Jump to content

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కొత్తగూడెం

వికీపీడియా నుండి
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల , కొత్తగూడెం
TGTWRDC (W) Kothagudem
రకంప్రభుత్వ కళాశాల
స్థాపితం2016 (2016)
మాతృ సంస్థ
తెలంగాణ రాష్ట్ర గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల సమాజం (TGTWREIS)
అనుబంధ సంస్థKakatiya University
ప్రధానాధ్యాపకుడుLt. P. Anuradha
విద్యాసంబంధ సిబ్బంది
35
నిర్వహణా సిబ్బంది
15
విద్యార్థులు568
స్థానంకొత్తగూడెం, తెలంగాణ, భారతదేశం
కాంపస్నెహ్రు నగర్ - పాల్వంచ
భాషతెలుగు, ఆంగ్లం
జాలగూడుhttps://tgswreis.telangana.gov.in/degreecolleges.php

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (మహిళలు), కొత్తగూడెం (TGTWRDC (W) Kothagudem) అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఈ సంస్థ 2017 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది పూర్తిగా మహిళా విద్యార్థినుల కోసం నిర్వహించబడుతుంది. [1] ఇది కాకతీయ విశ్వవిద్యాలయం కు అనుబంధం గా ఉన్నది.

ఈ కళాశాల బ్యాచులర్ (UG) స్థాయిలో మొత్తం 7 కోర్సులను అందిస్తోంది. సైన్స్, కామర్స్ విభాగాల్లో కోర్సులు ఉండగా, BA కోర్సులు కూడా ఉన్నాయి. [2]

వృక్ష , జీవ ,  జంతు ,  రసాయన ,  భౌతిక , వాణిజ్యం ,  ఆర్ధిక ,  జర్నలిజం ఇంకా కంప్యూటర్ విభాగాలలో విద్యను అందిస్తోంది.[3]

అందుబాటులో ఉన్న కోర్సుల సీట్ల సంఖ్య 214. ఆధునిక వసతి గృహంతో కూడిన ఈ క్యాంపస్ మౌలిక సదుపాయాలతో పాటు ఈ సంస్థ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని విద్యాబోధనతో పాటు NCC , NSS కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తుంది. ఇవి 2019 నుంచి నిర్వహిస్తున్నారు.

Telangana Tribal Welfare Residential Degree College (Girls), Kothagudem.

క్రీడారంగంలో ఇక్కడి విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొనటం , ఉన్నత చదువులకి NIT , IIT కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో ఎంపిక అవ్వటం ఈ కళాశాల చరిత్రకు మరింత పేరు తెచ్చి పెట్టాయి .

అందుకే ఈ కళాశాల NAAC నుండి "B+" గ్రేడ్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. [4]

డిగ్రీ ప్రవేశాల ఆహ్వానం

[మార్చు]

కళాశాలలో క్రింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి:

  1. B.A (CBCS)
  2. B.Com (Gen)
  3. B.Com (Computer Applications)
  4. B.Sc (Life Science) (CBCS)
  5. B.Sc (Physical Science) (CBCS)

ఉచిత సదుపాయాలు

[మార్చు]
  • ఉచిత వసతి (హాస్టల్) మరియు ఉచిత భోజన సదుపాయం
  • ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, క్యాలిక్యులేటర్
  • ఉచితంగా కాస్మెటిక్ చార్జీలు
  • ఉచితంగా యూనిఫాం, ట్రాలీ బ్యాగ్, ప్లేట్, గ్లాసు
  • పరీక్ష ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

విద్యా మరియు శిక్షణా వసతులు

[మార్చు]
  • C-SET, NET, Ph.D అర్హతలు గల అధ్యాపకులచే విద్యాబోధన
  • డిజిటల్ క్లాస్ రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్
  • అన్ని సైన్స్ ల్యాబ్ల సదుపాయం
  • డిజిటల్ లైబ్రరీ సదుపాయం

ప్రత్యేక శిక్షణలు

[మార్చు]
  • LB స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీల ప్రవేశాల కోసం ప్రత్యేక శిక్షణ
  • ప్రభుత్వ ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి కోసం శిక్షణ
  • ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేందుకు E-Plus Club
  • Nss కార్యక్రమంలో లో భాగంగా ప్రతి ఏటా సమ్మర్ , వింటర్ క్యాంపులను వారం నుండి 10 రోజుల పాటు నిర్వహిస్తారు .

సహపాఠ్య కార్యక్రమాలు

[మార్చు]

NCC , NSS లో చేరేందుకు ప్రత్యేక అవకాశం

కళాశాల విద్యార్థులకు , జిల్లా , యూనివర్సిటీ , రాష్ట్ర స్థాయిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ,

ఆటలు , లలిత , సాంస్కృతిక - బహుమతులు

కోయ - లంబాడి నృత్య ప్రదర్శన ఈ విద్యార్థుల ప్రత్యేకత.

మూలాలు

[మార్చు]
  1. https://ttwrdcs.ac.in/Kothagudem/notifications.php. {{cite news}}: Missing or empty |title= (help)[permanent dead link]
  2. "TSWRDCW , Kothagudem, TELANGANA | List of Colleges". AGNIRVA (in ఇంగ్లీష్). Retrieved 2025-12-16.
  3. "Telangana Government Tribal Welfare Residential Educational Institutions Society (TGTWREIS)". www.tgtwreis.tsmessguru.com. Retrieved 2025-12-16.
  4. https://ttwrdcs.ac.in/Kothagudem/about.php?page=Academics-ProgramOutcomes-B.ScPhysicalScience. {{cite news}}: Missing or empty |title= (help)[permanent dead link]