తాడిమడ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాడిమడ జలపాతం
అనంతగిరి జలపాతం
TadimadaWaterfalls.jpg
తాడిమడ జలపాతం
తాడిమడ జలపాతం is located in Andhra Pradesh
తాడిమడ జలపాతం
ప్రదేశంఅనంతగిరి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశరేఖాంశాలు18°17′14″N 83°6′43″E / 18.28722°N 83.11194°E / 18.28722; 83.11194Coordinates: 18°17′14″N 83°6′43″E / 18.28722°N 83.11194°E / 18.28722; 83.11194
రకంPlunge
మొత్తం ఎత్తు100 ft (30 m)
పొడవైన బిందువు100 ft (30 m)

తాడిమడ జలపాతం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా, అనంతగిరి వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతము మరియు పర్యాటక ప్రదేశము.

నేపధ్యము[మార్చు]

ఈ జలపాతాన్ని అనంతగిరి జలపాతం అని కూదా పిలుస్తారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. అనంతగిరి నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి మరియు అరకు లోయ ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే రహదారి చాలా చిన్నగానూ మరియు గతుకులమయముగా ఉంది. సాధారణ వాహనాలు ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.[1]

ఈ జలపాతం వద్దనున్ను రాళ్ళు నున్నగా ఉండి, పాచిపట్టి ఉంటాయి. అందువలన వాటిపైకి ఎక్కేటపుడు జారి పడే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడి నీటిలో సందర్శకులు ఈదవచ్చు. కానీ ఇక్కడి నీరు మురికిగా ఉంటాయి. కావున ఈదకపోవడమే సురక్షితము.

ఎంత దూరము[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]