Jump to content

తారా జౌహర్

వికీపీడియా నుండి
తారా జౌహర్ చిత్రం

తారా జౌహర్ (జననం 1936) ఢిల్లీకి చెందిన ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త. భారతీయ తత్వవేత్త, యోగ గురువు, కవి అయిన శ్రీ అరబిందో బోధనల ప్రచారానికి ఈమె తన జీవితాన్ని అంకితం చేశారు. 1956లో తన తండ్రి సురేంద్ర నాథ్ జౌహర్ స్థాపించిన శ్రీ అరబిందో ఆశ్రమం ఢిల్లీ శాఖకు ఈమె అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. శ్రీ అరబిందో బోధనలను వ్యాప్తి చేయడంలో ఈమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.[1]

జీవితం - కృషి

[మార్చు]

తారా జౌహర్ 1936లో సురేంద్ర నాథ్ జౌహర్, దయావతి దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. ఈమె తండ్రి సురేంద్ర నాథ్ జౌహర్ స్వాతంత్ర్య సమరయోధుడు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో ముల్తాన్ సెంట్రల్ జైలులో 15 నెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు.[2] 1939 నుండి సురేంద్ర నాథ్‌కు పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంతో అనుబంధం ఉంది. ఆ కారణం చేత తారా జౌహర్ చిన్నప్పటి నుండే ఆశ్రమ వాతావరణంలో పెరిగి అక్కడే విద్యనభ్యసించారు. ఈమె 1944లో తన ఎనిమిదేళ్ల వయసులో ఆశ్రమానికి వచ్చారు. ఢిల్లీకి మారకముందు సుమారు 30 ఏళ్ల పాటు ఆశ్రమంలోనే గడిపారు.

ఢిల్లీకి వచ్చిన తర్వాత తన తండ్రితో కలిసి అరబిందో ఆశ్రమ ప్రాంగణంలోనే 'ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్', 'మిరాంబిక ఫ్రీ ప్రోగ్రెస్ స్కూల్' అనే రెండు ప్రసిద్ధ పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. హిమాలయ ప్రాంతంలో 'వాన్ నివాస్' (నైనిటాల్), 'మధుబన్' (రామ్‌గఢ్) పేరుతో రెండు ధ్యాన కేంద్రాల ఏర్పాటుకు తోడ్పడ్డారు. అరబిందో ఆశ్రమ ఢిల్లీ శాఖ ప్రస్తుతం శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్‌ను కూడా నిర్వహిస్తోంది.[3][4]

గౌరవ పురస్కారాలు

[మార్చు]

పద్మశ్రీ: సాహిత్యం, విద్యారంగంలో ఈమె చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.[5] "శ్రీ అరబిందో బోధనల ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన రచయిత్రి, విద్యావేత్త"గా ఈమెను ప్రభుత్వం కొనియాడింది.[1]

ఆరో-రత్న అవార్డు: కోల్‌కతాలోని ఓవర్‌మాన్ ఫౌండేషన్ ఈమెకు 2017లో ఆరో-రత్న పురస్కారాన్ని ప్రకటించింది.[6]

వివాదాలు

[మార్చు]

ది మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రవేశాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఈమెపై వచ్చాయి.

పద్మశ్రీ పురస్కారం కోసం లాబీయింగ్ చేశారనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

== పుస్తకాలు == శ్రీ అరబిందో సహచరి అయిన 'ది మదర్' (మీరా అల్ఫాసా) తో తనకున్న అనుభవాలను వివరిస్తూ తారా జౌహర్ కొన్ని పుస్తకాలు రాశారు.

లెర్నింగ్ విత్ ది మదర్ (Learning with the Mother)[7]

గ్రోయింగ్ అప్ విత్ ది మదర్ (Growing Up with the Mother)[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు (2020–2029)

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Padma Awards 2022". Padma Awards. Ministry of Home Affairs, Govt of India. Archived from the original on 2022-01-29. Retrieved 11 February 2022.
  2. "Surendra Nath Jauhar". SRI AUROBINDO & THE MOTHER. Retrieved 13 March 2022.
  3. "All USA Meeting (AUM) 2020 is Cancelled". Matagiri Sri Aurobindo Center. Matagiri Sri Aurobindo Center, New York. Retrieved 13 March 2022.
  4. "Aurobindo Ashram, Delhi Branch Trust". Aurobindo Ashram, Delhi Branch Trust. Retrieved 14 March 2022.
  5. "Padma Awards 2022" (PDF). Padma Awards. Ministry of Home Affairs, Govt of India. Archived (PDF) from the original on 2022-01-25. Retrieved 11 February 2022.
  6. "Tara Jauhar awarded the "Auro-Ratna Award" for the year 2017". Overman Foundation. Retrieved 13 March 2022.
  7. Tara Jauhar. Learning with the Mother. The Incarnate World. Retrieved 13 March 2022.
  8. Tara Jauhar (1 January 2015). Growing Up with the Mother. New Delhi: Matri Store.

బయటి లింకులు

[మార్చు]

శ్రీ అరబిందో ఆశ్రమం ఢిల్లీ శాఖ వెబ్‌సైట్

తారా జౌహర్ ఇంటర్వ్యూ - మొదటి భాగం Video యూట్యూబ్లో

తారా జౌహర్ ఇంటర్వ్యూ - రెండవ భాగం Video యూట్యూబ్లో

మూస:సాహిత్యం, విద్యారంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు