తుంగపహాడ్

వికీపీడియా నుండి
(తుంగ పాడు నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుంగపహాడ్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం మిర్యాలగూడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,719
 - పురుషుల సంఖ్య 3,468
 - స్త్రీల సంఖ్య 3,251
 - గృహాల సంఖ్య 1,655
పిన్ కోడ్ 508207
ఎస్.టి.డి కోడ్ 08689

తుంగపహాడ్, నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 508207. ఈ గ్రామం 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. తుంగ పాడు గ్రామం మిర్యాలగూడ పట్టణం నుండి 8 కిమీదూరంలో ఉంది. హైదరాబాదు నగరం నుండి 150 కిమీదూరంలో ఉంది. గ్రామ జనాభా 6,719. ఇది మిర్యాలగూడ మండలం అతిపెద్ద గ్రామ పంచాయితీ. తుంగ పాడు గ్రామ రెండు కాలువలు ఉన్నాయి. ఈ గ్రామం మూడు బియ్యం మిల్లులు మరియు ఒక పత్తి కర్మాగారాన్ని కలిగి ఉంది. ఈ గ్రామంలో ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ఒక ప్రాథమిక పాఠశాలు ఉన్నాయి. ఒక గ్రంథాలయం "నేతాజీగ్రంధాలయం" పేరుతో అందుబాటులో ఉంది. తుంగపాడులో, "బందము" అనే ప్రసిద్ధ కాలువ ఉంది. అది ఒక సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తుంది. ఇది ఆ గ్రామ ప్రజలు పండించే వరి పంటకు మరియు పత్తి పరిశ్రమకు ప్రధాన వనరు.

సరిహద్దు గ్రామాలు[మార్చు]

త్రిపురారం, శ్రీనివాసనగర్, చిల్లాపురం,

దేవాలయాలు[మార్చు]

తుంగ పాడులో మూడు దేవాలయాలు ఉన్నాయి. 'శ్రీ రామ ఆలయం' గ్రామం మధ్యలో ఉంది. పురాతన "వేణుగోపాల స్వామి దేవాలయం" నాలుగు సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు. ఇది గ్రామానికి ప్రారంభ స్థానం వద్ద ఉంది. "కనక దుర్గ ఆలయం" గ్రామ ముగింపు వద్ద ఉంది. తుంగ పాడులో నాలుగు చర్చిలు ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు[మార్చు]

తుంగ పాడు చేరుకోవడానికి ప్రధాన మార్గాలు:. 1. బస్సు, 2. రైలు.

'సమీప రైల్వే స్టేషను: మిర్యాలగూడ.' (సికింద్రాబాద్ నుండి రైళ్లు: జన్మభూమి ఎక్స్ ప్రెస్, విశాఖ ఎక్స్ ప్రెస్, నారాయణద్రి ఎక్స్ ప్రెస్, చెన్నై ఎక్స్ ప్రెస్, రేపల్లె ప్యాసింజర్, హౌరా రైలు, push pull మొదలైనవి).

కొన్ని విషయాలు[మార్చు]

పిన్ కోడ్ సంఖ్య: 508207.

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,719 - పురుషుల సంఖ్య 3,468 - స్త్రీల సంఖ్య 3,251 - గృహాల సంఖ్య 1,655

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=తుంగపహాడ్&oldid=2105116" నుండి వెలికితీశారు