పుపై మండలాలు ఉండగా, లోపలి గోడలపై దేవతలు, సాధువుల కుడ్యచిత్రాలు చిత్రించబడ్డాయి. దక్షిణ గోడకు నైరుతి మూల నుండి తొమ్మిదవ కుడ్యచిత్రం ఒక ప్రత్యేకమైనది. ఇది బోన్ మతానికి రక్షక దేవత అయిన నింగ్మెకాన్ది, ఈమెను తవాంగ్ ప్రాంతానికి సంరక్షక దేవతగా పరిగణిస్తారు. కాకాలింగ్ ప్రధాన ద్వారం ముందు, దాని దక్షిణాన, మరొక ప్రవేశ ద్వారం ఉంది.[26][27]
విహారం ప్రధాన ప్రవేశ ద్వారానికి, తెరిచి ఉన్న గేటుకు దక్షిణంగా, ఉత్తరపు గోడపై భారీ తలుపులు ఉన్నాయి. ఈ బయటి గోడ 925 feet (282 m) పొడవు, 10–20 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రధాన ద్వారంతో పాటు, విహారం దక్షిణ భాగంలో మరొక ప్రవేశ ద్వారం ఉంది. దానికి కూడా ఒక భారీ తలుపు ఉంది. ఆ ద్వారానికి దగ్గరగా, గోడలో రెండు చిన్న రంధ్రాలు ఉన్నాయి. వాటి ద్వారా కాకలింగ్కు అనుసంధానించబడిన తూర్పు గోడ యొక్క బయటి భాగాన్ని పూర్తిగా చూడవచ్చు. ఒక ఇతిహాసం ప్రకారం, విహారాన్ని ఎంత వరకు నిర్మించాలో సూచించడానికి, 5వ దలైలామా విహారం గోడల చుట్టూ కట్టడానికి ఒక దారపు ఉండను ఇచ్చారట.[27]
ప్రధాన భవనాలు
[మార్చు]ఒక పెద్ద భవనంలా నిర్మించబడిన ఈ విహారం మూడు అంతస్తులది. ఇందులో ఒక పెద్ద సభా మందిరం, పది ఇతర క్రియాత్మక నిర్మాణాలు, విద్యార్థులు, లామాలు, సన్యాసుల కోసం 65 నివాస గృహాలూ ఉన్నాయి.[4][1][9][27] ఈ విహారంలో ఒక పాఠశాల, దాని స్వంత నీటి సరఫరా సౌకర్యం,[9] బౌద్ధ సాంస్కృతిక అధ్యయనాల కేంద్రం ఉన్నాయి.[2]
విహారం కింది అంతస్తులో ఆచార నృత్యాలు ప్రదర్శించబడతాయి. విహారం గోడలపై బౌద్ధ దేవతలు, సాధువుల అనేక థాంకాలు కూడా ఉన్నాయి. బాల్కనీపై తెరలు వేలాడదీసి ఉన్నాయి. వీటిపై బౌద్ధ చిహ్నాలు చిత్రించబడి ఉన్నాయి. విహారం ప్రాంగణంలో సుమారు 700 మంది సన్యాసులకు వసతి కల్పించడానికి నివాస భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో 450 మంది సన్యాసులు నివసిస్తున్నారు.[2][11][26] విహారాధిపతి విహారానికి ఆగ్నేయ మూలలోని ద్వారం దగ్గర ఉన్న ఒక ఇంట్లో నివసిస్తాడు.[11]

కింది అంతస్తులోని ముందు వరండా గోడపై ఒక రాతి పలక మీద ఉన్న పాదముద్ర ఒక ముఖ్యమైన లక్షణం. ఈ పాదముద్ర చిటెన్పా అని పిలువబడే, విహారంలో నివసించే ఒక నీటి మోసే వ్యక్తిది అని చెబుతారు. అతను విహారంలో చాలా కాలం సేవ చేశాడు. ఒక మంచి రోజున అతను విహారానికి తన సేవను పూర్తి చేశానని ప్రకటించి, ఆపై తన ఎడమ పాదాన్ని రాతి పలకపై బలంగా తొక్కాడు, దీనివల్ల అతని అడుగు ఆకారంలో గుంట ఏర్పడింది. విహారానికి నిజమైన భక్తుడైన ఒక దైవిక వ్యక్తి మాత్రమే రాతి పలకపై అటువంటి ముద్రను సృష్టించగలడనే నమ్మకం ఆ ప్రాంత ప్రజలలో ఉన్నందున, ఈ అడుగును ఒక అద్భుతంగా పూజిస్తారు.[26]


విహారంలోని ప్రధాన ఆలయం, ప్రవేశ ద్వారానికి పశ్చిమాన ఉంది. దీనిని దుఖాంగ్ అని పిలుస్తారు ('దు' అంటే "సమావేశం", 'ఖాంగ్' అంటే "భవనం" [11] ). దీనిని 1860–61లో నిర్మించారు. ఇక్కడ 18 feet (5.5 m) ఎత్తైన పెద్ద బుద్ధుని విగ్రహం ఉంది. ఎత్తులో ఉన్న ఈ విగ్రహం దైవత్వంతో నిండి ఉంది; దీనికి బంగారు పూత పూసి, అలంకరించారు. ఇది పద్మాసనంలో ఉంది. ఈ విగ్రహం సభా మందిరపు ఉత్తర ముఖభాగంలో ఒక వేదికపై ప్రతిష్ఠించబడింది. దాని తల మొదటి అంతస్తు వరకు విస్తరించి ఉంటుంది. [27] బుద్ధుని విగ్రహం పక్కన ఒక వెండి పేటిక ఉంది. దానిలో విహారం సంరక్షక దేవత అయిన స్రో దేవి (పాల్డెన్ లామో) యొక్క ఒక ప్రత్యేకమైన తాంగ్కా ఉంది. 5వ దలైలామా ముక్కు నుండి తీసిన రక్తంతో దీనిని చిత్రించారనీ ఇది ఆ తాంగ్కాకు ఒక దివ్యమైన "జీవించే గుణాన్ని" ఇస్తుందనీ భావిస్తారు. డ్రి దేవి అని కూడా పిలువబడే ఈ తంకా విగ్రహాన్ని 5వ దలైలామా విహారానికి విరాళంగా ఇచ్చారు.[27] ప్రధాన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 2002లో సాంప్రదాయ బౌద్ధ వాస్తుశైలిలో పునరుద్ధరించబడింది. దీనిని చిత్రాలు, కుడ్యచిత్రాలు, చెక్కడాలు, శిల్పాలు మొదలైన వాటితో సుందరంగా అలంకరించారు.[8]
గ్రంథాలయం, గ్రంథాలు
[మార్చు]




విహారంలో స్థానికంగా తయారు చేసిన కాగితాన్ని ఉపయోగించి మతపరమైన పుస్తకాలను ముద్రించడానికి ఒక ముద్రణాలయం ఉంది. ముద్రణ కోసం చెక్క దిమ్మెలను ఉపయోగిస్తారు. ఈ పుస్తకాలను సాధారణంగా అక్షరాస్యులైన మోన్పా లామాలు మతపరమైన ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. [28] రెండవ అంతస్తు మొత్తం గ్రంథాలయంతో నిండి ఉంది. ఇందులో గ్యెటెంగ్పా, డోడుయిపా, మమ్తా, కాంగ్యూర్, టెంగ్యూర్, జుంగ్డుయి గ్రంథాలు ఉన్నాయి. ఇవి కీటకాల దాడి కారణంగా దెబ్బతిన్నాయి. గ్రంథాలయంలోని సేకరణలో బౌద్ధ బోధనలపై వ్యాఖ్యానాలైన టెంగ్యూర్ యొక్క రెండు ముద్రిత పుస్తకాలు (25 సంపుటాలలో); బౌద్ధ బోధనల నియమాల అనువాదమైన కాంగ్యూర్ యొక్క మూడు సెట్లు; ఐదు సంపుటాలలో చాంజియా సంగభూమ్లు ఉన్నాయి. కాంగ్యూర్ యొక్క మూడు సెట్లలో, రెండు చేతివ్రాతవి, ఒకటి ముద్రితమైనది. ముద్రిత సెట్లు 101 సంపుటాలలో ఉన్నాయి. ఒక చేతివ్రాత సెట్లో 131 సంపుటాలు, మరొకదానిలో 125 సంపుటాలు ఉన్నాయి; ఈ 125 పుస్తకాలలోని అక్షరాలు బంగారంతో పూయబడ్డాయి. గ్యెంటోంగ్పా అనే మత గ్రంథంలోని అన్ని పేజీలలో అక్షరాలు బంగారంతో వ్రాయబడి ఉన్నాయి. [26] [23] కొంత కాలానికి, కొన్ని పవిత్ర గ్రంథాలు పోయాయి. దీనికి కారణం శీతాకాలంలో తవాంగ్‌ను సందర్శించే త్సోనా విహారానికి చెందిన సన్యాసులేనని చెప్పబడింది. గతంలో, ఈ సన్యాసులు బుద్ధుని బంగారు పూత పూసిన విగ్రహాన్ని తమకు బహుమతిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని తవాంగ్ విహారం లామాలు అంగీకరించలేదు. ఫలితంగా త్సోనా లామాలు తమ వద్ద ఉన్న తవాంగ్ విహారానికి చెందిన కొన్ని పవిత్ర గ్రంథాలు, రికార్డులను ఇవ్వడానికి నిరాకరించారు. వారు 1951లో మరిన్ని పుస్తకాలను తీసుకువెళ్లారు [11]
ఆచారాలు, పండుగలు
[మార్చు]గెలుగ్ తెగకు చెందిన మోన్పాలు, కామెంగ్ ప్రాంతంలో ఆధిపత్య తెగ. చాలా మంది మోన్పా బాలురు విహారంలో చేరి సన్యాసులుగా మారతారు.[28] యువకులు శిక్షణ కోసం విహారంలో చేరినప్పుడు, అది జీవితకాల నిబద్ధత అనే షరతుపై ఉంటుంది. ఒక సన్యాసి విహారాన్ని విడిచి వెళ్లాలనుకుంటే, భారీ జరిమానా విధిస్తారు. గత ఆచారం ప్రకారం, ముగ్గురు కుమారులు ఉన్న కుటుంబంలో, మధ్య కుమారుడిని విహారంలోకి చేర్చుకునేవారు. ఇద్దరు కుమారులు ఉన్న కుటుంబంలో చిన్న కుమారుడిని తీసుకునేవారు. [19]
విహారంలో జరిగే ప్రధాన మోన్పా పండుగలు చోక్సర్, లోసర్, అజిలాము, టోర్గ్యా. చోక్సర్ పండుగలో లామాలు విహారాలలో మత గ్రంథాలను పఠిస్తారు. మత పఠనాల తరువాత, గ్రామస్థులు ఆ గ్రంథాలను తమ వీపుపై మోసుకుని, తెగుళ్ల బారి నుండి రక్షణ కోసం, మంచి పంట దిగుబడి కోసం ఆశీర్వాదం కోరుతూ తమ వ్యవసాయ భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. టిబెటన్ నూతన సంవత్సరం ప్రారంభాన్ని సూచించే లోసర్ పండుగలో, ప్రజలు విహారాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. [29] టోర్గ్యా, ప్రత్యేకంగా విహారంలో జరిగే వార్షిక పండుగ. ఇది బౌద్ధ క్యాలెండర్ ప్రకారం దావాచుక్చిపా 28 నుండి 30వ తేదీల మధ్య జరుగుతుంది. దీనిని తవాంగ్-టోర్గ్యా అని కూడా పిలుస్తారు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుండి 12వ తేదీలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ఒక మోన్పా వేడుక. ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం దుష్టశక్తులను తరిమికొట్టడం రాబోయే సంవత్సరంలో ప్రజలకు సర్వతోముఖాభివృద్ధినీ ఆనందాన్నీ ప్రసాదించడం.[8][30] మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో, ప్రాంగణంలో రంగురంగుల దుస్తులు, ముసుగులు ధరించిన కళాకారులు ఫా చాన్, లోస్జ్కెర్ చుంగియే వంటి నృత్యాలను ప్రదర్శిస్తారు. వీటిలో రెండవ దానిని విహారంలోని సన్యాసులు ప్రదర్శిస్తారు. ప్రతి నృత్యం ఒక పురాణ గాథను సూచిస్తుంది. దుస్తులూ ముసుగులూ ఆవులు, పులులు, గొర్రెలు, కోతులు మొదలైన జంతు రూపాలను సూచిస్తాయి. [8]
మూలాలు
[మార్చు]- 1 2 3 Bareh 2001, p. 325.
- 1 2 3 4 Dalal 2010, p. 363.
- 1 2 Mibang & Chaudhuri 2004, p. 211.
- 1 2 3 "Landslides hit Tawang monaster". The Times of India. 28 November 2010. Archived from the original on 8 November 2021. Retrieved 23 March 2015.
- ↑ Das 2009, p. 178.
- 1 2 Majumdar, Sanjoy (10 November 2009). "Frontier town venerates Dalai Lama". BBC News. Archived from the original on 6 August 2018. Retrieved 10 November 2009.
- 1 2 "History". National Informatics Centre, Government of India. Archived from the original on 5 January 2015. Retrieved 23 March 2015.
- 1 2 3 4 5 6 Kohli 2002, p. 328.
- 1 2 3 Pal 2014, p. 100.
- ↑ "Tawang District: The Land of Monpas". National Informatics Centre, Government of India. Archived from the original on 13 October 2016. Retrieved 7 September 2009.
- 1 2 3 4 5 Kler 1995, p. 31.
- ↑ Arpi 1962, p. 440.
- ↑ Richardson 1984, p. 149-150.
- 1 2 3 Bose 1997, p. 140.
- 1 2 3 Mullin, p. 159-60.
- ↑ Shakya 2012, p. 530.
- ↑ Kapadia & Kapadia 2005, p. 60.
- ↑ Richardson 1984, p. 210.
- 1 2 Kent, Thomas (15 May 2006). "Young Buddhist monks lead insular lives in India". Spero News. Archived from the original on 25 May 2011. Retrieved 7 September 2009.
- ↑ "National Conservation Centres". National Mission for Manuscripts. Archived from the original on 6 May 2012.
- ↑ "Landslides hit Tawang monastery". The Times of India. 28 November 2010. Archived from the original on 4 November 2012.
- ↑ "Acute landslide threats to the Tawang Monastery, northern India". American Geophysical Union. 28 November 2010. Archived from the original on 3 December 2010. Retrieved 1 December 2010.
- 1 2 Bareh2001, p. 31.
- ↑ Kler 1995, p. 32.
- ↑ Barry, Ellen (6 April 2017). "Dalai Lama's Journey Provokes China, and Hints at His Heir". The New York Times. Archived from the original on 13 April 2017. Retrieved 13 April 2017.
- 1 2 3 4 Mibang & Chaudhuri 2004, p. 212.
- 1 2 3 4 5 "Tawang Monastery (Gonpa)". Tawang Monastery organization. Archived from the original on 24 November 2009. Retrieved 7 September 2009.
- 1 2 Bisht 2008, p. 100.
- ↑ Bisht 2008, p. 101.
- ↑ Pathak & Gogoi 2008, p. 27-30.
- వనరులు
- Arpi, Claude i (1962). 1962 and the McMahon Line Saga. Lancer Publishers LLC.
- Bareh, Hamlet (2001). Encyclopaedia of North-East India. Mittal Publications. ISBN 978-81-7099-788-7.
- Bisht, Ramesh Chandra (1 January 2008). International Encyclopaedia Of Himalayas (5 Vols. Set). Mittal Publications. ISBN 978-81-8324-265-3.
- Bose, Manilal (1997). History of Arunachal Pradesh. Concept Publishing Company. ISBN 978-81-7022-666-6.
- Dalal, Roshen (2010). The Religions of India: A Concise Guide to Nine Major Faiths. Penguin Books India. ISBN 978-0-14-341517-6.
- Das, Gautam (2009). China-Tibet-India: The 1962 War and the Strategic Military Future. Har-Anand Publications. ISBN 978-81-241-1466-7.
- Kapadia, Harish; Kapadia, Geeta (2005). Into the Untravelled Himalaya: Travels, Treks, and Climbs. Indus Publishing. ISBN 978-81-7387-181-8.
- Kler, Gurdip Singh (1995). Unsung Battles of 1962. Lancer Publishers. ISBN 978-1-897829-09-7.
- Kohli, M.S. (2002). Mountains of India: Tourism, Adventure and Pilgrimage. Indus Publishing. ISBN 978-81-7387-135-1.
- Mibang, Tamo; Chaudhuri, Sarit Kumar (2004). Understanding Tribal Religion. Mittal Publications. ISBN 978-81-7099-945-4.
- Mullin, Glenn H. The Practice of the Six Yogas of Naropa. Snow Lion Publications. ISBN 978-1-55939-905-0.
- Pal, Susant (5 February 2014). Imbibed In Faith. Author Solutions, Incorporated. ISBN 978-1-4828-1259-6.
- Pathak, Guptajit; Gogoi, Raju (2008). Cultural fiesta in the "Island of peace" Arunachal Pradesh. Mittal Publications. ISBN 978-81-8324-231-8.
- Richardson, Hugh (1984). Tibet and Its History. Shambhala. ISBN 978-0-87773-376-8.
- Shakya, Tsering (29 February 2012). Dragon In The Land Of Snows: The History of Modern Tibet since 1947. Random House. ISBN 978-1-4481-1429-0.
