ఉష్ణమండల తుఫాను

వికీపీడియా నుండి
(తుఫాను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
View of a tropical cyclone from space
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 2018లో హరికేన్ ఫ్లోరెన్స్ చిత్రం. కన్ను, కనుగోడ, చుట్టుపక్కల ఉన్న వర్షమేఘాలు, ఉష్ణమండల తుఫానుల లక్షణాలు. అంతరిక్షం నుండి ఈ దృశ్యంలో వీటిని స్పష్టంగా చూడవచ్చు.

ఉష్ణమండల తుఫాను అనేది వేగంగా తిరిగే తుఫాను వ్యవస్థ. అల్పపీడన కేంద్రం, తక్కువ ఎత్తులో వాతావరణ ప్రసరణ, బలమైన గాలులు, భారీ వర్షం, సుడిగాలులు దాని లక్షణాలు. దాని స్థానం, బలాన్ని బట్టి, ఉష్ణమండల తుఫానును హరికేన్ అని, టైఫూన్ అని, ఉష్ణమండల తుఫాను అనీ, తుఫాను గాలి అనీ, ఉష్ణమండల అల్పపీడనం అనీ, లేదా కేవలం తుఫాను అనీ అంటారు. హరికేన్ అనేది అట్లాంటిక్ మహాసముద్రం లేదా ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే బలమైన ఉష్ణమండల తుఫాను కాగా, వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే వాటిని టైఫూన్ అంటారు. హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ లేదా (అరుదుగా) దక్షిణ అట్లాంటిక్‌లో, ఏర్పడే తుఫానులను "ఉష్ణమండల తుఫానులు" (ట్రాపికల్ సైక్లోన్) అని పిలుస్తారు. హిందూ మహాసముద్రంలో ఇటువంటి తుఫానులను "తీవ్ర తుఫాను గాలులు" అని కూడా పిలుస్తారు.

"ఉష్ణమండల" అనేది ఈ వ్యవస్థల భౌగోళిక మూలాన్ని సూచిస్తుంది, ఇవి దాదాపుగా ఉష్ణమండల సముద్రాలపై ఏర్పడతాయి. "సైక్లోన్" అనేది ఒక వృత్తంలో కదులుతున్న గాలులను సూచిస్తుంది. మధ్యలో ఉండే స్పష్టమైన కన్ను చుట్టూ ఈ గాలులు తిరుగుతాయి. వాటి ఉపరితల గాలులు ఉత్తర అర్ధగోళంలో అపసవ్య దిశలోను, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ వీస్తాయి. కోరియోలిస్ ప్రభావం కారణంగా ఈ ప్రసరణలు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఉష్ణమండల తుఫానులు సాధారణంగా సాపేక్షంగా వెచ్చని నీటి వ్యవస్థలపై ఏర్పడతాయి . అవి సముద్రపు ఉపరితలం నుండి బాష్పీభవనం చెందే నీటి ద్వారా తమ శక్తిని పొందుతాయి. తేమతో కూడిన ఈ గాలి పైకి లేచి మేఘాలుగా ఏర్పడి, సంతృప్తతకు చల్లబడినప్పుడు చివరికి వర్షంగా కురుస్తుంది. ఈ శక్తి వనరు, మధ్య-అక్షాంశాల్లోని సైక్లోనిక్ తుఫానుల కంటే భిన్నంగా ఉంటుంది, ఉదాహరణకు నార్'ఈస్టర్స్, యూరోపియన్ విండ్‌స్టార్మ్‌లు, ఇవి ప్రధానంగా క్షితిజ సమాంతరంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాల ద్వారా శక్తిని పొందుతాయి. ఉష్ణమండల తుఫానుల వ్యాసం సాధారణంగా 100 and 2,000 km (62 and 1,243 mi) మధ్య ఉంటుంది. ప్రతి సంవత్సరం ఉష్ణమండల తుఫానులు ఉత్తర అమెరికా గల్ఫ్ కోస్ట్, ఆస్ట్రేలియా, భారతదేశం, బంగ్లాదేశ్‌తో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి.

ఈ తుఫానులకు ప్రాథమిక శక్తి వనరు, వెచ్చని సముద్ర జలాలు. ఇవి నీటిపైన లేదా నీటికి సమీపంలో ఉన్నప్పుడు అత్యంత బలంగా ఉంటాయి. నేలపై చాలా వేగంగా బలహీనపడతాయి. అందువల్లనే లోతట్టు ప్రాంతాలతో పోలిస్తే తీర ప్రాంతాలు ఎక్కువగా ఉష్ణమండల తుఫానుల దెబ్బకు గురవుతూంటాయి. బలమైన గాలులు, వర్షం, పెద్ద కెరటాలు (గాలుల కారణంగా), తుఫాను ఉప్పెనలు (గాలి వేగం, తీవ్రమైన పీడన మార్పుల కారణంగా), సుడిగాలుల వల్ల తీరప్రాంతాల్లో నష్టం సంభవించవచ్చు. ఉష్ణమండల తుఫానులు చాలా పెద్ద విస్తీర్ణం నుండి గాలిని సేకరించి, ఆ గాలిలోని నీటి శాతాన్ని (వాతావరణ తేమ, నీటి నుండి ఆవిరైన తేమ) చాలా చిన్న విస్తీర్ణంలో వర్షంగా కురుస్తాయి. వర్షం తర్వాత తేమను కలిగి ఉండే గాలిని తిరిగి నింపడం వల్ల తీరం నుండి 40 km (25 mi) లోపలి వరకు కొన్ని గంటలు లేదా కొద్ది రోజుల పాటు అత్యంత భారీ వర్షం కురుస్తుంది. ఇది స్థానిక శీతోష్ణస్థితిలో ఉండే నీటి పరిమాణానికి మించి ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇందువలన నదుల్లో వరదలు, భూమి మునిగిపోవడం, స్థానికంగా నీటిని నియంత్రించే జలాశయాల వంటి నిర్మాణాలు నిండి పొర్లి పోవడం జరుగుతాయి. మానవ జనాభాపై వాటి ప్రభావాలు వినాశకరమైనవే అయినప్పటికీ, ఉష్ణమండల తుఫానులు కరువు పరిస్థితులను తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అవి ఉష్ణమండల ప్రాంతాల నుండి వేడిని, శక్తిని సమశీతోష్ణ అక్షాంశాల వైపుకు రవాణా చేస్తాయి. ఇది ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నేపథ్యం[మార్చు]

ఉష్ణమండల తుఫాను అనేది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండలాలు లేదా ఉపఉష్ణమండల జలాలపై ఏర్పడే అల్పపీడన వ్యవస్థ. [1] [2] ఈ వ్యవస్థలలో, సాధారణంగా స్ఫుటంగా ఉండే కేంద్రం ఉంటుంది. దాని చుట్టూ లోతైన వాతావరణ ఉష్ణప్రసరణ ఉంటుంది, ఉపరితలం వద్ద గాలి ప్రసరణ ఉంటుంది. [1]

చారిత్రికంగా, ఉష్ణమండల తుఫానులు ప్రపంచవ్యాప్తంగా వేల సంవత్సరాలుగా సంభవిస్తున్నాయి. సుమారుగా సా.పూ. 4000 లో పశ్చిమ ఆస్ట్రేలియాలో సంభవించినట్లు భావిస్తున్న తుఫాను తొలి ఉష్ణమండల తుఫానులలో ఒకటి. అయితే, 20వ శతాబ్దంలో ఉపగ్రహ చిత్రాలు అందుబాటులోకి రాకముందు, ఉష్ణమండల తుఫాను భూమిపై ప్రభావం చూపినపుడు తప్ప లేదా ప్రమాదవశాత్తూ ఓడలు చిక్కుకుంటే తప్ప దానిని గుర్తించే మార్గం ఉండేది కాదు.[3]

ఆధునిక కాలంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సగటున 80 నుండి 90 దాకా పేరుపెట్టబడిన ఉష్ణమండల తుఫానులు ఏర్పడుతున్నాయి. వీటిలో సగానికి పైగా హరికేన్-ఫోర్స్ గాలులుగా (65 kn (120 km/h; 75 mph) ) గానీ, లేదా అంతకంటే ఎక్కువగా గానీ అభివృద్ధి చెందుతాయి.[3] ప్రపంచవ్యాప్తంగా, ఉపరితల గాలుల వేగం సాధారణంగా 35 kn (65 km/h; 40 mph) కంటే ఎక్కువ ఉంటే ఉష్ణమండల తుఫాను ఏర్పడినట్లు భావిస్తారు.[3] ఈ దశలో ఉష్ణమండల తుఫాను స్వయం సమృద్ధిగా మారిందని, పర్యావరణం నుండి ఎటువంటి సహాయం అవసరం లేకుండానే అది తీవ్రతరం అవుతుందనీ భావిస్తారు.[3]

పుట్టుక, పెరుగుదల[మార్చు]

A schematic diagram of a tropical cyclone
ఉత్తరార్ధగోళంలో ఉష్ణమండల తుఫాను రేఖాచిత్రం

ఉష్ణమండల తుఫానులు ఎక్కువగా వేసవిలో ఉద్భవిస్తాయి. అయితే ఉష్ణమండల తుఫాను బేసిన్‌లలో చాలావాటిలో దాదాపు ప్రతి నెలలోనూ తుఫానులు ఏర్పడతాయని గమనించారు. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న ఉష్ణమండల తుఫానుల మూలాలు ఇంటర్‌ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్‌లో ఉంటాయి. ఇక్కడ గాలులు ఈశాన్య లేదా ఆగ్నేయం నుండి వీస్తాయి. [4] అల్పపీడనం ఉండే ఈ విశాల ప్రాంతంలో గాలి, వెచ్చని ఉష్ణమండల మహాసముద్రంపై వేడెక్కి పైకి లేస్తుంది. దీని వలన ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. [4] ఈ జల్లులు చాలా త్వరగా తగ్గిపోయినప్పటికీ, అవన్నీ కలిసి పెద్ద ఉరుములతో కూడిన పెద్ద సుడిగాలులుగా మారతాయి. [4] దీంతో వెచ్చని, తేమతో కూడిన గాలి వేగంగా పైకి వెళ్తూ భూ భ్రమణం కారణంగా తుఫానుగా తిరగడం ప్రారంభిస్తుంది. [4]

ఈ ఉరుములతో కూడిన వర్షం మరింతగా అభివృద్ధి చెందడానికి అనేక అంశాలు అవసరం అవుతాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు 27 °C (81 °F) ఉండడం వాటిలో ఒకటి. అలాగే వ్యవస్థ చుట్టూ నిట్టనిలువు విండ్ షియరు తక్కువగా ఉండడం,[4][5] వాతావరణ అస్థిరత, ట్రోపోస్పియర్ దిగువ నుండి మధ్య స్థాయిల వరకు అధిక తేమ ఉండడం, తక్కువ-పీడన కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి తగినంత కోరియోలిస్ శక్తి ఉండడం లాంటివి ఇతర దోహదకాలు. [5] ఉష్ణమండల తుఫాను తీవ్రతకు పరిమితి, దాని మార్గంలో ఉన్న నీటి ఉష్ణోగ్రతలపై బలంగా ఆధారపడి ఉంటుంది.[6] ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 86 ఉష్ణమండల తుఫానులు ఏర్పడతాయి. వాటిలో 47, 119 km/h (74 mph) కంటే ఎక్కువ బలాన్ని సాధిస్తాయి. 20, తీవ్రమైన ఉష్ణమండల తుఫానులుగా మారతాయి. [7]

శాంతించడం[మార్చు]

Satellite image of a cyclone where the thickest clouds are displaced from the central vortex
2020 లో ఏర్పడిన పాలెట్ హరికేన్. కేంద్రానికి కొంచెం పక్కగా ప్రసరణతో.

ఉష్ణమండల తుఫాను బలహీనపడటానికి, నిదానించడానికి లేదా దాని లక్షణాలను కోల్పోడానికీ అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో తీరం దాటడం, చల్లటి నీటి మీదుగా వెళ్లడం, పొడి గాలిని ఎదుర్కోవడం లేదా ఇతర వాతావరణ వ్యవస్థలతో పరస్పర చర్య చేయడం వంటివి ఉన్నాయి. అయితే, తుఫాను తగ్గిపోయిన తరువాత కూడా, అంటే దాని లక్షణాలను కోల్పోయిన తర్వాత కూడా, పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే దాని అవశేషాల నుండి మళ్ళీ మరో ఉష్ణమండల తుఫాను పుట్టుకు రావచ్చు. [8] [9]

ఉష్ణమండల తుఫాను 26.5 °C (79.7 °F) కంటే బాగా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీటిపై కదులుతున్నప్పుడు తీవ్రత కోల్పోతుంది. ఈ చల్లని నీటి వలన తుఫాను ఉష్ణమండల లక్షణాలను కోల్పోతుంది. తద్వారా ఇది ఒక అవశేష అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. అవశేష వ్యవస్థలు తమ గుర్తింపును కోల్పోయే ముందు చాలా రోజుల పాటు కొనసాగవచ్చు. ఈ మందగించడం తూర్పు ఉత్తర పసిఫిక్‌లో సర్వసాధారణం. ఒక తుఫాను నిలువుగా ఉండే గాలి కోతను అనుభవిస్తే, ఉష్ణప్రసరణ, ఉష్ణ యంత్రం కేంద్రం నుండి దూరంగా వెళ్లేలా బలహీనపడటం లేదా మందగించడం కూడా సంభవించవచ్చు; ఇది సాధారణంగా ఉష్ణమండల తుఫాను అభివృద్ధిని నిలిపివేస్తుంది. [10]

ఉష్ణమండల తుఫాను తీరం పడిఉతే, లేదా ఏదైనా ద్వీపం మీదుగా వెళితే, ప్రత్యేకించి అది పర్వత భూభాగాన్ని ఎదుర్కొంటే దాని ప్రసరణ విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. [11] ఒక వ్యవస్థ ఒక పెద్ద భూభాగంలో తీరం పట్టినపుడు దానికి వెచ్చని, తేమతో కూడిన సముద్రపు గాలి సరఫరా ఆగిపోతుంది. నేలపై నుండి పొడి గాలిని లాగడం ప్రారంభిస్తుంది. [11] ఇది, భూభాగాలపై పెరిగిన ఘర్షణతో కలిపి, ఉష్ణమండల తుఫాను బలహీనపడటానికి మందగించడానికీ దారితీస్తుంది. [11] పర్వత భూభాగంలో తుఫాను వ్యవస్థ త్వరగా బలహీనపడుతుంది; అయితే, చదునైన ప్రదేశాలలో రెండు మూడు రోజుల వరకు దీని ప్రభావం ఉండి ఆ తరువాత మందగించవచ్చు. [11]

కొద్ది సంవత్సరాలుగా, ఉష్ణమండల తుఫానులలో కృత్రిమంగా మార్పులు చేయడానికి అనేక పద్ధతులను పరిశీలించారు. [12] ఈ సాంకేతికతలలో అణ్వాయుధాలను ఉపయోగించడం, మంచుకొండలతో సముద్రాన్ని చల్లబరచడం, భారీ ఫ్యాన్‌లతో తుఫానును భూమి నుండి దూరం చేయడం, ఎంచుకున్న తుఫానులలో పొడి మంచు లేదా సిల్వర్ అయోడైడ్‌ చల్లడం వంటివి ఉన్నాయి. [12] అయితే, ఈ పద్ధతులు ఉష్ణమండల తుఫానుల వ్యవధి, తీవ్రత, శక్తి లేదా పరిమాణాన్ని అంచనా వేయడంలో విఫలమవుతాయి. [12]

నిర్మాణం[మార్చు]

కన్ను, కేంద్రం[మార్చు]

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి చూసినపుడు, 2018 నాటి హరికేన్ ఫ్లోరెన్స్. కన్ను, దాని చుట్టూ మేఘాలను చూడవచ్చు

పరిపక్వ స్థాయిలో ఉన్న ఉష్ణమండల తుఫానుకు మధ్యలో, గాలి పైకి లెగవకుండా కిందికి పోతుంది. తగినంత బలమైన తుఫాను విషయంలో, మేఘాలు ఏర్పడకుండా అణిచివేసేందుకు తగినంతగా గాలి కిందికి పోవచ్చు. తద్వారా స్పష్టమైన " కన్ను" ఏర్పడుతుంది. కంటిలో వాతావరణం సాధారణంగా ఉష్ణప్రసరణ మేఘాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అయితే సముద్రం చాలా బీభత్సంగా ఉంటుంది. [13] కన్ను సాధారణంగా వృత్తాకారంగా ఉండి, సాధారణంగా 30–65 km (19–40 mi) వ్యాసంలో ఉంటుంది. 3 km (1.9 mi) కంటే చిన్నవి గానూ, 370 km (230 mi) పెద్దవి గానూ ఉన్న కళ్ళను గమనించారు. [14]

కంటి చుట్టూ మేఘావృతమై ఉండే బయటి అంచుని "కంటి గోడ" అంటారు. ఈ గోడ సాధారణంగా ఎత్తు పెరిగే కొద్దీ బయటికి విస్తరిస్తుంది. ఫుట్‌బాల్ స్టేడియంను పోలి ఉంటుంది; ఈ దృగ్విషయాన్ని కొన్నిసార్లు " స్టేడియం ప్రభావం "గా కూడా సూచిస్తారు. [15] కంటిగోడ వద్దనే గాలులు అత్యంత వేగంగా వీస్తాయి. గాలి మరింత వేగంగా పైకి లెగుస్తుంది. మేఘాలు అత్యధిక ఎత్తుకు చేరుకుంటాయి. అవపాతం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణమండల తుఫాను కంటిగోడ తీరాన్ని దాటి భూమి మీదుగా వెళ్ళే మార్గంలో గాలుల వలన భారీ ఎత్తున నష్టం సంభవిస్తుంది. [13]

బలహీనమైన తుఫానులో, దట్టమైన మేఘాలు చుట్టుముట్టడం వలన కన్ను అస్పష్టంగా ఉండవచ్చు. [16]

పరిమాణం[మార్చు]

తుఫాను పరిమాణాన్ని కొలవడానికి సాధారణంగా అనేక రకాల కొలమానాలు వాడతారు. అత్యంత సాధారణ కొలమానాలలో గరిష్ట స్థాయిలో గాలి వ్యాసార్థం, 34-knot (17 m/s; 63 km/h; 39 mph) గాలి (అంటే గేల్ ఫోర్స్ ), అన్నిటికంటే బయట ఉండే క్లోజ్డ్ ఐసోబార్ (ROCI) వ్యాసార్థం, గాలి వీచడం ఆగిన చోటు వ్యాసార్థం ఉన్నాయి. [17] తుఫాను రిలెటివ్ వోర్టిసిటీ ఫీల్డ్ 1×10 −5 s -1 కి తగ్గేసమయంలో వ్యాసార్థం ఎంత ఉంది అనేది మరొక కొలత.

ఉష్ణమండల తుఫానుల పరిమాణ వివరణలు
ROCI (వ్యాసం) టైప్ చేయండి
2 కంటే తక్కువ డిగ్రీల అక్షాంశం చాలా చిన్నవి/చిన్నవి
2 నుండి 3 అక్షాంశ డిగ్రీలు చిన్నది
3 నుండి 6 అక్షాంశ డిగ్రీలు మధ్యస్థం/సగటు/సాధారణం
6 నుండి 8 అక్షాంశ డిగ్రీలు పెద్దది
8 కంటే ఎక్కువ అక్షాంశ డిగ్రీలు చాలా పెద్దది [18]

భూమిపై, ఉష్ణమండల తుఫానుల పరిమాణం, గాలి వీచడం ఆగిన చోటు వ్యాసార్థం ద్వారా కొలిచినపుడు 100–2,000 km (62–1,243 mi) వరకు ఉంటుంది. వాయవ్య పసిఫిక్ మహాసముద్ర బేసిన్‌లో అత్యంత పెద్దవి గాను, ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర బేసిన్‌లో అత్యంత చిన్నవి గానూ ఉంటాయి.[19] అన్నిటికంటే బయట ఉండే క్లోజ్డ్ ఐసోబార్ వ్యాసార్థం రెండు డిగ్రీల అక్షాంశం కంటే తక్కువగా ఉంటే ( 222 km (138 mi) ), ఆ తుఫాను "చాలా చిన్నది" అని "మిడ్జెట్" అనీ అంటారు. 3–6 అక్షాంశ డిగ్రీల వ్యాసార్థం ( 333–670 km (207–416 mi) ) ఉంటే "సగటు తుఫాను పరిమాణం"గా పరిగణిస్తారు. "చాలా పెద్ద" ఉష్ణమండల తుఫానులకు 8 డిగ్రీల ( 888 km (552 mi) ) కంటే ఎక్కువ వ్యాసార్ధం ఉంటుంది.[18] తుఫాను పరిమాణం ఎంత అనేది, దాని తీవ్రత (అనగా గరిష్ట గాలి వేగం), గరిష్ట గాలి వ్యాసార్థం, అక్షాంశం, గరిష్ట సంభావ్య తీవ్రత వంటి వాటిపై బలహీనంగా ఆధారపడి ఉంటుందని పరిశీలనలు సూచిస్తున్నాయి. "టిప్" టైఫూన్, ఇప్పటివరకు రికార్డైన అతిపెద్ద ఉష్ణమండల తుఫాను. దాని గాలుల వ్యాసం 2,170 km (1,350 mi) అని రికార్డైంది. 2008 నాటి ఉష్ణమండల తుఫాను మార్కో, రికార్డైన అతి చిన్న తుఫాను. ఇందులో గాలుల వ్యాసం 37 km (23 mi) ఉంది. [20]

ఏర్పడే ప్రాంతాలు, హెచ్చరిక కేంద్రాలు[మార్చు]

ఉష్ణమండల తుఫాను ప్రాంతాలు, అధికారిక హెచ్చరిక కేంద్రాలు
బేసిన్ హెచ్చరిక కేంద్రం బాధ్యత ప్రాంతం గమనికలు
ఉత్తర అర్ధగోళం
ఉత్తర అట్లాంటిక్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హరికేన్ సెంటర్ (మయామి) భూమధ్యరేఖ ఉత్తరం, ఆఫ్రికన్ కోస్ట్ – 140°W [21]
తూర్పు పసిఫిక్ యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ పసిఫిక్ హరికేన్ సెంటర్ (హోనోలులు) భూమధ్యరేఖ ఉత్తరం వైపు, 140–180°W [21]
పశ్చిమ పసిఫిక్ జపాన్ వాతావరణ సంస్థ భూమధ్యరేఖ - 60°N, 180–100°E [22]
ఉత్తర హిందూ మహాసముద్రం భారత వాతావరణ శాఖ భూమధ్యరేఖ ఉత్తరం వైపు, 100–40°E [23]
దక్షిణ అర్థగోళం
నైరుతి<br id="mwAx8">హిందు మహా సముద్రం Météo-ఫ్రాన్స్ రీయూనియన్ భూమధ్యరేఖ – 40°S, ఆఫ్రికన్ తీరం – 90°E
ఆస్ట్రేలియన్ ప్రాంతం ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, వాతావరణ శాస్త్రం,<br id="mwAyw">జియోఫిజికల్ ఏజెన్సీ (BMKG) భూమధ్యరేఖ – 10°S, 90–141°E [79]
పాపువా న్యూ గినియా నేషనల్ వెదర్ సర్వీస్ భూమధ్యరేఖ – 10°S, 141–160°E [24]
ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ 10–40°S, 90–160°E [24]
దక్షిణ పసిఫిక్ ఫిజీ వాతావరణ సేవ భూమధ్యరేఖ – 25°S, 160°E – 120°W [24]
న్యూజిలాండ్ వాతావరణ సేవ 25–40°S, 160°E – 120°W [24]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Glossary of NHC Terms". United States National Hurricane Center. Archived from the original on February 16, 2021. Retrieved February 18, 2021.
  2. "Tropical cyclone facts: What is a tropical cyclone?". United Kingdom Met Office. Archived from the original on February 2, 2021. Retrieved February 25, 2021.
  3. 3.0 3.1 3.2 3.3 Global Guide to Tropical Cyclone Forecasting: 2017 (PDF) (Report). World Meteorological Organization. April 17, 2018. Archived (PDF) from the original on July 14, 2019. Retrieved September 6, 2020.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Tropical cyclone facts: How do tropical cyclones form?". United Kingdom Met Office. Archived from the original on February 2, 2021. Retrieved March 1, 2021.
  5. 5.0 5.1 Landsea, Chris. "How do tropical cyclones form?". Frequently Asked Questions. Atlantic Oceanographic and Meteorological Laboratory, Hurricane Research Division. Archived from the original on August 27, 2009. Retrieved October 9, 2017.
  6. Berg, Robbie. "Tropical cyclone intensity in relation to SST and moisture variability" (PDF). RSMAS (University of Miami). Archived (PDF) from the original on June 10, 2011. Retrieved September 23, 2010.
  7. Chris Landsea (January 4, 2000). "Climate Variability table — Tropical Cyclones". Atlantic Oceanographic and Meteorological Laboratory, National Oceanic and Atmospheric Administration. Archived from the original on October 2, 2012. Retrieved October 19, 2006.
  8. Lam, Linda (September 4, 2019). "Why the Eastern Caribbean Sea Can Be a 'Hurricane Graveyard'". The Weather Channel. TWC Product and Technology. Archived from the original on July 4, 2021. Retrieved April 6, 2021.
  9. Sadler, James C.; Kilonsky, Bernard J. (May 1977). The Regeneration of South China Sea Tropical Cyclones in the Bay of Bengal (PDF) (Report). Monterey, California: Naval Environmental Prediction Research Facility. Archived (PDF) from the original on June 22, 2021. Retrieved April 6, 2021.
  10. Chang, Chih-Pei (2004). East Asian Monsoon. World Scientific. ISBN 978-981-238-769-1. OCLC 61353183. Archived from the original on August 14, 2021. Retrieved November 22, 2020.
  11. 11.0 11.1 11.2 11.3 "Anatomy and Life Cycle of a Storm: What Is the Life Cycle of a Hurricane and How Do They Move?". United States Hurricane Research Division. 2020. Archived from the original on February 17, 2021. Retrieved February 17, 2021.
  12. 12.0 12.1 12.2 "Attempts to Stop a Hurricane in its Track: What Else has been Considered to Stop a Hurricane?". United States Hurricane Research Division. 2020. Archived from the original on February 17, 2021. Retrieved February 17, 2021.
  13. 13.0 13.1 National Weather Service (October 19, 2005). "Tropical Cyclone Structure". JetStream – An Online School for Weather. National Oceanic & Atmospheric Administration. Archived from the original on December 7, 2013. Retrieved May 7, 2009.
  14. Pasch, Richard J.; Eric S. Blake; Hugh D. Cobb III; David P. Roberts (September 28, 2006). "Tropical Cyclone Report: Hurricane Wilma: 15–25 October 2005" (PDF). National Hurricane Center. Archived (PDF) from the original on March 4, 2016. Retrieved December 14, 2006.
  15. Error on call to Template:cite paper: Parameter title must be specified
  16. American Meteorological Society. "AMS Glossary: C". Glossary of Meteorology. Allen Press. Archived from the original on January 26, 2011. Retrieved December 14, 2006.
  17. "Global Guide to Tropical Cyclone Forecasting: chapter 2: Tropical Cyclone Structure". Bureau of Meteorology. May 7, 2009. Archived from the original on June 1, 2011. Retrieved May 6, 2009.
  18. 18.0 18.1 "Q: What is the average size of a tropical cyclone?". Joint Typhoon Warning Center. 2009. Archived from the original on October 4, 2013. Retrieved May 7, 2009.
  19. Merrill, Robert T (1984). "A comparison of Large and Small Tropical cyclones". Monthly Weather Review. 112 (7): 1408–1418. Bibcode:1984MWRv..112.1408M. doi:10.1175/1520-0493(1984)112<1408:ACOLAS>2.0.CO;2. hdl:10217/200. S2CID 123276607. Archived from the original on May 23, 2022. Retrieved December 12, 2019.
  20. Dorst, Neal; Hurricane Research Division (May 29, 2009). "Frequently Asked Questions: Subject: E5) Which are the largest and smallest tropical cyclones on record?". National Oceanic and Atmospheric Administration's Atlantic Oceanographic and Meteorological Laboratory. Archived from the original on December 22, 2008. Retrieved June 12, 2013.
  21. 21.0 21.1 RA IV Hurricane Committee. Regional Association IV Hurricane Operational Plan 2019 (PDF) (Report). World Meteorological Organization. Archived (PDF) from the original on July 2, 2019. Retrieved July 2, 2019.
  22. WMO/ESCP Typhoon Committee (March 13, 2015). Typhoon Committee Operational Manual Meteorological Component 2015 (PDF) (Report). World Meteorological Organization. pp. 40–41. Archived (PDF) from the original on October 1, 2015. Retrieved March 28, 2015.
  23. WMO/ESCAP Panel on Tropical Cyclones (November 2, 2018). Tropical Cyclone Operational Plan for the Bay of Bengal and the Arabian Sea 2018 (PDF) (Report). World Meteorological Organization. pp. 11–12. Archived (PDF) from the original on July 2, 2019. Retrieved July 2, 2019.
  24. 24.0 24.1 24.2 24.3 RA V Tropical Cyclone Committee (October 31, 2022). Tropical Cyclone Operational Plan for the South-East Indian Ocean and the Southern Pacific Ocean 2022 (Report). World Meteorological Organization. pp. I-4–II-9 (9–21). Archived from the original (PDF) on 2023-06-22. Retrieved February 22, 2023.