తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ 2018లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగం పరిధిలో ఎస్సీ, ఎస్టీ కులాలకు నిర్దేశించిన రక్షణ చర్యలను పర్యవేక్షిస్తుంది.[1]

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఒక ఛైర్మన్, 5 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఒక మహిళా సభ్యురాలు ఉంటారు. సభ్యులందరూ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం కృషి చేసేవారై ఉండాలి. సభ్యులు, ఛైర్మన్ పదవీకాలం 3 సంవత్సరాలు.

అధికారాలు - విధులు

[మార్చు]
 1. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పించిన సదుపాయాలు, అమలు జరుగుతున్న తీరును విచారించి, నివేదికను గవర్నర్ కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు.
 2. ఎస్సీ, ఎస్టీ కమిషన్కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
 3. కమిషన్ సమక్షంలో ఉండే ఏదైనా ప్రొసీడింగ్ను ఐపీసీ ప్రకారం జ్యుడీషియల్ ప్రొసీడింగ్ భావించాలి.
 4. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

కమిషన్ సభ్యులు

[మార్చు]

మొదటి కమిషన్

[మార్చు]
 • చైర్మన్: ఎర్రోళ్ల శ్రీనివాస్ (ఎస్సీ మాల, మెదక్‌)
 • సభ్యులు: బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా), ఎం. రాంబాల్ నాయక్ (ఎస్టీ లంబాడా, రంగారెడ్డి జిల్లా), కుర్సం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్‌ జిల్లా), సుంకపాక దేవయ్య (హైదరాబాద్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా)[2]

రెండవ కమిషన్

[మార్చు]
 • చైర్మన్: బక్కి వెంకటయ్య (ఎస్సీ మాల, మెదక్‌)
 • సభ్యులు: కుస్రం నీలాదేవి (ఎస్టీ గోండు, ఆదిలాబాద్‌), రాంబాబు నాయక్‌ (ఎస్టీ లంబాడా, దేవరకొండ), కొంకటి లక్ష్మీనారాయణ (ఎస్సీ మాదిగ, కరీంనగర్‌), జిల్లా శంకర్‌ (ఎస్సీ మాదిగ, నల్లగొండ), రేణికుంట ప్రవీణ్‌ (ఎస్సీ మాదిగ, ఆదిలాబాద్‌)[3]

మూలాలు

[మార్చు]
 1. Namasthe Telangana (22 September 2023). "ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా వెంకటయ్య". Archived from the original on 22 September 2023. Retrieved 22 September 2023.
 2. Sakshi (2 January 2018). "తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.
 3. Eenadu (21 September 2023). "తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నూతన ఛైర్మన్‌గా బక్కి వెంకటయ్య". Archived from the original on 23 September 2023. Retrieved 23 September 2023.