Jump to content

తిరుపుళ్ళమ్

అక్షాంశ రేఖాంశాలు: 10°58′17″N 79°18′12″E / 10.97139°N 79.30333°E / 10.97139; 79.30333
వికీపీడియా నుండి
తిరుపుళ్ళభూతంగుడి దేవాలయం
తిరుపుళ్ళమ్ is located in Tamil Nadu
తిరుపుళ్ళమ్
తమిళనాడు రాష్ట్రంలో దేవాలయ ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు10°58′17″N 79°18′12″E / 10.97139°N 79.30333°E / 10.97139; 79.30333
దేశంభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతంజావూరు
ప్రదేశంపుళ్ళభూతంగుడి, కుంభకోణం
సంస్కృతి
దైవంవావిల్ రామార్ (విష్ణు) , పోత్రమారైయల్ (లక్ష్మి)
వాస్తుశైలి
నిర్మాణ శైలులుద్రవిడ నిర్మాణశైలి

తిరుపుళ్ళమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

శ్రీరామచంద్రుడు జటాయువునకు ప్రత్యక్షమై మోక్షము నిచ్చిన స్థలమిది. స్వామిని స్తుతుస్తూ శ్రీ వేదాంత దేశికులచే "పరమార్థ స్తుతి" అను స్తోత్రమును అనుగ్రహించబడింది.. తొండరడిప్పొడి యాళ్వార్ల అవతారస్థలమైన "మణ్ణబ్గుడి" ఈ దివ్యదేశమునకు అతి సమీపములో గలదు. 1 కి.మీ దూరములో తిరువాదనూర్ దివ్య దేశము ఉంది.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ గృధ్రాభిధ తీర్థ సుందర తటే భోగేశయ ప్రాజ్మఖ:
   పుళ్లంపూద పురే తు శోభసపదం వైమాన మభ్యాగత: |
   శ్రీమాన్ వల్విలిరామ నామక విభు: పొత్తామరాఖ్య ప్రియ:
   గృధ్రేంద్రాక్షి పదం కలిఘ్న వచసాం పాత్రం తు రారాజతే:

పాశురం

[మార్చు]

   అఱివదయాన న్తె త్తులగుముడై యానెనై యాళుడై యాన్‌
   కుఱియ మాణురువాగియ కూత్తన్ మన్నియమరుమిడమ్;
   నఱియ మలర్‌మేల్ శురుమ్చార్క వెழிలార్ మఇజై నడమాడ
   పొఱిగొళ్ శిఱై వణ్డిశై పాడుమ్‌ పుళ్లమ్‌బూదబ్గుడిదానే
          తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 5-1-1

చేరే మార్గం

[మార్చు]

స్వామిమలై-తిరువైకావూర్ టౌను బస్ మార్గములో స్వామిమలైనుండి 5 కి.మీ దూరములో నున్నది. ఈ సన్నిధి అహోబిల మఠంవారి నిర్వాహములో నున్నది. మఠములో తగిన వసతులు గలవు.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వల్ విల్లి రాములు పొత్తామరైయాళ్ తాయార్ గృధ్ర తీర్థము తూర్పు ముఖము భుజంగ శయనము తిరుమంగై ఆళ్వార్ శోభన విమానం జటాయువునకు ప్రత్యక్షము

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]