తెలంగాణ యాస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు భాషలో ఉన్న పలు యాసలలో తెలంగాణ యాస ఒకటి. తెలంగాణ కు చెందిన జిల్లాలతో ప్రాథమికంగా మాట్లాడబడినను, ఇతర ప్రదేశాలలో కూడా ఈ యాస ఉపయోగంలో ఉన్నది. తెలంగాణ యాస పై ఎక్కువగా హిందీ ప్రభావం ఉన్ననూ, మరల ప్రత్యేకించి హైదరబాదీ హిందీ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. తెలంగాణ యాసకు ఉన్న ఈ ప్రత్యేక శైలివలన ఈ యాస బహు ప్రాచుర్యం పొందినది. ముఖ్యంగా తెలుగు సినిమాలో ఈ యాసకు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కోట శ్రీనివాసరావు ఈ యాసకు పెట్టింది పేరు. అడపాదడపా బాబు మోహన్, విజయశాంతి వంటి నటులు కూడా ఈ యాసను ప్రయోగించి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు. కొండొకచో అగ్ర హీరోలు ఇతర కమెడియన్లు కూడా ఈ యాసలో మాట్లాడి ప్రేక్షకుల చేత థియేటర్ లలో ఈలలు వేయించుకొన్నారు.

యాస[మార్చు]

  • భీ - కూడా
  • గది - అది
  • గిది - ఇది
  • గట్ల - అలా (అట్లా)
  • గిట్ల - ఇలా (ఇట్లా)
  • ఇగో, ఇంగో - ఇదుగో
  • అగో - అదుగో
  • పరేషానీ - తత్తరపడటం, ఇబ్బంది పడటం, బెంబేలు పడటం
  • నెత్తినొప్పి - తలనెప్పి
  • దిమాక్ ఖరాబ్ - పిచ్చి పట్టటం
  • దేడ్ - ఒకటిన్నర్ర
  • దేడ్ దిమాక్ - అర్థం చేసుకోలేని వాడు
  • చారనా - పావలా (నాలుగు అనాలు)
  • ఆఠనా - అర్ధ రూపాయి (ఎనిమిది అనాలు)
  • బారనా - ముప్పావలా (పన్నెండు అనాలు)
  • ఉల్టా, ఉల్టాపల్టా - తల్లక్రిందులు
  • ఏడ - ఎక్కడ
  • ఆగమాగం - తొందర పడటం
  • అంత/ఇంత/ఎంత గనం - అంత/ఇంత/ఎంత ఎక్కువగా (గనం - బహుశా ఘనం అయ్యి ఉండవచ్చు)
  • కోపం చెయ్యి - కోప్పడు
  • బుక్కటం - మెక్కటం
  • పైసల్ - డబ్బులు (హిందీ పైసే)
  • ఉరుకు - పరిగెత్తు
  • సమఝ్ అయితున్నదా? - అర్థం అవుతోందా?
  • పొద్దుగాల - ప్రొద్దుట
  • పొద్దుమీకి - సాయంత్రం
  • జల్దీ - త్వరగా
  • భై, బే - సోదరుడు, అన్న, తమ్ముడు (భాయి)
  • సాలెగాడు - బావమరిది
  • పోరి - అమ్మాయి
  • పోరడు/పోరగాడు - అబ్బాయి
  • హుషార్ - తెలివిగల (హింది: హోషియార్)
  • ఖతర్నాక్ - ప్రమాదకరం
  • ఏక్ దం - ఒక్క ఉదుటున (హిందీ లో దం అంటే శ్వాస్త, ఒకే శ్వాసలో అని అర్థం)
  • దం - ఆయాసం
  • చక్కర్ రావటం - కళ్ళు తిరగటం (హిందీ లో కూడా చక్కర్ అంటే కళ్ళు తిరగటం)
  • గోకరకాయ - గోరుచిక్కుడు

కొన్ని సినిమా సంభాషణలు[మార్చు]

జయమ్ము నిశ్చయమ్మురా[మార్చు]

  • కోట: ఏం రోవ్ రామ్మూర్తి గట్ల గుడ్లగూబ లెక్క జూస్తున్నావ్. నీ లెక్క ఫాల్తు సైన్మల్ దీస్తననుకున్నావ్ రా? సూప్పర్ ఇస్టార్ కృష్ణను వెట్టి జబ్బర్దస్త్ సైన్మ దీస్త బిడ్డా...ఆ!!!

సై[మార్చు]

  • నల్లబాలు (వేణుమాధవ్): అబె వో ఏం రా ఉర్కుతుర్రు. మా కి కిర్ కిరి పెద్ద పెద్ద అక్షరాలతో రాయుర్రి బే, దేత్తడి పోచమ్మ గుడి. నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క.

కిక్[మార్చు]

దూకుడు[మార్చు]

  • మహేష్ బాబు: కళ్ళున్నోడు ముందు మాత్రమే జూస్తడు. దిమాక్ ఉన్నోడు దునియ మొత్తం జూస్తడు.
  • మహేష్ బాబు: డిపార్ట్ మెంట్ మే అపన్ కో క్యా బోల్తే మాలూం? బబ్బర్ షేర్!! (డిపార్ట్ మెంట్ లో నన్ను ఏమంటారో తెలుసా? బెబ్బులి పులి!!!)

తెలుగు సినిమా లో తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పిన పాత్రలు[మార్చు]

మూలాలు[మార్చు]