తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
Telangana State Road Transport Corporation
స్థానిక పేరు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
పరిశ్రమబస్ సర్వీసు
స్థాపించబడింది2015; 6 సంవత్సరాల క్రితం (2015)
ప్రధాన కార్యాలయం,
పనిచేసే ప్రాంతాలు
తెలంగాణ, పొరుగు రాష్ట్రాలు
సేవలుప్రజా రవాణా
ఉద్యోగుల సంఖ్య
57,018 (2019) [1]
మాతృసంస్థరోడ్డు రవాణా మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం
జాలస్థలిwww.tsrtc.telangana.gov.in

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుండి వేరుపడి యేర్పడింది.[2] తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు, వాటిలో 94 డిపోలు ఉన్నాయి.[3]

వివరాలు[మార్చు]

1932లో నిజాం రాష్ట్ర రైల్వేలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) గా ఉండేది. ఈ సంస్థను నవంబర్ 1, 1951 హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసారు. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ. మొదటగా 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.[4]

సర్వీసులు[మార్చు]

టి.ఎస్.ఆర్.టి.సి లో హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాదు, కరీంనగర్ అనే మూడు జోన్లు ఉన్నాయి. ఈ సంస్థలో 11 రీజన్లలో 95 డిపోలు, వాటికి చెందిన 357 బస్ స్టేషన్లు ఉన్నాయి.[5] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టింపులకు పోకుండా కార్మికులు చేస్తున్న సమ్మెను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి ప్రజారవాణా వ్యవస్థను కాపాడాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా పక్షాన మేం కోరుతున్నాం ఎర్రబోయిన స్వామి కొమురవెల్లి మండలం పోసాని పల్లి గ్రామం సిద్దిపేట జిల్లా

సర్వీసు రకములు[మార్చు]

మెట్రో ఎక్స్‌ప్రెస్ అశోక్ లైలాండ్ సెమి లో ప్లోర్ బస్
గరుడ ప్లస్ వాల్వో B9R

ఈ సంస్థలో వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, రాజధాని [6], ఇంద్ర, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, హైదరాబాదు సిటీ బస్సులు మొదలైన సర్వీసులు ఉన్నాయి. టి.ఎస్.ఆర్.టి.సి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపే బస్ సర్వీసు "పుష్పక్" అనే పేరుతో సేవలనందుస్తుంది.

ప్రస్తుత సర్వీసులు[మార్చు]

ఈ సంస్థ ఆన్ లైన్ రిజర్వేషన్ సిస్టం ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది.

రకం సర్వీసు సంఖ్య
గరుడ ప్లస్ (AC Semi-Sleeper Multi Axle) 32
గరుడ (AC Semi-Sleeper Volvo / Isuzu) 36
ఇంద్ర/రాజధాని (2 + 2 AC Semi-Sleeper) 109
వెన్నెల (AC Sleeper) 4
సూపర్ లగ్జరీ (2 + 2 Non-AC Pushback) 504
డీలక్స్ (2 + 2 Non-AC) 149
ఎక్స్‌ప్రెస్ (3 + 2 Non-AC) 185

NOTE: ALL BUSES ARE RESERVED by tsrtconline.in

సమ్మెలు[మార్చు]

సంస్థ ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2019 అక్టోబరులో కార్మికులు సమ్మె చేసారు.

ఇవి కూడాచూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "TSRTC AT A GLANCE". Archived from the original on 2015-11-25. Retrieved 2016-05-18.
  2. Krishnamoorthy, Suresh (16 May 2014). "It will be TGSRTC from June 2". The Hindu. Hyderabad. Retrieved Jan 28, 2015.
  3. "TSRTC BUSES Complete Information". rtc.telangana.gov.in. Archived from the original on 25 నవంబర్ 2015. Retrieved 24 Nov 2015. Check date values in: |archive-date= (help)
  4. సాక్షి, విద్య (28 November 2015). "రవాణా సౌకర్యాలు". www.sakshieducation.com. Archived from the original on 7 డిసెంబర్ 2019. Retrieved 7 December 2019. Check date values in: |archivedate= (help)
  5. Srinivas, K. "RTC Bifurcation into APSRTC, TSRTC soon". The Hans India. Retrieved 17 March 2015.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-22. Retrieved 2016-05-18.

ఇతర లింకులు[మార్చు]