తిరునల్వేలి
Tirunelveli district திருநெல்வேலி மாவட்டம் Nellai Mavattam | |
---|---|
district | |
![]() Thamirabarani River from Authoor Bridge | |
![]() Location in Tamil Nadu, India | |
Country | ![]() |
State | తమిళనాడు |
District | Tirunelveli |
District formed on | 1 September 1790 |
Headquarters | Tirunelveli |
Talukas | Alangulam, Ambasamudram, Nanguneri, Palayamkottai, Radhapuram, Sankarankoil, Shenkottai, Sivagiri, Tenkasi, Tirunelveli, Veerakeralamputhur |
ప్రభుత్వం | |
• Collector | M Karuanakaran IAS |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,823 కి.మీ2 (2,634 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 30,72,880 |
• సాంద్రత | 410.5/కి.మీ2 (1,063/చ. మై.) |
Languages | |
• Official | Tamil |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 627001 |
Telephone code | 0462 |
వాహనాల నమోదు కోడ్ | TN-72,TN-76,TN-79 |
Coastline | 35 kilometres (22 mi) |
Largest city | Tirunelveli |
Sex ratio | M-49%/F-51% ♂/♀ |
Literacy | 68.44%% |
Legislature type | elected |
Legislature Strength | 11 |
Precipitation | 814.8 millimetres (32.08 in) |
Avg. summer temperature | 37 °C (99 °F) |
Avg. winter temperature | 22 °C (72 °F) |
జాలస్థలి | www |
దక్షిణ భారతంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని జిల్లాలలో తిరునెల్వేలి ఒకటి. తిరునెల్వేలి జిల్లాకు తిరునెల్వేలి నగరం ప్రాధాన కేంద్రంగా ఉంది. [2][3] బ్రిటిష్ పాలనా కాలంలో సమైక్య తూత్తుకుడి, తిరునెల్వేలి భూభాగం విరుదునగర్, రామనాథపురం జిల్లాలలో భాగంగా ఉంటూవచ్చింది. 2008 గణాంకాలను అనుసరించి తిరునెల్వాఏలి జిల్లా వైశాల్యంలో తమిళనాడు రాష్ట్ర జిల్లాలలో రెండవ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3,077,233. స్త్రీపురుష నిష్పత్తి 1023:1000.
చరిత్ర[మార్చు]
పాడ్యసామ్రాజ్య పాలనా సమయంలో తిరునెల్వేలి భూభాగం " తెన్పాండ్యనాడు" అని పిలువబడేది. తరువాత చోళసామ్రాజ్యం ఈభూభాగానికి " ముదికొండ చోళమండలం " అని నామకరణం చేసింది. మదురై నాయక్ దీనిని తిరునెల్వేలి సీమై అని పిలిచాడు. బ్రిటిష్ పాలనా కాలంలో ప్రస్తుత తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలు, రామనాథపురం, విరుదునగర్ జిల్లాలలో కొంత భూభాగం కలిపి తిరునెల్వేలి జిల్లాగా ఉండేది. 1990లో మదురై, తిరునెల్వేలి జిల్లాల భూభాగం నుండి రామనాథపురం జిల్లా రూపుదిద్దుకుంది.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1996 అక్టోబరు 20న తిరినెల్వేలి జిల్లాను " నెల్లై కట్టబొమ్మన్ జిల్లాగానూ, తూత్తుకుడిని చిదంబరనార్ జిల్లాగాను మార్చారు. తరువాత తమిళనాడు ప్రభుత్వం ప్రతి జిల్లాను దాని ప్రధాన నగరం పేరుతో ఉండాలని నిర్ణయించిన తరువాత ఇది తిరిగి తిరునెల్వేలి జిల్లాగా మార్చబడిని. [4]
భౌగోళికం[మార్చు]

జిల్లా తమిళనాడు రాష్ట్రంలో .. ఉంది. .. జిల్లా ఉత్తర సరిహద్దులో ... జిల్లా ఆగ్నేయ సరిహద్దులో ... జిల్లా తూర్పు సరిహద్దులో.. జిల్లా దక్షిణ సరిహద్దులో...జిల్లా నైరుతి సరిహద్దులో...జిల్లా పడమర సరిహద్దులో, జిల్లా వాయవ్య సరిహద్దులో ... జిల్లా మొత్తం వైశాల్యం ... చదరపుమైళ్ళు .. జిల్లా ఉత్తరంగా ... జిల్లా తూర్పు దిశగా
తిరునెల్వేలి జిల్లా తమిళనాడు రాష్ట్రంలో దక్షిణ భూగాంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో విరుదునగర్ జిల్లా, పడమర సరిహద్దులో పడమర కనుమలు, జిల్లా దక్షిణ సరిహద్దులో కన్యాకుమారి జిల్లా , జిల్లా తూర్పు సరిహద్దులో తిరుచ్చి జిల్లా ఉన్నాయి. జిల్లా మొత్తం వైశాల్యం 6,823 చదరపు మైళ్ళు. జిల్లా ఉత్తరం, దక్షిణ దిశలో 8°05' and 9°30 జిల్లా తూర్పు, పడమర దిశగా 77°05' నుండి 78°25' ఉన్నాయి. జిల్లాలో భూభాగమంతా పడమటి కనుమలలోని కొండలు , లోయలు విస్తరించి ఉన్నాయి. ఇసుక నేలలు , సారవంతమైన భూమి సహితంగా ఉంటుంది. జిల్లాలో మైదాన , పర్వత అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.
ఆర్ధికం[మార్చు]
పంట కాలువలు, చెరువులు , రిజర్వాయర్లు జిల్లా వ్యవసాయభూభాగానికి అవసరమైన జలాలను అందిస్తున్నాయి.2005–2006 జిల్లాలో 499 మైళ్ళ పొడాఇన 151 పంటకాలువలు, 640 గొట్టపుబావులు, 85,701 వ్యవసాయ భూములు, 8 రిజర్వాయర్లు, 2,212 చెరువులు ఉన్నాయి. అంతేకాక జిల్లాలో గృహావసరాలకు 21,701 బావులు నీటిని అందిస్తున్నాయి.
విద్యుత్తు[మార్చు]
తమిళనాడు ఎలెక్ట్రిసిటీ బోర్డ్ (టి.ఎన్.ఇ.బి) .[5] జిల్లాలో హైడ్రాలిక్ విద్యుత్తును ప్లాంట్లను, పవన విద్యుత్తును, 1,089.675 మెగావాట్ల విద్యుత్తును అందిస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా పవనవిద్యుత్తును ఉత్పత్తి చేస్తూన్న జిల్లాలలో తిరునెల్వేలి మొదటి స్థానంలో ఉంది. రష్యా సహాయంతో నిర్మించిన కూడంకుళం వద్ద " కూడంకుళం అణువిద్యుత్తు కేంద్రం " నిర్మించబడింది. ఇది కన్యాకుమారి జిల్లాకు ఈశాన్యంగా, నాగర్‌కోయిల్‌కు 36 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురం జిల్లాకు 106 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది. కూడంకుళంలో వందలాది విండ్ మిల్స్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. వీటిలో 8 అణువిద్యుత్తు కేంద్రంలో ఉన్నాయి. ఈ విండ్ మిల్స్ ప్రస్తుతం 2000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇదిదేశంలోనే అతి పెద్ద విండ్ మిల్లుగా గుర్తింపు పొందింది. 2011 నుండి ఈ జిల్లా వాసులు అణువిద్యుత్తు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగిస్తున్నారు.[ఉల్లేఖన అవసరం]
వాతావరణం[మార్చు]
తిరునెల్వేలి జిల్లా వర్షపాతం 953 మిల్లీమీటర్లు. జిల్లాలో నైరుతి, ఈశాన్య ౠతుపవనాలు వర్షం అందిస్తున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు జిల్లాకు 548.7 మిల్లీమీటర్ల వర్షపాతం అందిస్తున్నాయి. 184.2 మిల్లీమీటర్ల వర్షపాతం అందిస్తున్నాయి. జిల్లా భూభాగానికి పడమటి కనుమల నుండి ప్రవహిస్తున్న ... పలు నదులను వ్యవసాయానికి నీరు అందిస్తున్నాయి. తాంరపర్ణి నది, మణిముత్తారు నదులకు పలు ఆనకట్టలు, రిజర్వాయర్లు వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తూ ఉన్నాయి. తాంరపర్ణి నది ద్వారా జిల్లా వ్యవసాయ భూభాగానికి నిరంతరంగా జలాలను అందిస్తున్నది.[6] చిత్తారు నది కూడా తిరునెల్వేలి జిల్లా నుండి ప్రవహిస్తుంది. జిల్లాలో ప్రసిద్ధిచెందిన కుట్రాళం, మణిముత్తారు జలపాతాలు ఉండడం తిరునెల్వేలి ప్రత్యేకత.
గణాంకాలు[మార్చు]
2011లో గణాంకాలను అనుసరించి తిరునెల్వేలి జిల్లా జనసంఖ్య 3,077,233. స్త్రీ పురుష నిష్పత్తి 1023:1000. జాతీయ సరాసరి 928 కంటే ఇది అధికం. [7] ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలబాలికల సంఖ్య 321,687,ఇందులో 6 సంవత్సరాలకు లోబడిన బాలుర సంఖ్య 164,157., బాలికల సంఖ్య 157,530. వెనుకబడిన తరగతి సంఖ్య 18.51. వెనుకబడిన జాతుల సంఖ్య 33%. అలాగే సరాసరి అక్షరాస్యత శాతం 73.88%. జాతియ సరాసరి (72%) కంటే ఇది అధికం.[7] జిల్లాలో నివసిస్తున్న మొత్తం కుటుంబాలు 815,528. జిల్లాలో మొత్తం శ్రామికుల సంఖ్య 1,436,454. రైతుల సంఖ్య 107,943. వ్యవసాయ కూలీలు 321,083. ఇంటి పనులకు, పరిశ్రలో పనిచేసేవారు 215,667, ఇతర శ్రామికులు 626,714. సమాయనుకూలంగా పనిచేసేవారి సంఖ్య 165,047. సన్నకారు రైతులు 7,772. సనాకారు రైతుకూలీలు 58,680. సమయానుకూలంగా కుటీర పరిశ్రనులలో పనిచేసేవారు 23,997. సమయానుకూలంగా ఇతరపనులు చేసేవారు 74,598.[8]
మౌళిక వసతులు[మార్చు]
తిరునెల్వేలి జిల్లా రహదార్లు, రైలు మార్గాల ద్వారా చక్కగా మిగిలిన జిల్లాలతో అనుసంధానించబడి ఉంది. తిరునెల్వేలి ప్రధాన కూడలిగా పనిచేస్తుంది. జిల్లాలో విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయాలు జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో తూత్తుకుడి జిల్లాలో, జిల్లాకు 150 కిలోమీటర్ల దూరంలో మదురై జిల్లాలో, తిరువనతపురం జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 27 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. .[5]
రోడ్లు | జాతీయ రహదారులు | రాష్ట్రీయ రహదారులు | నగరపాలిక, పురపాక రహదార్లు | పంచాయితీ యూనియన్, పంచాయితీ రహదారి | టౌన్ పంచాయితీ, టౌన్షిప్ | ఇతర రోడ్లు (వన మార్గాలు) |
---|---|---|---|---|---|---|
పొడవు (కి.మీ.) | 174.824 | 442.839 | 1,001.54 | 1,254.10 and 1,658.35 | 840.399 | 114.450 |
రైలుమార్గాలు[మార్చు]
రైల్వేలు | మార్గం పొడవు (కిలోమీటర్లలో) | ట్రాక్ పొడవు (కిలోమీటర్లలో) |
---|---|---|
బ్రాడ్ గేజ్ | 257.000 | 495.448 |
మీటర్ గేజ్ | 0.000 | 0.000 |
జిల్లాలో ప్రముఖులు[మార్చు]
- ఎం. ఎల్. తంగప్ప : తమిళ రచయిత,సాహిత్య అకాడమీ అవార్డుల గ్రహీత.
మూలాలు[మార్చు]
- ↑ "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
- ↑ http://www.edreamsinetcafe.in/tirunelveli/history.htm[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-25. Retrieved 2014-03-31.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-18. Retrieved 2014-03-31.
- ↑ 5.0 5.1 "Microsoft Word – Format.doc" (PDF). Archived from the original (PDF) on 2015-05-25. Retrieved 2014-03-31.
- ↑ "Tirunelveli District Irrigatio". Archived from the original on 8 సెప్టెంబర్ 2006. Retrieved 24 September 2006. Check date values in:
|archive-date=
(help) - ↑ 7.0 7.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
- ↑ "Census Info 2011 Final population totals - Tirunelveli district". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to తిరునల్వేలి. |
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Articles with short description
- Short description is different from Wikidata
- Pages using infobox settlement with unknown parameters
- All articles with unsourced statements
- Articles with unsourced statements from January 2014
- విష్ణు దేవాలయాలు