తాహెర్ బిన్ హందాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తాహెర్‌ బిన్‌ హమ్‌దాన్‌

చైర్మన్
తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ
పదవీ కాలం
2024 మార్చి 1 – ప్రస్తుతం
ముందు మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్

వ్యక్తిగత వివరాలు

జననం 1960
సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం నిజామాబాద్ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

తాహెర్‌ బిన్‌ హమ్‌దాన్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మార్చి 1న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్​గా నియమితులయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

తాహెర్ బిన్ హందాన్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1981 నుండి 1987 వరకు ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1985లో నిజామాబాద్ అర్బన్‌ నుండి 1994లో బోధన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తాహెర్ బిన్ హందాన్ 2005లో సిరికొండ జడ్పీటీసీగా ఎన్నికై  జడ్పీ వైస్ ఛైర్మన్‌గా[2], ఆ తరువాత జడ్పీలో ఏర్పడిన పరిణామాలతో 2008 నుంచి ఏడాది కాలం ఇన్​ఛార్జ్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2012లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడై 2018 వరకు పని చేశాడు. తాహెర్ బిన్ హందాన్ 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3]

తాహెర్ బిన్ హందాన్  ప్రభుత్వ టెలికాం డైరక్టర్‌గా, మజ్జూర్ సంఘ్ కార్మిక నాయకుడిగా పని చేశాడు.  తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[4] ఆయన 2024 మార్చి 1న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్​గా నియమితులయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (2 March 2024). "సీనియర్‌ నేతకు గుర్తింపు". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  2. The Hindu (29 March 2010). "Nizamabad ZP passes resolution on Telangana" (in Indian English). Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  3. Sakshi (27 July 2023). "నిజామాబాద్ అర్బన్‌ నియోజకవర్గ రాజకీయ చరిత్ర". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  4. The Economic Times (9 September 2023). "Congress sets up several poll committees for assembly elections in Telangana". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  5. Deccan Chronicle (3 March 2024). "Taher Appointed As Urdu Academy State Chief" (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024.
  6. V6 Velugu (2 March 2024). "ఉర్దూ అకాడమీ చైర్మన్​గా తాహెర్". Archived from the original on 3 March 2024. Retrieved 3 March 2024. {{cite news}}: zero width space character in |title= at position 21 (help)CS1 maint: numeric names: authors list (link)