తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్
TSPSC Logo.jpg
టీఎస్‌పీఎస్‌సి లోగో
సంకేతాక్షరంటీఎస్‌పీఎస్‌సి
స్థాపన2014 ఆగస్టు 18 (2014-08-18) (6 సంవత్సరాల క్రితం)
రకంరాజ్యాంగ సంస్థ
కేంద్రీకరణనియామకాలు
కార్యస్థానం
  • ప్రతిభా భవన్, ఎం.జె. రోడ్డు, నాంపల్లి, హైదరాబాదు, 500001, తెలంగాణ
సేవా ప్రాంతాలుతెలంగాణ
జాలగూడుwww.tspsc.gov.in

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్‌సి), భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన ఒక రాజ్యాంగ సంస్థ. ఇది 2014 ఆగస్టు 18న ఏర్పాటైంది. భారత రాష్ట్రమైన తెలంగాణలో సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు[1] దరఖాస్తుదారుల యోగ్యత, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ రాజ్యాంగ సంస్థ, ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపికచేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తోంది. నియామకానికి తగిన నియమాలను రూపొందించడం, పదోన్నతులపై సలహా ఇవ్వడం, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు మొదలైనవి ఈ సంస్థ కార్యకలాపాలు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అమల్లోకొచ్చింది. 2015, ఏప్రిల్ 11న అప్పటి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కమీషన్ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.[2] డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఘంటా చక్రపాణి టిఎస్‌పిఎస్‌సికి మొదటి ఛైర్మన్‌గా నియమించబడ్డాడు. ఘంటా చక్రపాణిని చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్ నరసింహన్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశాడు. చక్రపాణి డిసెంబర్ 18న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

చరిత్ర[మార్చు]

చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1947లో పబ్లిక్ కమిషన్ ను స్థాపించాడు. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బుర్గుల రామకృష్ణరావు కాలంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ముందంజలో నిలిచింది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో విలీనం చేశారు. అంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విభజించబడే వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉనికిలోనే ఉంది.[3]

సంస్థ[మార్చు]

భారత రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ గవర్నర్ చేత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు నియమించబడుతారు.

మొదటి కమిషన్[మార్చు]

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మొదటి చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ నరసింహన్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశాడు. చక్రపాణి డిసెంబర్ 18న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[4][5] ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా సీ.విఠల్, మతీనుద్దీన్ ఖాద్రీ, డాక్టర్ బానోతు చంద్రావతిబాధ్యతలు చేపట్టారు. వాళ్ళు ఈ పదవుల్లో 2020 డిసెంబరు 17 వరకు కొనసాగారు.[6]

చైర్మన్
సభ్యులు
  1. చింతలగట్టు విఠల్ (సీ.విఠల్) - 18.12.2014 నుండి 17.12.2020 వరకు సభ్యుడిగా పని చేశాడు.
  2. డా.బానోతు చంద్రావతి - 18.12.2014 నుండి 17.12.2020వరకు సభ్యురాలిగా పని చేసింది.
  3. డా.మొహమ్మద్ మతీనుద్దీన్ ఖాద్రి - 18.12.2014 నుండి 17.12.2020 వరకు సభ్యుడిగా పని చేశాడు.
  4. డి.కృష్ణారెడ్డి - 14.10.2015 నుండి 18.03.2021 వరకు సభ్యుడిగా పని చేశాడు.
  5. డా.కె.రామమోహన్ రెడ్డి - 14.10.2015 నుండి 12.02.2021వరకు సభ్యుడిగా పని చేశాడు.
  6. సీహెచ్ విద్యాసాగర్ రావు - 14.10.2015 నుండి 25.05.2018 వరకు సభ్యుడిగా పని చేశాడు.
  7. ప్రొ.చింతా సాయిలు
  8. బి.మన్మధ రెడ్డి - 04.01.2016న సభ్యుడిగా భాద్యతలు చేపట్టాడు.

కొత్త సిలబస్ కోసం నిపుణుల కమిటీ[మార్చు]

టీఎస్పీఎస్సీ తెలంగాణ పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉద్యోగులను నియమించుకోవడానికి కొత్త సిలబస్‌ను రూపొందించింది. ఇందుకోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రొ.హరగోపాల్, వీ.ఎస్ ప్రసాద్, కోదండరామ్, కె.నాగేశ్వర్, చుక్కా రామయ్య వంటి విద్యా నిపుణులు, మేధావులతో సహా దాదాపు 30 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ పరీక్షలకు కావాల్సిన సిలబస్, విధివిధానాలను రూపొందించగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

రెండవ కమిషన్[మార్చు]

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ రెండవ కార్యవర్గం 2021, మే 19న నియమించబడింది. చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులను బుధవారం సీఎం కేసీఆర్ నియమించగా, ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే ఆమోదించింది.[8][9][10] వారు 2021, మే 21న బాధ్యతలు చేపట్టారు.[11][12][13]

చైర్మన్
సభ్యులు
  1. కారం రవీందర్‌రెడ్డి టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు
  2. ఆర్‌.సత్యనారాయణ (మాజీ ఎమ్మెల్సీ)
  3. రమావత్‌ ధన్‌ సింగ్‌ (రిటైర్డ్‌ ఈ ఎన్సీ)
  4. బండి లింగారెడ్డి (సీబీఐటీ ప్రొఫెసర్)
  5. కోట్ల అరుణ కుమారి (ఎస్డీసీ)
  6. సుమిత్రా ఆనంద్‌ తనోబా (తెలుగు భాషాపండిట్‌)
  7. ఎరవెల్లి చంద్రశేఖర్‌రావు (ఆయుర్వేద వైద్యులు)

విధులు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పదవులకు తగిన అభ్యర్థులను ఎన్నుకోవడం కమిషన్ ప్రాధమిక విధులలో ఒకటి. కమిషన్ ముఖ్యమైన చట్టబద్ధమైన విధులు:[14]

  • ప్రత్యక్ష నియామకం
  • రాష్ట్ర, సబార్డినేట్ సేవలకు సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనల ఆమోదం
  • ప్రత్యేక కేసులలో కారుణ్య నియామకాలకు సమ్మతి
  • బదిలీ/ప్రమోషన్ ద్వారా నియామకం
  • క్రమశిక్షణా కేసులు
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించడం
  • అర్థ వార్షిక పరీక్షలు
  • తాత్కాలిక నియామకాలు - కమిషన్ సమ్మతి

అవార్డులు[మార్చు]

  • స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు -2015[15]

మూలాలు[మార్చు]

  1. "Telangana to start hiring, picks panel chief". Deccanchronicle.com. 2014-12-18. Retrieved 19 May 2021.
  2. "TSPSC official Website Launch". Myinfoindia.com. 2015-04-12. Retrieved 19 May 2021.
  3. "Telangana State Public Service Commission". Tspsc.gov.in. Retrieved 19 May 2021.
  4. Sakshi (18 December 2014). "బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి". Sakshi. Archived from the original on 21 మే 2021. Retrieved 21 May 2021.
  5. The Hindu (18 December 2014). "Ghanta Chakrapani is first Chairman of TSPSC". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 20 May 2021.
  6. The Hans India (15 December 2020). "Safety of kids on top of Telangana government's mind". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  7. Sakshi Education (24 March 2018). "టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు". www.sakshieducation.com. Archived from the original on 9 జూన్ 2019. Retrieved 21 May 2021.
  8. The Indian Express, Telangana (19 May 2021). "Dr. B Janardhan Reddy appointed TSPSC Chairman" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  9. నమస్తే తెలంగాణ, తెలంగాణ (19 May 2021). "టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల నియామకం". Namasthe Telangana. Archived from the original on 19 May 2021. Retrieved 19 May 2021.
  10. The Hans India, Ravali (19 May 2021). "B Janardhan Reddy Has Been Appointed As The TSPSC Chairman". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021.
  11. Namasthe Telangana (21 May 2021). "కొలువుదీరిన కొలువుల కమిషన్‌". Namasthe Telangana. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  12. Eenadu (22 May 2021). "TSPSC:టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకారం". EENADU. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  13. The New Indian Express (22 May 2021). "Janardhan Reddy assumes charge as PSC chief; new members take oath". The New Indian Express. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021.
  14. "Telangana State Public Service Commission". Tspsc.gov.in. 2014-08-08. Retrieved 19 May 2021.
  15. "Skoch Order of Merit Award for TSPSC". The Hans India. 8 December 2015. Retrieved 14 September 2019.

బయటి లింకులు[మార్చు]