తులసి ఆకుల నూనె

వికీపీడియా నుండి
(తులసి నూనె నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తులసి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఓ. టెన్యుయిఫ్లోరమ్
Binomial name
ఓసిమం టెన్యుయిఫ్లోరమ్
Synonyms

ఓసిమం శాంక్టమ్ లి.

తులసి ఆకుల నూనె ఓషద గుణాలున్న నూనె.తులసి ఆకుల నుండి తీసిన ఈ నూనెను తులసి అవశ్యకనూనె (essential oil) అంటారు.వ్యాపారపరంగా ఈ నూనెను తులసి నూనె అని సాధారణంగా వ్యవహరిస్తుంటారు.తులసి ఆకుల నూనెను ఎండబెట్టిన తులసి ఆకులను స్టీము డిస్టిలేసన్/ఆవిరి స్వేదన క్రియ లేదా సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ (ద్రావణి సంగ్రహణ విధానం) ద్వారా ఉత్పత్తి చేస్తారు.ద్రావణి సంగ్రహణ విధానం లో సాల్వెంట్/ద్రావణీ (solvent) గా ఇథనాల్ లేదా n-హెక్సేన్ ఉపయోగిస్తారు.తులసి అవశ్యకనూనెను యూజెనొల్ ఆమ్లం అనికూడా పిలుస్తారు.తులసి ఆకుల నూనెను ఆయుర్వేద వైద్యంలోనే కాకుండా సౌందర్యపోషక ద్రవ్యంగా కూడా ఉపయోగిస్తారు.తులసి గింజలు కూడా నూనెను కలిగి వుండును.తులసి గింజలనూనె అకులనూనెవలె అవశ్యక నూనె కాకుండ కొవ్వు ఆమ్లాలు కల్గివుండును

తులసి మొక్క[మార్చు]

హిందువులకు పరమ పూజనీయమైన చెట్టు తులసి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తులసిని పరమ పవిత్రంగా కొలుస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి మూఊ నాలుగు రకాలుగా ఉన్నాయి. రకాలు ఎర్రపూలు పూసే చెట్టును కృష్ణతులసి అని తెల్లపూలు పూసే చెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.[1].తులసి మొక్క వృక్షశాస్త్ర శాస్త్రీయ పేరు ఓజిమం టెనుఫ్లోరం (Ocimum tenuiflorum). తులసి ల్యామియేసియే కుటుంబానికి చెందిన మొక్క.[2] తులసి ఆకులను, మొక్కకాండాన్ని విత్తనాలను సాంప్రదాయ వైద్యంలో, ఆయుర్వేద వైద్యంలో వాడుతారు.

తులసి మొక్క బహువార్షిక గుల్మం .సుమారు 1.5 మీటర్ల ఎత్తు గుంపుగా పెరుగును.సువాసగా వుండును. తెల్లని పూల గుత్తులను మొక్క కొమ్మ చివరలల్లో కల్గి వుండును. తులసి విత్తనాల్లో కొవ్వు ఆమ్లాలు వున్నవి (స్టియరిక్, పామిటిక్, ఒలిక్, లినోలిక్ ఆమ్లం, లినోలెనిక్ ఆమ్లాలు).తులసి మొక్క బెటా కెరోటేన్, కాల్షియం, విటమీన్ C లను కల్గి ఉంది.తులసి ఆకులు ఆవశ్యక నూనెతో పాటు యుర్సోలిక్ ఆమ్లం, n-ట్రైకాంటనోల్ (n-triacontanol) లను కూడా అదనంగా కల్గివున్నది.విత్తనాలలో కొవ్వు ఆమ్లలతో పాటు సిటో స్టేరోల్ కూడా ఉంది.అలాగే తులసి మొక్క వేర్లలలో సిటో స్టేరోల్, A, B,, C ట్రైటేర్ఫైన్ లు ఉన్నాయి.[3]

తులసి ఆకుల నుండి ఆవశ్యక నూనెను తీయు విధానం[మార్చు]

హైడ్రో ఎక్సుట్రాక్షన్ పద్ధతి[మార్చు]

నీటి ద్వారా తులసి ఆకుల నుండి నూనెను తీయు పద్ధతిని హైడ్రో ఎక్సుట్రాక్షన్ పద్ధతి అంటారు.మొదట తులసి ఆకులను సంగ్రహించి, నీటితో శుభ్రంగా కడిగి నీడలో కనీసం ఒక వారం పాటు ఆకుల్లోని తేమ శాతం తగ్గే వరకు ఆర బెట్టెదరు.ఆ తరువాతఆరిన ఆకులను పొడి కొట్టెదరు. ఇలా పొడి చేసిన ఆకులను డిస్టిలేటరులో నింపెదరు.

డిస్టిలేటరు, స్టీలుతో చేయబడిన పాత్ర స్తూపాకారంగా వుండి, పైభాగం శంకువు లేదా డోము ఆకారంలో వుండును. పైభాగాన ఒక గొట్టం, తిరగేసిన U లా వంపుగా వుండి, దాని చివర ఒక కండెన్సరుకు బిగింపబడి వుండును. కండెన్సరులో ద్రవీకరణ చెందిన నూనెను సంగ్రహించుటకు ఒకగొట్టం సంగ్రహణ పాత్రకు కలుపబడి వుండును.డిస్టిలేటరు ఒక పొయ్యి మీద అమర్చబడి వుండును. డిస్టిలేటరులో తులసి ఆకులతో పాటు కోట నీటిని చేర్చి డిస్టిలేటరును వేడిచేయుదురు.డిస్టిలేటరు అడుగు భాగాన్ని వేడి చెయ్యుటకు కలప, పొట్టూ లేదా గ్యాసును ఉపయోగిస్తారు.తులసి నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు స్వాభావం కల్గి ఉంది.అందువలన డిస్టిలేటరులోని నీరు ఆవిరిగా మారినపుడు దానితో పాటు తులసి నూనె కూడా ఆవిరిగా మారి, డిస్టిలేటరు పైభాగంలో వున్న గొట్టం ద్వారా కండెన్సరు చేరి, అక్కడ ద్రవీకరణ చెంది సంగ్రహణ పాత్రలో జమ అగును. తులసి నూనె యొక్కసాంద్రత నీటి కన్న తక్కువ కావడం వలన, సంగ్రహణ పాత్రలో కింది భాగంలో నీరు, నీటి ఉపరితలంలో తులసి నూనె జమ అగును.

స్టీము డిస్టిలేసను పద్దతి[మార్చు]

ఇది హైడ్రో డిస్టిలేసను వంటిదే ఇందులో డిస్టిలరులో నీరును నింపి వేడి చేయుటకు బదులు, డిస్టిలరు అడుగుభాగం నుండి నీటి ఆవిరి/స్టీమును పంపి పాత్రలోని ఆకులను లేదా గింజలను వేడి చేయుదు.మిగతా విధానం పరికరాలు అంతా హైడ్రో ఎక్సుట్రాక్షన్ పద్ధతిలో సాగును.

సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ పద్ధతి/ద్రావణి సంగ్రహణ విధానం[మార్చు]

ద్రావణి అనగా ఏదైనా ఘన .ద్రవ లేదా వాయు పదార్థాన్ని తనలో కరగించు గుణమున్న ద్రవం. ఈపద్దతిలో ద్రావణి /సాల్వెంట్‌ను ఉపయోగించి తులసి ఆకులల్లోని నూనెను ఉత్పత్తి చేయుదురు.ఆవశ్యక నూనెలు హైడ్రోకార్బను ద్రవాలలో సులభంగా కరుగును. ఆవశ్యక నూనెలు కూడా ఒకరకమైనహైడ్రో కార్బన్ సంయోగ పదార్థాలే. ఇథనోల్ లేదా హేక్సేన్ ను ద్రావణీగా ఉపయోగించి నూనెను ఆకులనుండి తీయుదురు. ఒక స్టీలు పాత్రలో ఆరబెట్టిన, తులసి ఆకుల పొడిని తీసుకుని, దానికి తగిన పరిమాణంలో ద్రావణిని కలిపి రెండు మూడు రోజులు అలాగే వదలి వెయ్యడం వలన నెమ్మదిగా ఆకుల్లోని నూనె ద్రావణిలో కరుగును. నూనెను కలిగిన మిశ్రమ ద్రావణిని 60oC ఉష్ణోగ్రత వద్ద నెమ్మదిగా వేడి చెయ్యడం వలన ద్రావణి ఆవిరి చెంది, పాత్రలో తులసి నూనె మిగిలి వుండును.మరో పద్ధతిలో పాత్రలో/రియాక్టరులోవున్న ఆకులమీద ద్రావణిని ఒక పంపు/తోడు యంత్రం ద్వారా కంటిన్యూయస్‌గా కొన్ని గంటల సేపు సర్కులేట్ (ప్రసరణ) చెయ్యడం వలన ఆవశ్యక నూనె ద్రావణిలో కరుగును. తరువాత పైన పేర్కోన్న విధంగా60oC ఉష్ణోగ్రతవనెమ్మదిగా వేడి చెయ్యడం వలన ద్రావణి ఆవిరి చెంది పాత్రలో తులసి నూనె మిగిలి వుండును.

మైక్రోవేవ్ ఓవన్ హైడ్రో డిస్టిలేసన్ పద్ధతి[మార్చు]

తులసి నూనె-భౌతిక దర్మాలు.[మార్చు]

ఇది పాలిపోయిన పసుపురంగులో వుండు ద్రవం.తులసి ఆకులు ఆవశ్యక నూనె యూజెనోల్, యూజనాల్, కార్వాక్రోల్, మిథైల్ చావికోల్, లిమాట్రోల్, కారిఒఫ్య్ల్లిన్ లను కలిగి ఉంది.లేత పసుపు రంగులో వుండును.ఘాటైన ప్రత్యేకమైన వాసనకల్గి ఉంది. 25 °C వద్ద తులసి నూనె యొక్క సాంద్రత 0.928 గ్రాములు/సెం.మీ3.వక్రీభవన సూచిక 1.515.ద్రావణి ఉపయోగించి సంగ్రహించిన నూనె రంగు వేరుగా వుండును.హెక్సేనుతో తీసిన నూనె బ్రౌన్ రంగులో వుండును.ఇథైల్ ఎసీటేట్ తో తీసిన నూనె ఆరెంజీ రంగులో, క్లోరోఫారంతో తీసిన నూనె గ్రే రంగులో వుండును.

తులసి నూనెలోని రసాయనిక సమ్మేళనాలు[మార్చు]

హైడ్రో డిస్టిలేసన్ ద్వారా తీసిన తులసి నూనెలో చాలా రకాలైన పైటో/phyto రసాయన సమ్మేళానాలు ఉన్నాయి.పైటో అనగా వృక్షసంబంధిత రసాయన సంయోగ పదార్థాలు అని అర్థం. తులసి నూనెలో దాదాపు 62% వరకు యూజనోల్ ఉంది. ఆతరువాత ఎక్కువ శాతంలో 12% వరకు ఐసో ప్రొఫైల్ పాపిటేట్ ఉంది. మిగిలినవి 5% లోపు ఉన్నాయి.తులసి రకాన్ని బట్టి నూనెలోని సంయోగపదార్థాల శాతం, రకం కూడా కొద్దిగా మారును.అలాగే సాల్వెంట్ ఎక్సుట్రాక్షను విధానంలో అయిన ఉపయోగించిన ద్రావణిని బట్టితులసి నూనెలోని సమ్మేళానాలు, వాటి శాతం మారును.

హైడ్రో డిస్టిలేసన్ ద్వారా తీసిన తులసి నూనె[మార్చు]

వరుస సంఖ్య రసాయన సమ్మేళనం శాతం
1 యూజెనోల్ 61.76%
2 ఐసోప్రొఫైల్ పాపిటేట్ 11.36 %
3 α-కుబేన్ 3.85%
4 2,3 డైహైడ్రోక్షి ప్రోపైల్ ఎలైడేట్ 5.10%
5 1-మిథైల్-3 (1-methyl) బెంజేన్ 1.73%
6 2-మిథోక్షి- 4- (1-ప్రోపైల్) పెనోల్ 2.65%
7 వనిల్లిన్ 1.27%
8 1-4 డై ఇథైల్ బెంజెన్ 1.03%
9 హెక్సాదేకోనోయిక్ ఆసిడ్ మిథైల్ ఈస్టరు 2.51%
10 -[2-మిథైల్-4- (1-ప్రోపిల్) ఫెనొక్షి]silane 2.01%

హెక్సేన్ ఉపయోగించి సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో తీసిననూనె లోని సమ్మేళన పదార్థాలు[మార్చు]

వరుస సంఖ్య రసాయన సమ్మేళనం శాతం
1 1,2-డై మిథోక్సీ-2 (2-ప్రోపైనైల్) బెంజేన్ 35.82%
2 2-పెంటానోన్ 27.06%
3 కారో పైలెన్ ఆక్సైడ్ 4.64%
4 ఆసిటిక్ ఆన్ హైడ్రేట్ 4.32%
5 మిగిలినవి 3.0%

తులసి నూనె ఉపయోగాలు[మార్చు]

తులసి నూనెను పలు వ్యాధులనివారణలో ఉపయోగిస్తారు.ఆయుర్వేదంలో తులసి నూనెను చాలా ప్రాముఖ్యత ఉంది.

  • తామరవ్యాధిని నివారించుటకై తులసి నూనెను నిమ్మరసంతో కలిపి, వ్యాధి సోకిన చోట పూస్తారు.అలాగేదురద నివారణకు ఉపయోగిస్తారు.కేసవర్దని నూనెగా కూడా ఉపయోగిస్తారు.[4]
  • అజీర్తి, కడుపు వుబ్బరంగా వున్నను కడుపులో తిమ్మిరిగా వున్నను, వాటి నివారణకు తులసి ఆవశ్యక నూనెను ఉపయోగిస్తారు.[5]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "తులసి ఆకుల ప్రయోజనాలు". vikaspedia.in. Archived from the original on 2017-10-11. Retrieved 2018-07-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Tulsi Plant". ecoindia.com. Archived from the original on 2017-12-10. Retrieved 2018-07-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Tulasi Herbal Extract". savestaherbals.com. Archived from the original on 2017-08-29. Retrieved 2018-07-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "12 Amazing Benefits Of Basil (Tulsi) Oil For Skin And Hair". stylecraze.com. Retrieved 2018-07-30.
  5. "Health benefits of Tulsi (Basil) Essential Oil". healthbenefitstimes.com. Retrieved 2018-07-30.