తులసి రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నర్రెడ్డి తులసి రెడ్డి
తులసి రెడ్డి

డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలము
1988-1994

వ్యక్తిగత వివరాలు

జననం (1951-08-01) 1951 ఆగస్టు 1 (వయస్సు: 69  సంవత్సరాలు)
గడ్డంవారిపల్లె
కడప జిల్లా.
రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
నివాసము వేంపల్లి
హైదరాబాద్

డాక్టర్ ఎన్.తులసి రెడ్డి మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్సీ,20 సూత్రాల అమలు కమిటీ మాజీ ఛైర్మన్,కడప జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు[1].

బాల్యము, విద్యాభ్యాసము[మార్చు]

కుటుంబం[మార్చు]

భార్య అలివేలు తుల‌సిరెడ్డి, వీరికి ఇద్దరు ఆడ పిల్లలు.

సింపుల్ గా[మార్చు]

తుల‌సిరెడ్డి ఎంత సింపుల్ గా ఉంటాడో..ఆయ‌న విమ‌ర్శ‌లు అంత ఘాటుగా ఉంటాయి. చౌక‌బారు విమ‌ర్శ‌లు, బూతులు, ఆధారాల్లేని ఆరోప‌ణ‌లు పెద్ద‌గా చేయ‌ని తుల‌సిరెడ్డి కాంగ్రెస్ లో పెద్ద‌గా మ‌చ్చ‌లులేని ఓ నాయ‌కుడ‌ని చెప్పొచ్చు. దీనికితోడు కడప లాంటి ఫ్యాక్ష‌న్ ప్రాంతం నుంచి రాజ‌కీయ నాయకుడిగా ఎదిగి..ముఠాక‌క్ష‌లతో ఎటువంటి సంబంధాలు లేని రాజ‌కీయ నేత తుల‌సిరెడ్డి.

రాజకీయ జీవితం[మార్చు]

తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశాడు. అంచలంచెలుగా ఎదిగి బిజెపి, కాంగ్రెస్, సమైక్యాంధ్ర పార్టీల్లో కీలక పదవులు పొందాడు. తెలుగుదేశం పార్టీలో ఉండగా కడప జడ్పీ చైర్మన్ పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ హోదా కలిగిన 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. ఇతడు 1988లో రాజ్యసభకు ఎన్నికై 1994 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు[2].

తెలంగాణ కు వ్యతిరేకం[మార్చు]

తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకంగా సమైక్యాంధ్ర నినాదంతో కాంగ్రెస్కి రాజీనామా చెసాడు[3].తరువాత మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా ఆయన స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో కీలక భూమిక పోషించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న[మార్చు]

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీపై కోపంతో కిర‌ణ్‌రెడ్డి జై స‌పాలో చేరారు. రాష్ట్ర విభజ‌నా అయిపోయింది. న‌ల్లారి వారి వెంట న‌డిచిన వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌ర‌మైంది. వీరిలో తుల‌సిరెడ్డి ఒక‌రు. చివ‌రికి చేసేదేమీ లేక హ‌స్తం పార్టీ తీర్థం మ‌ళ్లీ పుచ్చుకున్నారు [4].

మూలాలు[మార్చు]

  1. https://www.youtube.com/watch?v=hMxTu2yxCKI
  2. "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Parliament of India, Rajya sabha. RAJYA SABHA SECRETARIAT. Archived from the original (PDF) on 22 మార్చి 2019. Retrieved 12 May 2020.
  3. http://archive.andhrabhoomi.net/content/s-3922[permanent dead link]
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-01. Retrieved 2015-10-25.

http://apnewslive.com/tulasi-reddy-refuses-to-move-into-bungalow/

బయటి లింకులు[మార్చు]