తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు[మార్చు]

 1. అన్నవరం - శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం - శంఖవరం మండలం లో కలదు. రాజమహేంద్రవరం - విశాఖపట్నం ప్రధాన రహదారి పై కలదు. రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యం కలదు.
 2. అంతర్వేది - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - సఖినేటిపల్లి మండలం లో కలదు. రాజోలు మరియు పాలకొల్లు మీదుగా బస్సు సౌకర్యం కలదు.
 3. అప్పనపల్లి - శ్రీ బాల బాలాజీ దేవస్థానం - మామిడికుదురు మండలం లో కలదు. రాజోలు నుండి బస్సు సౌకర్యం కలదు. అమలాపురం - రాజోలు రహదారి పై పాశర్లపూడి వద్ద దిగి వెళ్ళవచ్చు.
 4. అయినవిల్లి - శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం - అయినవిల్లి మండలం లో కలదు. కొత్తపేట - ముక్తేశ్వరం రోడ్ లో కలదు. రావులపాలెం, ముమ్మిడివరం ల నుండి బస్సు సౌకర్యం కలదు. అమలాపురం - ముక్తేశ్వరం రహదారిలో ముక్తేశ్వరం వద్ద దిగి వెళ్ళవచ్చు.
 5. ఏడిద - ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం రాజమండ్రికి 25 కి.మీ.ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం ఉంది.
 6. బిక్కవోలు - శ్రీ గోలింగేశ్వర ఆలయం, ఏకశిలా గణపతి ఆలయం - బిక్కవోలు మండలం లో కలదు. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై కలదు. రైలు మరియు బస్సు సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం కలదు.
 7. చదలవాడ తిరుపతి - శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం. - పెద్దాపురం మండలం లో కలదు. కాకినాడ నుండి ప్రత్తిపాడు వెళ్ళే దారిలో దివిలి వద్ద దిగి వెళ్ళవచ్చును.
 8. చొల్లంగి - శ్రీ సోమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవస్థానములు - తాళ్ళరేవు మండలం లో కలదు. కాకినాడ నుండి యానాం వెళ్ళే దారిలో కలదు.
 9. ధవళేశ్వరం - శ్రీ జనార్ధన స్వామి దేవస్థానం, (నవ జనార్ధన ఆలయములో ఒకటి), శివాలయం, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం లో కలదు. జిల్లాలో సుమారు అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. సమీపం లో రాజమహేంద్రవరం వరకు రైలు సౌకర్యం కలదు.
 10. ద్రాక్షారామం - పంచారామాలలో ఒకటైన శ్రీ భీమేశ్వరాలయం కలదు. - రామచంద్రపురం మండలం లో కలదు. రామచంద్రపురం - యానాం దారిలో మరియు కాకినాడ - కోటిపల్లి దారిలో కలదు. కాకినాడ, రాజమహేంద్రవరం, యానం, రామచంద్రపురం, కోటిపల్లి ల నుండి బస్సు సౌకర్యం కలదు. కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం కూడా ఉన్నది. కాని ప్రస్తుతం నడువట్లేదు.
 11. ద్వారపూడి - శ్రీ ద్వారపూడి ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయం కలదు. మండపేట మండలం లో కలదు. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై కలదు. రైలు మరియు బస్సు సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం కలదు.
 12. గండి పోచమ్మ తల్లి గుడి - దేవీపట్నం మండలం లో గొందూరు గ్రామము లో గోదావరి తీరమునందు కలదు. రాజమహేంద్రవరం నుండి సీతానగరం మీదుగా మార్గం కలదు. ఆటో సౌకర్యం కలదు.
 13. గొల్లల మామిడాడ - శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం, మరియు కోదండ రామాలయం కలవు. పెదపూడి మండలం లో కలదు. రామచంద్రపురం - బిక్కవోలు మార్గం లో కలదు. రామచంద్రపురం, బిక్కవోలు నుండి బస్సు సౌకర్యం, కాకినాడ నుండి ఆటో సౌకర్యం కలదు.
 14. కడలి - కపోతేశ్వర స్వామి దేవస్థానం - రాజోలు మండలం లో కలదు. తాటిపాక, రాజోలు నుండి మార్గం ఉన్నది.
 15. కాండ్రకోట - నూకాలమ్మ తల్లి ఆలయం. పెద్దాపురం మండలం లో కలదు. పెద్దాపురం నుండి మార్గము కలదు.
 16. కొత్తలంక - శ్రీ వలీబాబా దర్గా - ముమ్మిడివరం మండలం లో కలదు. అమలాపురం సమీపం లో ముమ్మిడివరం నుండి మార్గం కలదు.
 17. కోరుకొండ - శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. కోరుకొండ మండలం లో కలదు. రాజమహేంద్రవరం - గోకవరం ప్రధాన రహదారి పై కోరుకొండ కలదు. బస్సు సౌకర్యం కలదు.
 18. కోటిపల్లి - శ్రీ రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు - పామర్రు మండలం లో కలదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం కలదు. యానాం - జొన్నాడ ల నుండి రోడ్డు మార్గం కలదు, ముక్తేశ్వరం నుండి రేవు దాటి రావచ్చు.
 19. మందపల్లి - శ్రీ మందేశ్వర (శనీశ్వర) స్వామి దేవాలయం - కొత్తపేట మండలం - రావులపాలెం - కొత్తపేట మార్గం లో కలదు.
 20. మట్లపాలెం - శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం - తాళ్ళరేవు మండలం, కాకినాడ - యానాం మార్గం కాకినాడ కు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం కలదు.
 21. ముక్తేశ్వరం - శ్రీ క్షణ ముక్తేశ్వర ఆలయం - అయినవిల్లి మండలం. అమలాపురం, రావులపాలెం మరియు ముమ్మిడివరం నుండి బస్సు సౌకర్యం కలదు, కోటిపల్లి నుండి రేవు దాటి రావచ్చును.
 22. ముమ్మిడివరం - శ్రీ బాలయోగీశ్వర స్వామి ఆలయం - ముమ్మిడివరం మండలం - అమలాపురం సమీపం లో ముమ్మిడివరం నుండి మార్గం కలదు.
 23. మురమళ్ళ - శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర ఆలయం - ఐ పోలవరం మండలం - అమలాపురం, రాజమహేంద్రవరం మరియు కాకినాడ నుండి బస్సు సౌకర్యం కలదు.
 24. పిఠాపురం - పాదగయ క్షేత్రం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఆలయం - పిఠాపురం మండలం - కాకినాడ - కత్తిపూడి ప్రధాన రహదారి పై కలదు, రైలు మరియు బస్సు సౌకర్యం కలదు.
 25. పెద్దాపురం - మరిడమ్మ తల్లి ఆలయం, పాండవుల మెట్ట - పెద్దాపురం మండలం, బస్సు సౌకర్యం కలదు, సమీపం లో సామర్లకోట నుండి రైల్ సౌకర్యం కలదు.
 26. రంప - పురాతన శివాలయం కలదు. రంపచోడవరం మండలం, రంపచోడవరం వద్ద బస్సు దిగి సుమారు 5 కిలోమీటర్లు వెళ్ళవలెను.
 27. రాజమహేంద్రవరం - శ్రీ వేణుగోపాలస్వామి, ఉమా మార్కండేయ స్వామి దేవాలయములు, ఇస్కాన్ దేవాలయం, కోటిలింగాల రేవు ప్రధాన ఆలయములు, అన్ని ప్రాంతముల నుండి రైల్, బస్సు మరియు విమాన సౌకర్యం కలదు.
 28. ర్యాలి - జగన్మోహినీ కేశవ స్వామి దేవాలయం - ఆత్రేయపురం మండలం లో కలదు. రావులపాలెం వరకు బస్సు లో వెళ్లి అక్కడినుండి ఆటో లలో వెళ్ళవచ్చు.
 29. సామర్లకోట - పంచారామాలలో ఒకటైన కుమారా భీమారామము - బస్సు మరియు రైలు సౌకర్యం కలదు.
 30. తలుపులమ్మ లోవ - తలుపులమ్మ తల్లి దేవాలయం - తుని మండలం, తుని వరకు బస్సు మరియు రైలు సౌకర్యం కలదు. అచ్చటినుండి సుమారు 10 కిలోమీటర్లు వెళ్ళవలెను.
 31. తంటికొండ - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - గోకవరం మండలం - గోకవరం వరకు బస్సు సౌకర్యం కలదు. అచ్చటి నుండి సుమారు 8 కిలోమీటర్లు వెళ్ళవలెను.
 32. వాడపల్లి - శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము - ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామం వద్ద బస్సు దిగి వెళ్ళవలెను, రావులపాలెం మరియు లొల్ల నుండి ఆటో సౌకర్యం కలదు.[1]

మూలాలు[మార్చు]

 1. "తీర్థయాత్ర పర్యాటక రంగం | Welcome to East Godavari District Web Portal | India". Retrieved 2020-02-18.