తుర్లపాటి రాధాకృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నటశేఖర

తుర్లపాటి రాధాకృష్ణమూర్తి
తుర్లపాటి రాధాకృష్ణమూర్తి
జననం
తుర్లపాటి రాధాకృష్ణమూర్తి

(1938-07-10) 1938 జూలై 10 (వయసు 85)
జాతీయతభారతీయుడు
ఉద్యోగంఆంధ్ర క్రైస్తవ కళాశాల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగస్థలం, దర్శకుడు, రచయిత, ఆంధ్రోపన్యాసకుడు
గుర్తించదగిన సేవలు
సచ్చిదానందమయ మూర్తి, రంగస్థలి - అనుభవాలు, తోరణాలు
తల్లిదండ్రులుతల్లి : వెంకటసుబ్బమ్మ,
తండ్రి : కోటేశ్వరరావు

తుర్లపాటి రాధాకృష్ణమూర్తి ప్రముఖ రంగస్థల నటుడు. ముఖ్యంగా దుర్యోధన పాత్రలో రాణించాడు[1].

విశేషాలు[మార్చు]

మయసభ ఏకపాత్రలో దుర్యోధనునిగా తుర్లపాటి

ఇతడు ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, కలవకూరు గ్రామంలో 1938, జూలై 10వ తేదీన జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం చిననందిపాడు, పెదనందిపాడు, గుంటూరులలో సాగింది. తరువాత1962లో గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో తెలుగు ట్యూటరుగా చేరాడు. ఇతడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పద్యనాటక విభాగంలో శిక్షకుడిగా సేవలను అందించాడు.

నాటకరంగం[మార్చు]

ఇతని ప్రాథమిక రంగస్థల గురువు సెనగపాటి వీరేశలింగం. ఇతడు తొలిసారి సహదేవుని పాత్రను రంగస్థలంపై ధరించాడు. ఇతడు యువనాటక సమాజంలో చేరి ద్రౌపది, అశత్థామ మొదలైన పాత్రలను ధరించాడు. కాలేజీ చదివే రోజులలో కాళిదాసు నాటకంలో కవిరాక్షస, భోజరాజ పాత్రలను వేశాడు. ఆ తరువాత ఉద్యోగవిజయాలు నాటకంలో ధర్మరాజు, కర్ణుడు పాత్రలను ధరించి పౌరాణిక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ధూళిపాళ సీతారామశాస్త్రి సినిమాలలో ప్రవేశించడం, ఆచంట వెంకటరత్నం నాయుడు విజయవాడలో స్థిరపడటంతో గుంటూరు నాటక సమాజంలో ధుర్యోధన పాత్రధారి కొరత ఏర్పడింది. లక్ష్మయ్యచౌదరి ట్రూపు ఇందుపల్లిలో వేసిన నాటకంలో దుర్యోధన పాత్రను తుర్లపాటి రాధాకృష్ణమూర్తికి ఇచ్చారు. ఆనాటి నుండి కల్యాణం రఘురామయ్య, పీసపాటి నరసింహమూర్తి, ఏ.వి.సుబ్బారావు, షణ్ముఖి ఆంజనేయ రాజు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, ధూళిపాళ సీతారామశాస్త్రి, ఆచంట వెంకటరత్నం నాయుడు, కె.వి. రాఘవరావు, వెంకటనర్సు నాయుడు, రేబాల రమణ, చెంచు రామారావు, జై రాజు మొదలైన ప్రధాన నటుల సరసన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం వంటి నాటకాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఇతని నాటకాలు దూరదర్శన్‌లో, ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. భువన విజయం సాహిత్యరూపకాలలో భట్టుమూర్తి పాత్ర ధరించాడు.

సత్కారాలు[మార్చు]

ఇతడు నటించిన పాత్రలు అనేక నాటక పోటీలలో ఇతనికి బహుమతిని తెచ్చిపెట్టాయి. అనేక సన్మానాలు, సత్కారాలు పొందాడు. చోడవరంలో, గుంటూరులో ఇతనికి ఘంటా కంకణ ప్రదానం జరిగింది.

  • సువర్ణ ఘంటా కంకణ ప్రదానం - సమతా నాటక గురుకులం, గుంటూరు
  • సువర్ణ ఘంటా కంకణ ప్రదానం - కళాకారుల సంఘం గుంటూరు
  • సువర్ణ రత్నాంగుళీయకం - సత్య సాయి బాబా ప్రదానం చేసారు

బిరుదులు[మార్చు]

  • నటశేఖర
  • నట సార్వభౌమ
  • నటనా విహారి
  • బళ్ళారి రాఘవ పురస్కారం
  • అభినయ వాచస్పతి
  • నట కంఠీరవ
  • నట శిరోరత్న
  • నటనాధ్వపతి
  • నట చక్రవర్తి [2]

రచనలు[మార్చు]

  • ఏకపాత్రల సమాహారం
  • రంగస్థలి అనుభవాల తోరణాలు
  • శ్రీ గుంటుపల్లి ఆంజనేయ చౌదరి గారి అభినందన సంచిక (సంపాదకత్వం)
  • కళాతపస్వి శత జయంతి సంచిక (సంపాదకత్వం)
  • ఆణిముత్యం డా. పోలె ముత్యం ఉద్యోగ విరమణ షష్ట్యబ్ది అభినంద సంచిక (సంపాదకత్వం)
  • సచ్చిదానందమయమూర్తి

మూలాలు[మార్చు]

  1. సారా (26 January 1980). "నటభూషణ తుర్లపాటి రాధాకృష్ణమూర్తి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 293. Retrieved 20 January 2018.[permanent dead link]
  2. రంగస్థలి అనుభవాలు, తోరణాలు పుస్తకం నుండి