తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2019-2020)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2019-2020)
Submitted2019, సెప్టెంబరు 9
Submitted byకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
(ముఖ్యమంత్రి, తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2019, సెప్టెంబరు 9
Parliament2వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
Tax cutsNone
‹ 2018
2020 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2019-2020) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2020 సెప్టెంబరులో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2019, సెప్టెంబరు 9న ఉదయం గం. 11.30 ని.లకు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు, శాసనసభలో దాదాపు 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించాడు.[2] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహిస్తూ తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.[3] 54 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.

శాసనసభలో 2019-2020 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం 1,46,492.30 కోట్ల రూపాయలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,055.84 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 17,274.67 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలలో మిగులు 2,044.08 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 24,081.74 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయబడింది.[4][5]

2019 సెప్టెంబరు 8న సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రివర్గం పరిశీలించి ఆమోదించింది.[6]

ఆదాయం[మార్చు]

2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల వివరాలు:[7][8]

  • మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 1,46,492.30 కోట్లు
  • రెవెన్యూ వ్యయం: 1,11,055.84 కోట్లు
  • మూలధన వ్యయం: 17,274.67 కోట్లు
  • ప్రజా రుణం: 32,900 కోట్లు
  • ప్రజా రుణ చెల్లింపు: 9,265.77 కోట్లు
  • రెవెన్యూ రాబడులు: 1,13,099.92 కోట్లు
  • రుణాలు, అడ్వాన్సులు: 8,896.02 కోట్లు
  • ఇతర పన్నేతర ఆదాయం: 23,934 కోట్లు
  • కేంద్ర పన్నుల వాటా: 19,718 కోట్లు
  • రాష్ట్ర పన్నులు, సుంకాలు: 69,328 కోట్లు
  • ఇతర వ్యయం: 11,078 కోట్లు
  • అభివృద్ధి వ్యయం: 78,027 కోట్లు

బడ్జెట్ వివరాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2019-2020)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:

  • నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు
  • వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు
  • ఆసరా పింఛన్లకు రూ. 12,067 కోట్లు
  • రైతుబంధు పథకానికి రూ. 12,000 కోట్లు
  • రైతు రుణమాఫీకి రూ. 6,000 కోట్లు
  • రైతుబీమా పథకానికి రూ. 650 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,536 కోట్లు
  • బియ్యం సబ్సిడీకి రూ. 2,744 కోట్లు
  • మైనార్టీల అభివృద్ధికి రూ. 2,004 కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ. 1,810 కోట్లు
  • కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ లకు రూ. 1,450 కోట్లు
  • ఎస్సీ, ఎస్టీల ప్రగతినిధులకు రూ. 26,408 కోట్లు
  • పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 19,159 కోట్లు
  • అటవీశాఖకు రూ. 342.47 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ. 4,006.92 కోట్లు

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

2013-14లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధిరేటు 4.2 శాతం కాగా 2018-19లో 10.6 శాతానికి చేరింది. 2017-18లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,1,102 కాగా, 2018-19లో రూ. 2,06,107కు చేరుకొని, 13. శాతం పెరుగుదలతో జాతీయ తలసరి ఆదాయం కంటే 0.6 శాతం ఎక్కువగా ఉంది. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 419 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. పారిశ్రామిక రంగంలో 5.4 శాతం అదనపు వృద్ధి సాధించి, 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 5.8 శాతం వృద్ధిని చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవారంగంలో 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 11.5 శాతం వృద్ధి రేటును సాధించింది.[9]

మూలాలు[మార్చు]

  1. "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
  2. "రైతులకు శుభవార్త.. పంట రుణాల మాఫీకి బడ్జెట్‌లో కేటాయింపు". Samayam Telugu. 2019-09-09. Archived from the original on 2021-05-21. Retrieved 2022-06-02.
  3. V, Ramakrishna (2019-09-09). "CM presents Budget 2019-20 - Sri K. Chandrashekar Rao". www.cm.telangana.gov.in/. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
  4. "Telangana State Portal CM presents Budget 2019-20". www.telangana.gov.in. 2019-09-10. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
  5. "ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం (ఎడిటోరియల్)". Vaartha. 2019-09-10. Archived from the original on 2022-03-08. Retrieved 2022-06-02.
  6. "తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం". Zee News Telugu. 2019-09-08. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
  7. India, The Hans (2019-09-09). "KCR tears into Centre for 'divisive politics'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
  8. "'Severe financial crisis': Telangana CM Chandrasekhar Rao". The New Indian Express. 2019-09-10. Archived from the original on 2020-08-11. Retrieved 2022-06-02.
  9. telugu, NT News (2022-03-26). "తెలంగాణ బడ్జెట్ 2019-20 ప్రాధాన్యతాంశాలు ఇవే..!". Namasthe Telangana. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.

బయటి లింకులు[మార్చు]