తిరుపతి వేంకటేశ్వర కృతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుపతి వేంకటేశ్వర కృతులు
కృతికర్త: దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రచురణ: షష్టిపూర్తి మహోత్సవ సంఘము, బందరు
విడుదల: 1934
ప్రచురణ మాధ్యమం: ముద్రణ

దివాకర్ల తిరుపతి శాస్త్రి (Divakarla Tirupati Sastry) (1872-1919), చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) (1870-1950) - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు. వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత, తెలుగు గ్రంధాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి. ఈ షష్టిపూర్తి సాహిత్య సర్వస్వం సంపుటిలో ప్రసిద్ధమైన వారి నాటకాలు-పాండవ ఉద్యోగం, పాండవ విజయం మున్నగునవి ఉన్నాయి.

సంపుటము 3[మార్చు]

దీనిని షష్టిపూర్తి మహోత్సవ సంఘము, బందరు వారు 1934 సంవత్సరం ముద్రించారు. ఇందులోని నాటకములు:

  1. పాండవజననము
  2. పాండవప్రవాసము
  3. పాండవోద్యోగము
  4. పాండవవిజయము
  5. పాండవాశ్వమేధము
  6. ప్రభావతీ ప్రద్యుమ్నము
  7. దంభవామనము
  8. అనర్ఘనారదము
  9. సుకన్య
  10. పాండవరాజసూయము

మూలాలు[మార్చు]