తారా అలీషా బెర్రీ
తారా అలీషా బెర్రీ | |
---|---|
జననం | మే 19, 1988 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | చలనచిత్ర, రంగస్థల నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
తారా అలీషా బెర్రీ భారతీయ చలనచిత్ర, రంగస్థల నటి. హిందీ, తెలుగు చిత్రాలలో నటించిన తారా అలీషా 2011లో 100% లవ్ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించింది.[1][2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]తారా అలీషా బెర్రీ 1988, మే 19న గౌతం బెర్రీ, నందిని సేన్ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. బెంగుళూరులో తన విద్యను పూర్తి చేసి, కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని చాప్మన్ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్‌లతోపాటు నట శిక్షణకు సంబంధించిన కోర్సు చేసింది.
నాటకరంగం
[మార్చు]ముంబైకి వచ్చి క్రియేటింగ్ కారక్టర్స్ వద్ద 4 నెలలపాటు పనిచేసి, నాటకరంగ ప్రముఖులు నిర్వహించిన 3 వారాల ఇంటెన్సివ్ డ్రామా ప్రోగ్రాంలో నటించింది.
సినిమారంగం
[మార్చు]2011లో ఈరోస్ నిర్మించిన ఖాన్గర్జి అనే మ్యూజిక్ వీడియోలో షాన్ తో కలిసి నటించింది. ఈమె తొలి హిందీ చిత్రం మాస్ట్రామ్ (2014).[2] రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కథల ఆధారంగా 2015లో ఎపిక్ ఛానెల్‌లో కోసం అనురాగ్ బసు దర్శకత్వం వహించిన చోఖేర్ బాలి సిరీస్లో నటించింది.[1] 2015, సెప్టెంబరు 11న ప్రకాష్ నంబియార్ దర్శకత్వం వహించిన ది పర్ఫెక్ట్ గర్ల్ విడుదలైంది.[3] వివేష్ భట్ దర్శకత్వంలో విశేష్ ఫిల్మ్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన లవ్ గేమ్స్ చిత్రంలో నటించింది.[4][5]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2011 | 100% లవ్ | స్వప్న | తెలుగు | తొలిచిత్రం |
2011 | మనీ మనీ మోర్ మనీ | మేఘన | తెలుగు | |
2014 | మాస్ట్రామ్ | రేణు | హిందీ | హిందీ తొలిచిత్రం |
2015 | ది పర్ఫెక్ట్ గర్ల్ | వేదిక | హిందీ | 2015, సెప్టెంబరు 11న విడుదల |
2016 | మరీచిక | ఓని | బెంగాళీ | లఘుచిత్రం |
2016 | లవ్ గేమ్స్ | అలీషా ఆస్తాన | హిందీ | ఏప్రిల్ 2016 |
2017 | అగమ్ | సార్లా | హిందీ | |
2018 | లవ్ లస్ట్ అండ్ కన్ఫ్యూజన్ | పొరోమా సర్కార్ | హిందీ | వెబ్ సిరీస్ |
2018 | మరుధర్ ఎక్స్‌ప్రెస్ | చిత్ర | హిందీ | |
2019 | గన్ పే డన్ | **** | హిందీ | |
2019 | ఎ1 | దివ్య | తమిళం | తమిళ తొలిచిత్రం |
2019 | లవ్ లస్ట్ అండ్ కన్ఫ్యూజన్ 2 | పొరోమా సర్కార్ | హిందీ | వెబ్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Tara Alisha Berry in Anurag Basu's telefilm 'Chokher Bali'". mid-day. 31 March 2015. Archived from the original on 30 June 2018. Retrieved 6 January 2020.
- ↑ 2.0 2.1 Tellychakkar Team (1 May 2014). "I laughed after reading Mastram's novels – Tara Alisha Berry". Tellychakkar.com. Archived from the original on 26 ఫిబ్రవరి 2019. Retrieved 7 January 2020.
- ↑ "The Perfect Girl Movie Review". The Times of India. Archived from the original on 8 December 2018. Retrieved 7 January 2020.
- ↑ "Being a Bhatt heroine is a dream come true, says Tara Alisha Berry". The Times of India. Archived from the original on 13 March 2019. Retrieved 7 January 2020.
- ↑ "Tribunal clears erotic thriller without cuts". Mumbai Mirror. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 7 January 2020.