టి.ఎల్.వి.ప్రసాద్

వికీపీడియా నుండి
(తాతినేని ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తాతినేని లక్ష్మీ వరప్రసాద్
జననంటి.ఎల్.వి.ప్రసాద్
మార్చి 21, 1952
కృష్ణా జిల్లా, విజయవాడ
ఇతర పేర్లువర ప్రసాద్, తాతినేని ప్రసాద్
ప్రసిద్ధిభారతీయ సినిమా దర్శకుడు
మతంహిందూ
తండ్రితాతినేని ప్రకాశరావు
తల్లిఅన్నపూర్ణ
వెబ్‌సైటు
http://www.tlvprasad.net/

టి.ఎల్.వి.ప్రసాద్ భారతీయ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. ఇతడు సినిమా దర్శకుడు తాతినేని ప్రకాశరావు కుమారుడు. ఇతడు తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1952, మార్చి 21వ తేదీన తాతినేని ప్రకాశరావు, అన్నపూర్ణ దంపతులకు విజయవాడలో జన్మించాడు. ఇతడు తన సినీజీవితాన్ని 1979లో కుడి ఎడమైతే చిత్రం ద్వారా ప్రారంభించాడు. తెలుగులో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి నటులతో పనిచేశాడు. 1992లో మిథున్ చక్రవర్తి హీరోగా "జనతా కీ అదాలత్" అనే సినిమా తీసి బాలీవుడ్‌లో ప్రవేశించాడు. ఆ చిత్రం గొప్ప విజయవంతం కావడంతో మిథున్ చక్రవర్తితో 8 ఏళ్ళ వ్యవధిలో 35 సినిమాలు తీసి రికార్డు సృష్టించాడు. ఇంకా బెంగాలీలో 4, మరాఠీలో 1 చిత్రం ఇతని ఖాతాలో ఉన్నాయి.

తెలుగు సినిమాల జాబితా

[మార్చు]

ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు సినిమాలు ఈ విధంగా ఉన్నాయి:

క్రమసంఖ్య సినిమా పేరు నటీనటులు విడుదలైన సంవత్సరం
1 కుడి ఎడమైతే నూతన్ ప్రసాద్, ఫటాఫట్ జయలక్ష్మి 1979
2 ఛాలెంజ్ రాముడు ఎన్.టి.రామారావు,జయప్రద ,గుమ్మడి 1980
3 రాణీకాసుల రంగమ్మ చిరంజీవి,జగ్గయ్య ,శ్రీదేవి 1981
4 టింగు రంగడు చిరంజీవి,గీత,జగ్గయ్య 1982
5 మనిషికో చరిత్ర మురళీమోహన్,సుహాసిని, చంద్రమోహన్, ప్రభ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, పూర్ణిమ, హేమసుందర్ 1983
6 మనిషికి మరోపేరు చంద్రమోహన్, రంగనాథ్, సుధాకర్, తులసి, గొల్లపూడి మారుతీరావు 1983
7 ఈ తీర్పు ఇల్లాలిది మోహన్ బాబు, సుజాత 1984
8 ఇల్లాలికో పరీక్ష మోహన్‌బాబు,భానుప్రియ ,శారద 1985
9 ఇల్లాలే దేవత అక్కినేని నాగేశ్వరరావు, భానుప్రియ, రాధిక 1985
10 డిస్కో కింగ్ బాలకృష్ణ , తులసి 1984
11 ఆత్మబంధం 1991
12 పల్నాటి పులి నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, కొంగర జగ్గయ్య 1984
13 నాగు చిరంజీవి, రాధ 1984
14 శుభముహూర్తం మురళీమోహన్,సుహాసిని 1983
15 రామాయణంలో భాగవతం చంద్ర మోహన్ , భానుప్రియ 1984
16 ఆక్రందన చంద్రమోహన్ , జయసుధ , దీప 1985
17 ధర్మపత్ని సుమన్, భానుప్రియ 1987
18 మా ఇంటి మహాలక్ష్మి మోహన్‌బాబు, రాధ 1987
19 పరాజిత ఆనంద్ బాబు, జయసుధ 1986
20 రాగం తానం పల్లవి చంద్రమోహన్
21 ఖైదీదాదా సుమన్, బ్రహ్మానందం,రాధ 1990
22 ఇల్లాలి ప్రతిజ్ఞ చంద్రమోహన్ , మనోచిత్ర, నరేష్ 1986
23 ఆత్మ బలం నందమూరి బాలకృష్ణ , భానుప్రియ 1985

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]