Jump to content

తాడిక్ చిజే

వికీపీడియా నుండి

తాడిక్ చిజే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు మెచుకా శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పని చేశాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

తాడిక్ చిజే 1978 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెచుకా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అభ్యర్థి టాపిక్ రిన్యాపై 784 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1980 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనా చేతిలో 382 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

తాడిక్ చిజే 1984 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెచుకా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనాపై 182 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1990 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనా చేతిలో 270 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

తాడిక్ చిజే 1995 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెచుకా శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనా చేతిలో 211 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి అరుణాచల్ కాంగ్రెస్ అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనాపై 1,619 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

తాడిక్ చిజే 2004 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెచుకా శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పసంగ్ వాంగ్చుక్ సోనాపై 679 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Former Minister Tadik Chije passes away". The Arunachal Times. 11 October 2017. the original నుండి 5 June 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2025.
  2. "Veteran politician Tadik Chije passes away". Eastern Sentinel. 10 October 2017. the original నుండి 27 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 May 2025.
  3. "Former Minister passes away" (in ఇంగ్లీష్). Assam Tribune. 15 September 2010. the original నుండి 27 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 May 2025.