తులసీదళం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తులసీదళం
Tulasi Dalam Movie Poster.jpg
తులసీదళం సినిమా పోస్టర్
దర్శకత్వంఆర్. పి. పట్నాయక్
కథా రచయితఆర్. పి. పట్నాయక్
నిర్మాతఆర్. పి. పట్నాయక్, కిషోర్ కంటమనేని (సమర్పణ)
తారాగణంనిశ్చల్
వందన గుప్తా
ఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంశరత్ మండవ
కూర్పుఎస్.బి. ఉద్ధవ్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
కలర్స్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2016 మార్చి 11 (2016-03-11)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తులసీదళం 2016, మార్చి 11న విడుదలైన తెలుగు భయానక చలనచిత్రం.[1][2] కలర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ కంటమనేని సమర్పణలో ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో నిశ్చల్, వందన గుప్తా, ఆర్. పి. పట్నాయక్ తదితరులు నటించారు. ప్రపంచంలోనే అత్యధిక వెలుతురున్న ప్రాంతమైన లాస్ విల్లాస్‌లో చిత్రీకరణ జరిగింది.[3][4]

కథా సారాంశం[మార్చు]

అనాథైన సాత్విక్ (నిశ్చల్ దేవ) తాను ప్రేమించిన అమ్మాయి నిషా (వందన గుప్తా) కోసం లాస్ వేగాస్ వెళతాడు. దయ్యాలను, అదృశ్య శక్తులను ఏమాత్రం నమ్మని సాత్విక్, అందుకు విరుద్ధమైన ఆలోచనలున్న సుబ్బుతో కలిసి ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఒక రోజు సుబ్బూ, సాత్విక్‍ని స్మశానంలో ఓ రాత్రి గడపాలనే ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌ను సాత్విక్ విజయవంతంగానే పూర్తి చేసినా, ఆ తర్వాత అతడికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శాంతి పేరుగల ఓ అమ్మాయి అతడిని వెంటాడుతున్న ఫీలింగ్ కూడా అతడ్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శాంతి ఎవరు, వీటినుంటి సాత్విక్‌ని డాక్టర్ తిలక్ (ఆర్పీ పట్నాయక్) ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.[5]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, నిర్మాత, సంగీతం, దర్శకత్వం: ఆర్. పి. పట్నాయక్
 • సమర్పణ: కిషోర్ కంటమనేని
 • ఛాయాగ్రహణం: శరత్ మండవ
 • పాటలు: తిరుమల్‌ నాగ్‌
 • కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్
 • నిర్మాణ సంస్థ: కలర్స్ ఎంటర్టైన్మెంట్

విడుదల - స్పందన[మార్చు]

ఈ చిత్రం 2016, మార్చి 11న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విడుదలయింది. ఈ చిత్రానికి ది హిందూ పత్రికలో వై. సునితా చౌదరి ప్రతికూల సమీక్షను ఇచ్చింది.[7] 123తెలుగు.కాంలో 2/5 రేటింగ్ ఇవ్వబడింది.[8]

మూలాలు[మార్చు]

 1. The Hans India, Cinema (29 February 2016). "Coming of age thriller". Archived from the original on 6 మార్చి 2016. Retrieved 13 February 2020.
 2. ప్రజాశక్తి, మూవీ (8 February 2016). "తులసీదళం". www.prajasakti.com. Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 3. మన తెలంగాణ, సినిమా (7 March 2016). "మ్యూజికల్ హారర్ 'తులసీదళం'". Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (9 March 2016). "హీరో కంటే కథకే విలువిస్తా - ఆర్పీ పట్నాయక్‌". Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 5. 123తెలుగు.కాం, సమీక్ష (11 March 2016). "సమీక్ష: తులసీదళం – నాసిరకమైన హర్రర్ థ్రిల్లర్!". www.123telugu.com. Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.
 6. India Glitz, Movies. "Tulasidalam Photos". IndiaGlitz.com. Retrieved 13 February 2020.
 7. The Hindu, Andhra Pradesh (12 March 2016). "Absurd and underdeveloped plot". Y. Sunita Chowdhary. Archived from the original on 12 మార్చి 2016. Retrieved 13 February 2020.
 8. 123తెలుగు.కాం, రివ్యూ (11 March 2016). "Tulasidalam Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). Archived from the original on 13 ఫిబ్రవరి 2020. Retrieved 13 February 2020.

ఇతర లంకెలు[మార్చు]