తిరుత్తణ్ గా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుత్తణ్ గా | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | దీపప్రకాశర్ |
ప్రధాన దేవత: | మరకతవల్లిత్తాయార్ |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖం |
పుష్కరిణి: | సరస్వతీ తీర్థం |
విమానం: | శ్రీకర విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | సరస్వతీదేవికి |
తిరుత్తణ్ గా భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]శ్రీమద్వేదాంతదేశికులు జన్మస్థానమిది. ఆయన శరీరం ఇచట ఉంది. దేశికర్ పూజించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవుల సన్నిధి ఇక్కడ ఉంది. ఈ స్వామిని కీర్తిస్తూ నిగమాంత మహాదేశికులు దేహలీశస్తుతి-శరణాగత దీపికా రచించాడు.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
దీపప్రకాశర్ | మరకతవల్లిత్తాయార్ | సరస్వతీ తీర్థం | పశ్చిమ ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | శ్రీకర విమానము | సరస్వతీదేవికి |
సాహిత్యం
[మార్చు]శ్లో. శ్రీతణ్‌కా నగరే విళాక్కొళి విభు స్తీర్థం తు సారస్వతం
ప్రాప్త శ్శ్రీకర దేవయాన నిలయ: పశ్చాన్ముఖాబ్జ స్థితి:|
దేవీం మారతకోవ పూర్వలతికాం ఆలింగ్య వేధ:ప్రియాం
ప్రత్యక్ష:కలిజిన్నుతో విజయతే దీప ప్రకాశాభిద:||
పాశురాలు
[మార్చు]పాశురం.
ముళైక్కదిరై క్కుఱుజ్గుడియుళ్ ముగిలై మూవా;మూవులగమ్ కడన్దప్పాల్ ముదలాయ్ నిన్ఱ;
అళప్పరియ వారముదై యరజ్గమేయ;వన్దణనై యన్దణర్ దమ్ శిన్దై యానై;
విళక్కొళియై మరదగత్తై త్తిరుత్తణ్ కావిల్; వెஃకావిల్ తిరుమాలై ప్పాడక్కేట్టు;
వళర్‌త్తదనాల్ పయన్ పెత్‌తేన్ పరుగ నెన్ఱు; మడక్కిళియైక్కైకూప్పి వణజ్గి నాళే.
తిరుమంగై ఆళ్వార్లు-తిరునెడున్దాణ్డగమ్ 14.
చేరే మార్గం
[మార్చు]కాంచీపురం అష్టభుజం సన్నిధికి 1/2 కి.మీ దూరములోనున్నది.