తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం
"ప్రజాస్వామ్యం ప్రజల శక్తికి కోటలాంటిది "
సంస్థ వివరాలు
స్థాపన 2 June 2014
అధికార పరిధి తెలంగాణ
ప్రధానకార్యాలయం హైదరాబాదు
కార్యనిర్వాహకులు V. Nagireddy,IAS Rtd[1]
వెబ్‌సైటు
http://tsec.gov.in

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణకు చెందిన స్వయం ప్రతిపత్తి అధికారాలుగల ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థ. ఇది 1992 భారత రాజ్యాంగం 73, 74 సవరణ చట్టాల నిబంధనలు ప్రకారం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థ ఎన్నికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది. [2] [3] [4]

నిర్మాణం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంఘానికి నాయకత్వం వహిస్తాడు. రాష్ట్ర ఎన్నికల కమిషనరును, నియమించిన తేదీ నుండి ఐదుసంవత్సరాలుపాటు పదవిలో ఉంటాడు. ఎన్నికల కమిషనర్లను సాధారణంగా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో నియమిస్తారు.

విధులు[మార్చు]

73వ, 74వ రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా మంజూరు చేయబడిన అధికారాలననుసరించి రాష్ట్రంలోని స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, నిర్వహణకు సంబంధించిన పనులను ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. తెలంగాణ గ్రామీణ పట్టణ సంస్థలకు ఎన్నికలు ప్రత్యక్ష, పరోక్ష ఎన్నికలలో జరుగుతాయి.పూర్తి ఏకైక నియంత్రణ అధికారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంది. తెలంగాణ శాసనసభ నియోజకవర్గం ఓటరు జాబితా ప్రకారం, ఓటర్లు నమోదైన ఓటర్లు ఆధారంగా పోలింగ్ కేంద్రంలను గుర్తిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత, అసెంబ్లీ ఎన్నికలలో పాటించిన నిబంధనలు వర్తిస్తాయి.

ప్రత్యక్ష ఎన్నికలు[మార్చు]

ఈ కిందిపదవులకు ఎన్నికలు ఎన్నికల సంంఘం ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి .

  • గ్రామీణ సంస్థలు :
  1. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జెడ్‌పిటిసి) సభ్యులు
  2. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపిటిసి) సభ్యులు
  3. గ్రామ పంచాయతీ సర్పంచ్
  4. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు
  • పట్టణ సంస్థలు :

పట్టణ సంస్థలలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీలు ఉన్నాయి .

  1. మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు
  2. మునిసిపాలిటీ / నగర పంచాయతీ కౌన్సిలర్లు

పరోక్ష ఎన్నికలు[మార్చు]

స్థానిక సంస్థలలో ఈ కింది పదవులకు ఎన్నికైన అభ్యర్థులు బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఎన్నికల సంఘం కేటాయించిన సమయంలో ఈ కింది పదవులకు ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి..

  • గ్రామీణ సంస్థలు :
  1. గ్రామ పంచాయతీకి చెందిన ఉప-సర్పంచ్.
  • పట్టణ సంస్థలు :
  1. నగరపాలక సంస్థ మేయరు, డిప్యూటీ మేయర్లుకు
  2. జిల్లా పరిషత్‌లో చైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌లుకు.
  3. పురపాలక సంఘం చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లుకు.

కమీషనర్లు[మార్చు]

  1. వి.నాగిరెడ్డి - ఏప్రిల్ 2015 నుండి ఏప్రిల్ 2020 [5][6]
  2. సి.పార్థసారథి - 9 సెప్టెంబర్ 2020 నుండి ప్రస్తుతం [7][8]

ఎన్నికల విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం[మార్చు]

జనవరి 2022లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల విధుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో ఎన్నికల విధుల్లో ఉండి తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల దుష్టచర్యల వల్ల మరణించిన వారి కుటుంబాలకు 30 లక్షల రూపాయలు పరిహారం అందుతుంది. ఒకవేళ శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే వారికి ఇచ్చే మొత్తాన్ని రూ.7.50 లక్షలకు పెంచారు.[9]

ఇవికూడా చూడండి[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

  1. |chief1_position = రాష్ట్ర ఎన్నిల అధికారి |chief2_name = M. Ashok Kumar
  2. "Telangana State Election Commission Rules". Archived from the original on 2021-01-20. Retrieved 2020-12-08.
  3. Telangana to Support Linking Aadhar Card with Voters Card
  4. EC Makes Aadhaar EPIC Linkage Easy
  5. Sakshi (25 October 2014). "తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి!". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  6. Sakshi (6 November 2014). "నాగిరెడ్డి మనోడే". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  7. Sakshi (10 September 2020). "ఈసీ‌గా బాధ్యతలు చేపట్టిన పార్థసారథి". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  8. Sakshi (9 September 2020). "రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పార్థసారథి". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  9. "Ts News ఎన్నికల విధుల్లో మరణించే వారి కుటుంబాలకు పరిహారం పెంపు". EENADU. Retrieved 2022-01-10.

బాహ్య లింకులు[మార్చు]