తుషార్ కపూర్
తుషార్ కపూర్ | |
---|---|
![]() | |
జననం | బొంబాయి , మహారాష్ట్ర , భారతదేశం | 20 నవంబరు 1976
విద్యాసంస్థ | రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | ఏక్తా కపూర్ (అక్క) అభిషేక్ కపూర్ (కజిన్) |
తుషార్ కపూర్ (జననం 20 నవంబర్ 1976) భారతదేశానికి చెందిన నటుడు, నిర్మాత. ఆయన నటులు జీతేంద్ర & శోభా కపూర్ దంపతుల కుమారుడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]తుషార్ కపూర్ 1976 నవంబర్ 20న సినీ నటులు జీతేంద్ర, శోభా కపూర్ దంపతులకు జన్మిన్చాడు. ఆయన బాంబే స్కాటిష్ స్కూల్లో ఆ తరువాత స్టీఫెన్ ఎం. రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో బీబీఏ, ఆన్ అర్బోర్‌లోని మిచిగాన్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకున్నాడు. తుషార్ కపూర్ 2016లో సరోగసీ ద్వారా లక్షయ కపూర్‌కి పొందాడు.[1]
సినీ జీవితం
[మార్చు]తుషార్ కపూర్ నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందు చిత్ర దర్శకుడు డేవిడ్ ధావన్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసి ఆ తరువాత రోషన్ తనేజా, మహేంద్ర వర్మల వద్ద నటుడిగా, నిమేష్ భట్ వద్ద నృత్యంలో శిక్షణ పొందాడు.[2][3] తుషార్ కపూర్ 2001లో తెలుగు సూపర్ హిట్ సినిమా తొలి ప్రేమ యొక్క రీమేక్ అయిన బ్లాక్ బస్టర్ ముజే కుచ్ కెహనా హైతో సినీరంగంలోకి హీరోగా అరంగేట్రం చేశాడు.[4]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2001 | ముఝే కుచ్ కెహనా హై | కరణ్ శర్మ | గెలుపొందారు - ఉత్తమ తొలి పురుషుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2002 | క్యా దిల్ నే కహా | రాహుల్ వశిష్ట్ | |
జీనా సిర్ఫ్ మెర్రే లియే | కరణ్ మల్హోత్రా | ||
2003 | కుచ్ తో హై | కరణ్ | |
యే దిల్ | రవి ప్రతాప్ సింగ్ | ||
2004 | షార్ట్: ది ఛాలెంజ్ | జై కపూర్ | |
గయాబ్ | విష్ణు ప్రసాద్ | ||
ఖాకీ | సబ్ ఇన్‌స్పెక్టర్ అశ్విన్ గుప్తే | ||
2005 | ఇన్సాన్ | అవినాష్ కపూర్ రానా | |
క్యా కూల్ హై హమ్ | రాహుల్/సంజు | ||
2006 | గోల్‌మాల్ | లక్కీ గిల్ | నామినేట్ చేయబడింది - హాస్య పాత్రలో ఉత్తమ నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2007 | గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ | రాజన్ మల్హోత్రా | |
క్యా లవ్ స్టోరీ హై | అర్జున్ | ||
షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా | దిలీప్ బువా | ||
అగ్గర్ | ఆర్యన్ మెహతా | ||
ధోల్ | సమీర్ (సామ్) ఆర్య | ||
ఓం శాంతి ఓం | అతిధి పాత్ర | "దీవాంగి" పాటలో అతిథి పాత్ర | |
2008 | వన్ టూ త్రీ | లక్ష్మీ నారాయణ్ | |
C Kkompany | అక్షయ్ కుమార్ | ||
హల్లా బోల్ | అతిధి పాత్ర | అతిథి పాత్ర | |
సండే | అతిధి పాత్ర | "మంజార్" పాటలో అతిథి పాత్ర | |
గోల్‌మాల్ రిటర్న్స్ | లక్కీ గిల్ | నామినేట్ చేయబడింది - ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | |
2009 | లైఫ్ పార్టనర్ | భావేష్ పటేల్ | |
2010 | గోల్మాల్ 3 | లక్కీ గిల్ | |
2011 | నగరంలో షోర్ | తిలక్ | |
లవ్ యు...మిస్టర్. కలకార్! | సాహిల్ | ||
హమ్ తుమ్ షబానా | రిషి మల్హోత్రా | ||
ది డర్టీ పిక్చర్ | రమాకాంత్ | ||
2012 | ఛార్ దిన్ కి చాందిని | వీర్ విక్రమ్ సింగ్ | |
క్యా సూపర్ కూల్ హై హమ్ | ఆదిత్య (ఆది)/జాన్ | ||
2013 | షూటౌట్ ఎట్ వాడాలా | షేక్ మునీర్ | |
బజతే రహో | సుఖ్విందర్ (సుఖి) బవేజా | ||
2016 | క్యా కూల్ హై హమ్ 3 | కన్హయ్య | [5] |
మస్తీజాదే | సన్నీ కేలే | ||
2017 | పోస్టర్ బాయ్స్ | అతిధి పాత్ర | |
గోల్‌మాల్ ఎగైన్ | లక్కీ గిల్ | ||
2018 | సింబా | అతిధి పాత్ర | " ఆంఖ్ మారే " పాటలో |
2020 | లక్ష్మి | - | నిర్మాత[6] |
2022 | మారిచ్ | రాజీవ్ దీక్షిత్ | నిర్మాత కూడా[7] |
2024 | లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2 | అతనే | అతిధి పాత్ర |
2025 | వెల్‌కమ్ టు ది జంగిల్ † | ||
TBA | కప్కపియీ † |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2019 | బూ సబ్కి ఫటేగీ | గోపాల్ | ఆల్ట్ బాలాజీ సిరీస్ |
2023 | పాప్ కౌన్? | అతిధి పాత్ర | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్ |
2024 | దస్ జూన్ కి రాత్ - అధ్యాయం 1 | పనౌటి | జియో సినిమా సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ Sahadevan, Sonup (27 June 2016). "Tusshar Kapoor becomes father to baby boy using surrogacy". The Indian Express. Archived from the original on 27 June 2016. Retrieved 2016-06-30.
- ↑ "A star arrives in style". The Hindu. Archived from the original on 25 February 2005. Retrieved 27 September 2015.
- ↑ "'Kya Kool Hain Hum 3' banned by Censor Board". Deccan Chronicle. 8 October 2015. Archived from the original on 22 January 2016. Retrieved 12 November 2015.
- ↑ "Satish Kaushik: Ruslaan fits TEREE SANG just as Tusshar did in MKKH - bollywood news : glamsham.com". www.glamsham.com (in ఇంగ్లీష్). Archived from the original on 27 October 2017. Retrieved 2017-10-27.
- ↑ "Kya Kool Hai Hum 3 to take on Akshay Kumar's Airlift". www.indicine.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 27 October 2017. Retrieved 2017-10-27.
- ↑ "Akshay Kumar-starrer 'Laxmmi Bomb' gets a release date, will premiere on OTT platform on Diwali". Archived from the original on 11 October 2020. Retrieved 17 September 2020 – via The Economic Times.
- ↑ "Maarrich trailer out. Tusshar Kapoor as a fearless cop is on a hunt to find the killer". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-01-05.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో తుషార్ కపూర్ పేజీ