తెలంగాణ జాతరలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రం లోని జాతరలన్ని జానపదుల జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడుతాయి. తెలంగాణలోని పల్లెపల్లెలో జాతరలు జరుగుతుంటాయ. వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి.[1]

ప్రముఖ జాతరలు[మార్చు]

 1. సమ్మక్క సారలమ్మజాతర:- ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారంలో జరిగే జాతర.
 2. నాగోబా జాతర:- ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవల్లి మండలం, కేస్లాపూర్ గ్రామంలోని గోండు గిరిజన తెగవారు జరుపుకునే జాతర.
 3. గొల్లగట్టు జాతర:- సూర్యాపేట జిల్లా, దురజ్‌పల్లి గ్రామంలో పాలశెర్లయ్య గట్టు మీద జరిగే జాతర.
 4. కొండగట్టు జాతర:- జగిత్యాల జిల్లా, మాల్యాల మండలం, ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న అంజనేయస్వామి దేవాలయంలో జరిగే జాతర.
 5. కొమురవెల్లి మల్లన్న జాతర:- సిద్ధిపేట జిల్లా, కొమురవెల్లి గ్రామంలో శివరాత్రి రోజున మల్లికార్జునస్వామికి జరిగే జాతర.
 6. ఏడుపాయల జాతర:- మెదక్ జిల్లా, నాగసాన్‌పల్లి గ్రామంలోని మంజీరానది దగ్గర శివరాత్రి రోజున జరిగే జాతర.
 7. గంగమ్మ జాతర:- సూర్యాపేట జిల్లా, నూతనకల్లు మండలం, చిక్కమల్ల గ్రామంలో ఉగాది రోజున జరిగే జాతర.
 8. మల్లూర్ జాతర:- ములుగు జిల్లా, మంగపేట మండలం, మల్లూర్ లో జరిగే జాతర.
 9. వేలాల జాతర:- మంచిర్యాల జిల్లా, చెన్నూర్‌ మండలం, వెలాల్ గ్రామంలో శివరాత్రి రోజున జరిగే జాతర.
 10. అయినవోలు జాతర:- వరంగల్ (పట్టణ) జిల్లా, ఐనవోలులో జరిగే జాతర.
 11. కొరివి జాతర:- మహబూబాబాదు జిల్లా, కొరివి శ్రీ వీరభద్రస్వామికి జరిగే జాతర.
 12. నల్లగొండ జాతర:- జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామంలో నరసింహస్వామికి జరిగే జాతర.
 13. తుల్జాభవాని జాతర:- నల్లగొండ జిల్లా, చందంపేట మండలం పెద్దమునిగల్ గ్రామంలో జరిగే జాతర.
 14. గద్వాల్ జాతర:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోటలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామికి జరిగే జాతర.
 15. మల్దకల్ జాతర:- జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ లో తిమ్మప్ప శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
 16. చేవెళ్ళ జాతర:- రంగారెడ్డి జిల్లా, చేవెళ్ళలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
 17. జోగినాథుని జాతర:- మెదక్ జిల్లా, జోగిపేటలోని కొండపై జోడులింగాలుగా వెలసిన జోగినాథునికి జరిగే జాతర.
 18. కేతకి సంగమేశ్వరస్వామి జాతర:- సంగారెడ్డి జిల్లా, ఝురాసంగం గ్రామంలో శ్రీకేతకి సంగంమేశ్వరస్వామి ఆలయంలో నల్లగొండ నరసింహస్వామికి జరిగే జాతర.
 19. సింగరాయ జాతర:- సిద్ధిపేట జిల్లా, కోహెడ మండలంలోని కూరేళ్ళలో లక్ష్మీనరసింహస్వామికి జరిగే జాతర.
 20. తేగడ జాతర:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తేగడ గ్రామంలో భద్రకాళి, వీరభద్రుల కళ్యాణోత్సవంలో జరిగే జాతర.
 21. బుర్నూరు జాతర:- ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు తాలూకాలోని బుర్నూరు ప్రాంతంలో జరిగే జాతర.
 22. మన్యంకొండ జాతర:- మహబూబ్ నగర్ జిల్లా, మన్యంకొండలోని శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
 23. గంగాపురం జాతర:- మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల సమీపంలోని గంగాపురంలోని చెన్నకేశవాలయంలో జరిగే జాతర.
 24. కురుమూర్తి జాతర:- మహబూబ్ నగర్ జిల్లా, కురుమూర్తి గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామికి జరిగే జాతర.
 25. సిరసనగండ్ల జాతర:- నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని చారకొండ వద్ద సిరసనగండ్లలో జరిగే జాతర.
 26. సలేశ్వరం జాతర:- నాగర్ కర్నూల్ జిల్లా, లింగాల మండలం అప్పాయిపల్లిలోని సలేశ్వరస్వామికి జరిగే జాతర.
 27. కోటంచ జాతర:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలంలోని కొడవతంచ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామికి జరిగే జాతర.
 28. కూడెల్లి జాతర:- సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం, కూడవెల్లి గ్రామంలో రామలింగేశ్వరస్వామికి జరిగే జాతర.
 29. పుల్లూరు జాతర:- సిద్దిపేట జిల్లా, పుల్లూరు గ్రామంలో త్రికూటేశ్వరస్వామికి జరిగే జాతర.
 30. దుద్దెడ జాత:- సిద్దిపేట జిల్లా, కొండపాక మండలంలోని దుద్దెడలో శంభుదేవుడికి జరిగే జాతర.
 31. భేతాళ జాతర:- మెదక్ జిల్లా, ఆళ్ళదుర్గ మండలంలో జరిగే భేతాళ జాతర.
 32. చెర్వుగట్టు జాతర:- నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లిమండలంలోని యెల్లారెడ్డిగూడలో శ్రీ జడల రామలింగేశ్వరస్వామికి జరిగే జాతర.
 33. మేళ్లచెరువు జాతర:- సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ తాలూకాలోని మేళ్లచెరువు గ్రామంలో శంభులింగేశ్వరస్వామికి జరిగే జాతర.
 34. అడవి దేవునిపల్లి జాత:- నల్లగొండ జిల్లా, దామరచర్ల మండలంలోని అడవిదేవులపల్లి గ్రామంలో కనకదుర్గమ్మకి జరిగే జాతర.
 35. కార్నేపల్లి జాతర:- భూపాలపల్లి జిల్లా, ములుగు కార్నేపల్లి గ్రామంలోని నంద్రగూడెంలో జరిగే జాతర.
 36. భూపతి జాతర:- భూపాలపల్లి జిల్లా, భూపతిపురంలో కోయల కొండసారలమ్మకు జరిగే జాతర.
 37. మునీశ్వరుల జాతర:- యాదాద్రి - భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో జరిగే జాతర.
 38. శంభులింగేశ్వరస్వామి జాతర:- నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలంలోని చిత్తలూరు గ్రామంలో మూసీ నది ఒడ్డున శంభులింగేశ్వరస్వామికి జరిగే జాతర.
 39. అర్వపల్లి జాతర:- సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి గ్రామంలో లక్ష్మీనరసింహస్వామికి జరిగే జాతర.
 40. భీమయ్యక్ జాతర: దంతన్ పల్లి గ్రామంలో భీమయ్యక్ దేవుడుకి జరిగే జాతర తిర్యాని మండల పరిధిలో కుంరం భీం ఆసిఫా బాద్ జిల్లాలో కలదు.
 41. ఖాందేవ్ జాతర ఆదిలాబాద్ జిల్లా,నార్నూర్ మండల కేంద్రంలో ఖాందేవ్ దేవుడి వద్ద జాతర జరుగుతుంది.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ జాతరలు, తెలంగాణ వైభవం పరిచయదీపిక, తెలంగాణ రాష్ర్ట విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ హైదరాబాదు, డిసెంబర్ 2017, పుట. 162.