Jump to content

తిరుమల నంబి

వికీపీడియా నుండి

సుమారు 1000 సంవత్సరాల క్రితం, తిరుమల వెంకటేశ్వర స్వామిని జీవిత పర్యంతం సేవించుకున్న వారిలో, తిరుమల నంబి ఒకరు. వీరికి శ్రీశైల పూర్ణులు అనే మరో నామధేయము ఉంది. విశిష్టాద్వైత ప్రచారకాచార్యులు రామానుజా చార్యులు వీరికి మేనల్లుడు. ఆ కాలంలో కంచి యందు మరొక 'నంబి ' ఉన్నందున తిరుమల యందు ఉన్న వీరిని ' తిరుమలై నంబి ' అని అంటారు.

ఆకాశగంగ

పాపనాశనం కథ

[మార్చు]

తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజూ తెచ్చిన జలముతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చామూర్తికి అభిషేకం నిర్వహించేవారు. వయోవృధ్ధుడైన తిరుమల నంబి చాలా దూరము నుంచి అలా కుండలో పాపనాశనం జలము తెస్తుంటే శ్రీవేంకటేశ్వర స్వామి కలతచెంది ఒకరోజు ఒక బాలుడు రూపంలో తాతా అని పిలిచి దాహంగా ఉంది కుండలో ఉన్న జలం యివ్వమని కోరుతాడు, తిరుమల నంబి దానిని మూర్తి యొక్క అభిషేకమునకు తెస్తున్నానని ఇవ్వనని అంటాడు. కాని బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు. దానికి నంబి ఎంతపని చేసావు. "స్వామివారి అభిషేకానికి తీసుకొనివెళ్తున్న జలం అంతా త్రాగేసావు" అని బాలునితో అంటాడు. దానికి ఆ బాలుడు "తాతా యిక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకూ లేని ఆకాశ గంగను చూపిస్తాడు. ఈరోజు నుంచి ఈ ఆకాశగంగ జలంతో అభిషేకం చెయ్యి" అని అదృశ్యం అవుతాడు. "ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను. నా కడుపు చల్లగా ఉంది. ఈ రోజు నాకు అభిషేకం వద్దు" అని శ్రీవేంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి చెప్తాడు.

విశేషాలు

[మార్చు]
  • ఈ కథనం తరువాత నుంచి తిరుమల నంబి " తాతాచార్యుడు"గా కూడా పిలవబడ్డారు.
  • ఒకనాడు ఏదో ఒక కారణంచే స్వామి సేవకు దూరమై బాధపడుచుండగా తిరుమల నంబి యొక్క అధ్యయన స్థలమందే ధివ్యపాద చిహ్నములను దర్శింపజేస్తాడు స్వామి.

మూలములు

[మార్చు]