Coordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E / 15.741; 79.848

తూర్పు గంగవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
పటం
Coordinates: 15°44′28″N 79°50′53″E / 15.741°N 79.848°E / 15.741; 79.848
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంతాళ్ళూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523264 Edit this on Wikidata


తూర్పు గంగవరం, ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామం తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనే గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామం పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపార పరంగా గాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వం తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో నాగంభొట్లపాలెం, రామభద్రాపురం, సోమవరప్పాడు, మాధవరం అను మరి నాల్గు గ్రామాలు కూడా కలిసి ఉండి పాత నెల్లూరు జిల్లాలోని దర్శి తాలూకా, పొతకమూరు ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం, నాగంభొట్లపాలెం గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈ పంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది. ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. నాగార్జున సాగర్ కాలువ. బోరు బావులు, నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగా కూడా చాలా కీలక గ్రామంగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.

విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ పాఠశాలలు[మార్చు]

  • గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

మౌలిక వసతులు[మార్చు]

శుద్ధజల కేంద్రం[మార్చు]

ఈ గ్రామంలో 4 లక్షల రూపాయల వ్యయంతో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2016, నవంబరు-26న ప్రారంభించారు. [2]

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయం[మార్చు]

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం, తూర్పు గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటి గంగ లో ఉంది. ఈ ఆలయ ఆవరణలో ఒక కోనేరు ఉంది. సమీపంలోని కొండ నుండి వచ్చేనీటితో ఈ కోనేరు ఎప్పుడూ నిండుకుండలాగా ఉంటుంది. ఈ కోనేటి నీరు, కర్నూలు జిల్లా మహానందిలోని కోనేటి నీటి లాగా ఉంటుందని ప్రశస్తి. ఈ ఆలయానికి వచ్చే భక్తులు, పిల్లలూ ఈ కోనేరు చెంత కూర్చుని సేదతీరుతారు. ఇక్కడి నీరే తూములద్వారా సమీపంలోని గంగ వాగుకు వెళుతుంది. ఆ నీటితోనే భక్తులు స్నానమాచరించి, పొంగళ్ళు వండి, పూజాదికాలు నిర్వహించెదరు. ఈ వాగు ఆధారంగా పలు సాగునీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటి ఈ కోనేరు వంద సంవత్సరాల తరువాత ఇప్పుడు మొదటిసారిగా ఎండిపోయింది. అందువలన, తూములనుండి నీరు వచ్చే పరిస్థితి లేక, వాగు, దానిపై ఆధారపడిన సాగునీటి పథకాలు, వట్టిపోయినవి. ఏటికేడు ఎండలు పెరగటం, వర్షపాతం తగ్గడం వలన, ఈ పరిస్థితి తలెత్తినదని గ్రామస్థులు వాపోతున్నారు.

ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది.

గ్రామ విశేషాలు[మార్చు]

శ్రీ తెనాలి మురళి, ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు వంశీకృష్ణ , నెల్లూరులోని రవీంద్ర భారతి పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నాడు. ప్రస్తుతం భూమిపై వాతావరణ కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురౌతున్న నేపథ్యంలో కాలుష్యం లేకుండా జీవించేటందుకు, అనువైన భూమికి సంబంధించిన ప్లానెట్ ప్రాజెక్టును, ఈ విద్యార్థి రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా నాసా 1500 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. ఇందులో వంశీకృష్ణ రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి లభించింది. అమెరికాలో నిర్వహించు ఒక ప్రత్యేక కార్యక్రమంలో, వంశీకృష్ణకు, ప్రశంసా పత్రంతోపాటు, బహుమతిని అందజేసెదరు.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]