తానేటి వ‌నిత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తానేటి వ‌నిత
తానేటి వ‌నిత


హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రి[1]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 ఏప్రిల్ 11 - ప్రస్తుతం

మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 జూన్ 8 - 2022 ఏప్రిల్ 10

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23 - 2023
ముందు కేఎస్‌ జవహర్‌
నియోజకవర్గం కొవ్వూరు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు మద్దాల సునీత
నియోజకవర్గం గోపాలపురం
నియోజకవర్గం గోపాలపురం

వ్యక్తిగత వివరాలు

జననం 24 జూన్ 1975
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (2011 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి శ్రీనివాసరావు
సంతానం ప్రణతి
నివాసం కొవ్వూరు
మతం హిందూ

తానేటి వ‌నిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు.ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమె 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి,[2] [3] 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

తానేటి వ‌నిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి, గోపాలపురంలో 1975లో జొన్నకూటి బాబాజీరావు, సుశీలమ్మ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1995లో ఎమ్మెస్సీ, ఎంఈడీ పూర్తి చేసింది. ఆమె రాజకీయాల్లోకి రాకముందు నల్లజర్లలోని సహకార జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసింది.[5]

రాజకీయ జీవితం[మార్చు]

తానేటి వ‌నిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో గోపాలపురం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మద్దాల సునీత పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. వ‌నిత 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 4 నవంబర్ 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది. ఆమె 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితురాలైంది.[6]వనిత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి కేఎస్‌ జవహర్‌ చేతిలో ఓడిపోయింది. తానేటి వ‌నిత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి వంగ‌ల‌పూడి అనిత పై ఎమ్మెల్యేగా గెలిచింది.[7] ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి,[8] 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[9][10]

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (12 April 2022). "వనితకు హోం!" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  2. V6 Velugu, V6 (8 June 2019). "ఏపీ కొత్త మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hans India, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  4. HMTV (11 April 2022). "తానేటి వనితకు కీలక హోం శాఖ..." Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. Eenadu (14 May 2022). "ముగ్గురు వారే..ఒక్కరు మారే". Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.
  6. Sakshi (6 September 2014). "వైసీపీ కార్యవర్గంలో ఐదుగురికి చోటు". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  7. Sakshi (8 June 2019). "Andhra Pradesh Know Your Minister: Taneti Vanitha". Sakshi Post (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  8. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  10. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)