Jump to content

తారిఖ్ రెహమాన్

వికీపీడియా నుండి

మూస:Current event

తారిఖ్ రెహమాన్
তারেক রহমান
2026లో రెహమాన్
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి
Assuming office
2026
అధ్యక్షుడుమొహమ్మద్ షహబుద్దీన్
Succeedingముహమ్మద్ యూనస్ (చీఫ్ అడ్వైజర్‌గా)
9వ సభానాయకుడు
Assuming office
2026
Succeedingషేక్ హసీనా (2024)
చైర్మన్, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
Assumed office
9 జనవరి 2026
తాత్కాలిక: 8 ఫిబ్రవరి 2018 – 8 జనవరి 2026
సెక్రటరీ జనరల్మిర్జా ఫకృల్ ఇస్లాం ఆలంగిర్
అంతకు ముందు వారుఖలేదా జియా
పార్లమెంటు సభ్యుడు
Assumed office
YTD
అంతకు ముందు వారుమొహమ్మద్ ఎ. అరఫత్
నియోజకవర్గంఢాకా-17
Assumed office
YTD
అంతకు ముందు వారురాగేబుల్ అహసాన్ రిపు
నియోజకవర్గంభోగ్రా-6
వ్యక్తిగత వివరాలు
జననం (1965-11-20) 1965 నవంబరు 20 (వయసు: 60)[1]
ఢాకా, తూర్పు పాకిస్థాన్, పాకిస్థాన్
రాజకీయ పార్టీబంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
జీవిత భాగస్వామి
బంధువులు
సంతానంజైమా రెహమాన్ (కూతురు)
తల్లిఖలేదా జియా
తండ్రిజియావుర్ రెహమాన్
బంధువులుమజుందార్-జియా కుటుంబం చూడండి
నివాసంహౌస్ నం.196, గుల్షన్ అవెన్యూ
కళాశాలBAF షాహీన్ కాలేజ్ ఢాకా
సంతకం
మారుపేరుపినూ

తారిఖ్ రెహమాన్ (జననం 20 నవంబర్ 1965), స్థానికంగా తారిఖ్ జియాగా సుపరిచితుడు. ఈయన బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి.[2] 2026 నుండి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్‌గా ఉన్నారు. భోగ్రా-6, ఢాకా-17 నియోజకవర్గాల నుండి జాతీయ సంసద్ (పార్లమెంటు) సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[3] తన తల్లి ఖలేదా జియా జైలు పాలైనప్పటి నుండి ఆమె మరణించే వరకు, 2018 ఫిబ్రవరి నుండి పార్టీ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.[4] ఈయన బంగ్లాదేశ్ 7వ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రి ఖలేదా జియాల పెద్ద కుమారుడు.

2000ల ప్రారంభంలో తల్లి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రెహమాన్ BNPలో కీలక నేతగా ఎదిగారు. 2008 సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ భారీ విజయం సాధించిన తరువాత,[5] భద్రతా కారణాల దృష్ట్యా లండన్‌లో ప్రవాస జీవితం గడిపారు.[6] షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో అవినీతి, లంచం, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల సముపార్జన, 2004 ఢాకా గ్రెనేడ్ దాడి వంటి అనేక ఆరోపణలపై కోర్టులు ఈయనను దోషిగా నిర్ధారించాయి.[7] 2007 తర్వాత ఈయనపై మొత్తం 84 కేసులు నమోదయ్యాయి.[8] ఇవి రాజకీయ ప్రేరేపిత తప్పుడు ఆరోపణలని BNP పేర్కొంది. 2024లో అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తరువాత, కోర్టు ఈయనను అన్ని ఆరోపణల నుండి విముక్తుడిని చేసి, శిక్షను రద్దు చేసింది.[9] తదనంతరం 2025 చివరలో బంగ్లాదేశ్ తిరిగి వచ్చారు.[10] 2026 సాధారణ ఎన్నికల్లో BNP భారీ విజయం సాధించింది. రెహమాన్ మొదటిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఫలితాల తుది ప్రకటన తర్వాత దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

రెహమాన్ 1965 నవంబర్ 20న తూర్పు పాకిస్థాన్‌లోని ఢాకా (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జన్మించారు. భోగ్రా జిల్లా, గబ్తాలీ ఉపజిల్లాలోని బాగ్బారీకి చెందిన ప్రసిద్ధ బెంగాలీ ముస్లిం మండల్ కుటుంబానికి చెందినవారు.[11] తండ్రి జియావుర్ రెహమాన్ పాకిస్థాన్ ఆర్మీ అధికారి, తరువాత బంగ్లాదేశ్ అధ్యక్షుడయ్యారు. తల్లి ఖలేదా జియా గృహిణి, తరువాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యారు.

రెహమాన్ BAF షాహీన్ కాలేజ్ ఢాకాలో విద్యాభ్యాసం ప్రారంభించారు.[12] సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్య పూర్తయ్యాక, 1985–86 విద్యా సంవత్సరంలో ఢాకా విశ్వవిద్యాలయంలో న్యాయ విభాగంలో చేరారు. తరువాత అంతర్జాతీయ సంబంధాల విభాగానికి మారారు. అయితే, డిగ్రీ రెండవ సంవత్సరంలోనే విశ్వవిద్యాలయ విద్యను ఆపివేసి టెక్స్‌టైల్ పరిశ్రమ, షిప్పింగ్ రంగంలో వ్యాపారాన్ని ప్రారంభించారు.[13]

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ప్రారంభ రాజకీయ జీవితం

[మార్చు]

1988లో భోగ్రాలోని గబ్తాలీ ఉపజిల్లా BNP శాఖలో ప్రాథమిక సభ్యుడిగా రెహమాన్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.[14] 1991 జాతీయ ఎన్నికల సమయంలో తన తల్లి ఖలేదా జియా పోటీ చేసిన నియోజకవర్గాల్లో BNP ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.

1996 నుండి 2001 వరకు అవామీ లీగ్ ప్రభుత్వ హయాంలో, ప్రతిపక్ష రాజకీయ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. 2001 జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించింది.

ప్రవాసం, పునరాగమనం

[మార్చు]

2008 సెప్టెంబర్ 11న తల్లి ఖలేదా విడుదలైన తరువాత, వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లారు. 2009 డిసెంబర్ 8న BNP 5వ జాతీయ కౌన్సిల్‌లో రెహమాన్ పార్టీ సీనియర్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.[15] 2018లో తల్లి జైలు పాలైన తరువాత పార్టీ తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.

2008 నుండి ప్రవాసంలో ఉన్న రెహమాన్, 2025 డిసెంబర్ 25న తన భార్య జుబైదా రెహమాన్, కుమార్తె జైమా రెహమాన్‌లతో కలిసి బంగ్లాదేశ్ తిరిగి వచ్చారు.[16] తన తల్లి మరణానంతరం 2026 జనవరి 9న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పూర్తిస్థాయి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.[17]

నియమిత ప్రధానమంత్రి

[మార్చు]

2026 సాధారణ ఎన్నికల్లో BNP భారీ విజయం సాధించింది.[18] రెహమాన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.[19]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రెహమాన్ 1994 ఫిబ్రవరి 3న జుబైదా రెహమాన్‌ను వివాహం చేసుకున్నారు.[20] ఆమె వృత్తిరీత్యా వైద్యురాలు. బంగ్లాదేశ్ నేవీ మాజీ చీఫ్ రియర్ అడ్మిరల్ మహబూబ్ అలీ ఖాన్ చిన్న కుమార్తె. వీరి ఏకైక కుమార్తె జైమా రెహమాన్ ఒక బారిస్టర్.[21]

మూలాలు

[మార్చు]
  1. "Tarique Rahman turns 60 amid no birthday celebrations". The Daily Observer. 20 నవంబరు 2024.
  2. "BNP sailing to victory in Bangladesh, Tarique Rahman set to be PM". Hindustan Times (in ఇంగ్లీష్). 13 ఫిబ్రవరి 2026. Retrieved 13 ఫిబ్రవరి 2026.
  3. "Tarique wins both Dhaka-17, Bogura-6 seats". The Business Standard (in ఇంగ్లీష్). 13 ఫిబ్రవరి 2026. Retrieved 13 ఫిబ్రవరి 2026.
  4. "Tarique Rahman acting chairman: BNP leader". The Daily Star (in ఇంగ్లీష్). 8 ఫిబ్రవరి 2018.
  5. Sengupta, Somini; Manik, Julfikar Ali (30 డిసెంబరు 2008). "Secular Party Wins Landslide Victory in Bangladesh". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 9 మే 2023.
  6. "What Tarique Rahman's 'return' from political exile could mean for Bangladesh". India Today (in ఇంగ్లీష్). 2 డిసెంబరు 2024.
  7. "Bangladesh court jails opposition leader's son" (in ఇంగ్లీష్). Al Jazeera. 21 జూలై 2016. Retrieved 3 ఆగస్టు 2025.
  8. "Tarique, Zubaida now cleared of all cases". New Age (Bangladesh). 3 ఆగస్టు 2025. Retrieved 3 ఆగస్టు 2025.
  9. "Bangladesh court acquits Zia's son and 48 others convicted in 2004 deadly grenade attack". Associated Press (in ఇంగ్లీష్). 1 డిసెంబరు 2024.
  10. "Prospect for Premier Returns to Bangladesh After 17 Years in Exile". The New York Times. 25 డిసెంబరు 2025. Retrieved 25 డిసెంబరు 2025.
  11. "Tarique Rahman: A timeline of rise, exile and return". Dhaka Tribune (in ఇంగ్లీష్). Retrieved 3 జనవరి 2026.
  12. "যেভাবে বিএনপির শীর্ষ নেতৃত্বে উঠে এলেন তারেক রহমান". BBC Bangla (in Bengali). 24 డిసెంబరు 2025. Retrieved 31 జనవరి 2026.
  13. "Tarique Rahman". tariquerahman.net (in బ్రిటిష్ ఇంగ్లీష్). BNP. Retrieved 28 డిసెంబరు 2025.
  14. "BNP acting chairman Tarique turns 60". The Financial Express (in ఇంగ్లీష్). 21 నవంబరు 2024.
  15. "Tarique made senior vice chair". bdnews24.com. 8 డిసెంబరు 2009. Retrieved 21 డిసెంబరు 2013.
  16. "Tarique Rahman returns to Bangladesh after 17 years". Prothom Alo (in ఇంగ్లీష్). 25 డిసెంబరు 2025. Retrieved 25 డిసెంబరు 2025.
  17. "Tarique Rahman made BNP chairperson". Dhaka Tribune (in ఇంగ్లీష్). 9 జనవరి 2026. Retrieved 9 జనవరి 2026.
  18. "Bangladesh elections: BNP set for victory in landmark vote". dw.com (in ఇంగ్లీష్). 13 ఫిబ్రవరి 2026. Retrieved 13 ఫిబ్రవరి 2026.
  19. Ellis-Petersen, Hannah (13 ఫిబ్రవరి 2026). "Bangladesh election: BNP claims win in historic first election since overthrow of Hasina". The Guardian. Retrieved 13 ఫిబ్రవరి 2026.
  20. "Khaleda, senior BNP leaders wish Tarique on his 60th birthday". Dhaka Tribune (in ఇంగ్లీష్). UNB. 20 నవంబరు 2024.
  21. ব্যারিস্টার হলেন তারেক কন্যা জাইমা. Daily Naya Diganta (in Bengali). 4 డిసెంబరు 2019. Archived from the original on 23 ఫిబ్రవరి 2020. Retrieved 23 ఫిబ్రవరి 2020.