తుళువ నరస నాయకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

తుళువ నరస నాయకుడు సాళువ నరసింహదేవ రాయలు వద్ద సేనాని, ఇతను బహమనీలనుండి ఎంతో ధనాన్ని నేర్పుగా కొల్ల గొట్టినాడు. ఇతడు నరసింహదేవ రాయలును సింహాసనాధిస్టులను చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు.

సాళువ నరసింహ రాయలు మరణ శయ్యపై ఉండి విజయనర రాజ్యాన్నీ, తన కుమారులనూ తుళువ నరస నాయకునికి అప్పగించాడు. ఇచ్చిన మాట ప్రకారం ముందు పెద్ద కుమారుడైన తిమ్మ భూపాలుడును తరువాత రెండవ నరసింహ రాయలును సింహాసనం అధిస్టింపచేసి తాను రాజ్యభారాన్ని వహించాడు, లేదా అధికారాన్ని చెలాయించాడు

మొదటి దండయాత్ర

[మార్చు]

ఇతను అధికారాన్ని సహించలేని సామంతులు స్వతంత్రించారు, గజపతులు విజృంభించి చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. చోళ, పాండ్య, మధుర సామంతులు స్వతంత్రించారు. వీటన్నింటినీ చక్కబరచడానికి 1496లో దండయాత్రకు బయలుదేరినాడు. తూర్పు సముద్రంవరకూగల భూమిని అందున్న సామంతులను అణచి, దక్షిణమునకు వచ్చి చోళ రాజును ముట్టడించాడు. అప్పటి తిరుచినాపల్లి పాలకుడు కోనేటి రాజు ఓడిపోయినాడు, తరువాత మధుర పాలకుడైన మానభూషనుడుని ఓడించి తరువాత పాండ్య రాజ్యముపై దండెత్తి ఆ రాజ్యమును సామంత రాజ్యముగా చేసుకున్నాడు. తరువాత కర్నాట ప్రాంతమునందున్న ఉమ్మత్తూరు పై దండెత్తినాడు.

ఇలాగే విజయోత్సాహంతో ముందుకు వెళ్తున్న నరస నాయకునికి శ్రీరంగపట్టణం, శివసముద్రంలను ముట్టడించకుండా పొంగిపొరలుతున్న కావేరీ నది అడ్డు వచ్చింది. దానితో కావేరీ నదికి ఆనకట్ట కట్టి శ్రీరంగమును ముట్టడించి భీకర యుద్ధం చేసాడు, దుర్గరక్షణాధికారి హోయ్సణేంద్రుడు బంధీ అయినాడు. శ్రీరంగము నరసనాయకుని వశం అయినది. ఉమ్మత్తూరు కూడా ఇతని ఆధీనంలోనిని వచ్చింది.

బీజాపూరు పాలకునితో యుద్దం

[మార్చు]

బీజాపూరు పాలకుడైన యూసఫ్ ఆదిల్‌షా విజయనగర రాజ్యానికి చెందిన మానువ కోటను ఆక్రమించాడు, దానితో నరసనాయకుడు వారిపైకి సైన్యాలను నడిపి యూసఫ్ ఆదిల్‌షాను బంధీగా పట్టుకోని దయతో వదిలివేసినాడు.

గజపతుల దండయాత్రను అడ్డుకొనుట

[మార్చు]

1496న గజపతుల రాజు పురుషోత్తమ గజపతి మరణించాడు, అతని కుమారుడు ప్రతాపరుద్ర గజపతి సింహాసనం అధిస్టించి, దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు, కృష్ణా నది దాటి రాకుండా నరస నాయకుడు వీనిని ఓడించాడు.

మరణం

[మార్చు]

ఇతను 1503లో మరణించాడు

విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
రెండవ నరసింహ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1491 — 1503
తరువాత వచ్చినవారు:
వీరనరసింహ రాయలు