తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ గీతాన్ని ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు రచించారు. సంగీతం అందించింది ప్రముఖ హిందూస్తానీ సితార్ కళాకారులు ఏల్చూరి విజయరాఘవ రావు ఈ పాటను శ్రీరంగం గోపాలరత్నం అద్భుతంగా గానం చేశారు. ఈ పాట పుట్టుక మీద ఎస్.బి. శ్రీరామమూర్తి గారు "ఒక పాట పుట్టింది" పేరుతో ఒక డాక్యుమెంటరి తీసారు.

<poem>

తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా మెరుపులతో మెరిసింది వానకారు ॥

నీలిమొయిలు వాలుజడకు చినుకే చేమంతి కట్టుకున్న పచ్చదనం పట్టు పరికిణీ ॥

తెలివెన్నెల వేకువలో తానమాడి అడవిదారి మలుపుల్లో అదిరి చూసి కొండ తిరిగి కోన తిరిగి గుసగుసలాడి తరగల మువ్వల గలగల నాట్యమాడి ॥

చిగురేసిన చిరుకొమ్మలు ఊగిఊగి పోతే చిలిపిగ జడివాన వేళ చక్కిలిగిలి పెడితే పకపక పువ్వుల నవ్వులు నవ్విస్తూ వస్తూ బాట వెంట సంబరాలు పంచి పంచి పెడుతూ ॥

కొంటె కుర్రకారు వెనక జంట నడక నడచి విరహంతో వేదనతో వారి మనసు కలచి అంతలోన మంచి కలలు కనుల చిలకరించి జరిగి జరిగి దౌదౌవ్వుల పిలిచి పిలిచి నిలిచి ॥

ఈ పాటను [[permanent dead link] ఇక్కడ ] వినవచ్చు.