తిర్యక్ తరంగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీటి ఉపరితలంలో తరంగాలు.

యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా ఉంటే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు.

లక్షణాలు[మార్చు]

  • యివి పురోగామి తరంగాలు
  • తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత, జడత్వం కలిగిన యానకం అవసరం.
  • ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
  • నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. తరంగాలు వచ్చునపుడు నీటిలో ఒక తేలికగా ఉండు బెండు బంతిని వేసినపుడు అది పైకి క్రిందికి కదులుతుంది. దీనిని బట్టి యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా కదులుతాయని తెలుస్తుంది.
  • వీటిలో శృంగాలు, ద్రోణులు యేర్పడతాయి.
  • రెండు వరుస శృంగాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.

ఉదాహరణలు[మార్చు]

  • నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. (తిర్యక్ తరంగాలు)
  • కాంతి తరంగాలు (విద్యుదయస్కాంత తరంగాలు) యివి తిర్యక్ తరంగాల స్వభావాన్ని కలిగి ఉంటాయి.
Sinusoidal waves correspond to simple harmonic motion.

తిర్యక్ తరంగాలలో స్థిర తరంగాలు[మార్చు]

  • పురోగామి తరంగాలకు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.
  • ఒక దారాన్ని గోడకు కట్టి దానిని నీవు చేతితో పట్టుకొని పైకి క్రిందికి వేగంగా కదిపించినట్లైతే కొన్ని ఉచ్చులు యేర్పడుతాయి.వీటిని స్థిర తరంగాలు అంటారు.
  • ఈ తరంగాలలో అధిక స్థానబ్రంశము గల బిందువులను ప్రస్పందన స్థానం అని, అల్ప స్థానబ్రంశము గల బిందువులను అస్పందన స్థానం అని అంటారు.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన లెదా అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. λ/2
  • ఈ తరంగములో ప్రతి బిందువుకు ఒక ప్రత్యేక మైన కంపన పరిమితి ఉంటుంది.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన, అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో నాల్గవ వంతు ఉంటుంది. λ/4