తిరుక్కడిత్తానమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కడిత్తానమ్ | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అద్బుత నారాయణన్ |
ప్రధాన దేవత: | కల్పకవల్లి త్తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | భూమి పుష్కరిణి |
విమానం: | పుణ్యకోటి విమానము |
కవులు: | నమ్మాళ్వార్లు |
ప్రత్యక్షం: | రుక్మాంగద మహారాజునకు |
తిరుక్కడిత్తానమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈక్షేత్రమునకు "తాయప్పది" దాయభాగముగా లభించిన క్షేత్రము అను విలక్షణమైన తిరునామము గలదు. (తి.వా.మొ.8-6-8)
సర్వేశ్వరునకు భోగ్య భూతములైన వాస స్థానములు అనేకములు ఉన్నాయి. కానీ "శ్రీవైకుంఠవిరక్తాయ" అనురీతిని వానియందు ఆదరములేనివాడు "ఎన్నైజ్గుమ్ తిరుక్కడిత్తన నగరుమ్" (8-6-8) (నామనస్సు తిరుక్కడిత్తాన దివ్యదేశము) అనునటుల నా హృదయమునందు వాసము చేయుచున్నాడు. అంతేకాక అందుకు కారణమైన తిరుక్కడిత్తాన క్షేత్రమున వేంచేసియున్నాడు. ఈ రెండును స్వామికి దాయప్రాప్తములుగదా!" అని ఆళ్వార్లు సర్వేశ్వరుని కృతజ్ఞతా గుణమును ప్రకాశింపజేసిరి. ఈ క్షేత్రము సహదేవునిచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పుదురు. చిన్న గ్రామం. సమీపమందలి శెంగనాంచేరిలో మకాంచేయవలెను. లేక తిరువల్లవాழ் నుండి పోవచ్చును
సాహిత్యం
[మార్చు]శ్లో. తిరుక్కడిత్తాన పురే ద్బుతాఖ్య నారాయణ: కల్పక వల్లి దేవ్యా|
భూమ్యాఖ్య తీర్థే వరపుణ్యకోటి విమానమాప్త: సురదిజ్ముఖస్థ:||
రుక్మాంగద మహారాజ ప్రత్యక్షత్వ ముసాగత:|
పరాంకుశ మునీంద్రేణ స్తుతో విజయతే తరామ్||
పాశురాలు
[మార్చు]పా. తాన నగర్ గళ్; తలైచ్చిఱన్దెజ్గెజ్గుమ్;
వానిన్నిలమ్ కడల్; ముత్‌త్తు మెమ్మాయఱ్కే;
ఆనవిడత్తు; మెన్నై--మ్ తిరుక్కడిత్
తాననగరుమ్; తన తాయప్పదియే.
నమ్మాళ్వారు-తిరువాయిమొழி 8-6-8
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
అద్బుత నారాయణన్ | కల్పకవల్లి త్తాయార్ | భూమి పుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | నమ్మాళ్వార్లు | పుణ్యకోటి విమానము | రుక్మాంగద మహారాజునకు |