Jump to content

తెలంగాణ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
తెలంగాణ విశ్వవిద్యాలయం
రకంప్రభుత్వ
స్థాపితం2006
ఛాన్సలర్[Shri Jishnu Dev Varma] (తెలంగాణ గవర్నర్)
వైస్ ఛాన్సలర్Prof. T. Yadagiri Rao
స్థానండిచ్‌పల్లి, నిజామాబాదు జిల్లా, భారతదేశం, తెలంగాణ, భారతదేశం
జాలగూడుఅధికారిక జాలగూడు

తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి వద్ద 2006వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన విశ్వవిద్యాలయం.[1][2][3] 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులతో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 18 కోర్సులు నిర్వహించబడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాల పరిధిలోని ఉన్నత విద్య సంస్థల కార్యకలాపాలు నిర్వహిస్తుంది.[4][5]

ప్రారంభం

[మార్చు]

నిజామాబాదు, ఆదిలాబాదు జిల్లాలలోని గ్రామీణ విద్యార్థులకోసం రాష్ట్ర ప్రభుత్వ 2006 చట్టం 28 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయం స్థాపించి, డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి, నడిపల్లి గ్రామాల్లోని 577 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయానికి అప్పగించింది.

యూనివర్సిటీ గ్రాంటు కమిషన్ (యు.జి.సి) చట్టం లోని సెక్షన్ 2 (బి), 2 (ఎఫ్) కింద ఈ విశ్వవిద్యాలయాన్ని గుర్తించింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల తరువాత ఇది తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద ప్రభుత్వ విశ్వవిద్యాలయం.[6]

క్యాంపస్ వివరాలు

[మార్చు]

2006, సెప్టెంబరులో 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెట్టగా... 2007-2008లో 7 కోర్సులు, 2008 లో 5 కోర్సులు చేర్చబడి మొత్తం కోర్సుల సంఖ్య 18కి చేరాయి. 2008 వరకు నిజామాబాదులోని గిర్రాజ్ ప్రభుత్వ కళాశాల (అటానమస్) లో ఉన్న విశ్వవిద్యాలయం 2009లో డిచ్‌పల్లిలోని సొంత క్యాంపస్‌కు మార్చబడింది.

577 ఎకరాల (2.4 కి.మీ.) విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణం ఉంది. ఈ ప్రాగణంలో ఏడు భవనాలు (పరిపాలనా భవనం, విశ్వవిద్యాలయ కళాశాల, న్యాయ కళాశాల, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్, రెండు వసతి గృహాలు) ఉన్నాయి.

భిక్నూర్ దక్షిణ క్యాంపస్‌

[మార్చు]

భిక్నూర్ ప్రాణంగం సుమారు 50 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ ఉన్న భిక్నూర్ పిజి సెంటర్‌ను 2010లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి అప్పగించబడింది. దాంతో దీనిని తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్-క్యాంపస్ గా మార్చారు.

టీయూ వీసీలు

[మార్చు]
  • టీయూకు తొలి వీసీగా సులేమాన్‌ సిద్ధిఖీ 3 నెలలపాటు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం 4 నెలలు పాటుగా సులోచనారెడ్డి పనిచేసింది.
  • ఆ తర్వాత శాశ్వత వీసీగా కాశీరామ్‌ 2006, నవంబరు 6న బాధ్యతలు స్వీకరించి 2009 నవంబరు 3 వరకు అత్యధిక కాలం పనిచేశాడు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఎన్‌.లింగమూర్తికి ఇన్‌చార్జిగా బాధ్యతలివ్వగా ఏడాది పాటు పనిచేశాడు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తిరుపతి రావు ఇన్‌చార్జిగా 3 నెలలపాటు విధులు నిర్వహించాడు. అనంతరం 6 నెలలు వి.గోపాల్‌రెడ్డి ఇన్‌చార్జిగానే విధులు నిర్వహించాడు.
  • అక్బర్‌ అలీఖాన్‌ను 2011, జూలై 15న ప్రభుత్వం వీసీగా నియమించగా 2014 జూలై 14 వరకు పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించాడు. అనంతరం ఆరు నెలలపాటు ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌ పనిచేసిన తర్వాత రెండేండ్ల పాటు ఐఏఎస్‌ పార్థసారథి సైతం ఇన్‌చార్జి వీసీగా విధులు నిర్వహించాడు.
  • ప్రభుత్వం 2016, జూలై 25న పి.సాంబయ్యను వీసీగా నియమించింది. ఆయన 2019, జూలై 24న ఉద్యోగ విరమణ చేశాడు. అనంతరం ఐఏఎస్‌ అధికారుల వి.అనిల్‌ కుమార్‌ ఆరు నెలలు, నీతూ కుమారి ప్రసాద్‌ ఏడాదిన్నర కాలంపాటు పనిచేసిన తర్వాత 2021, మే 22న రవీందర్‌ గుప్తాను ప్రభుత్వం వీసీగా నియమించింది.[7]
  • ఏసీబీ కేసుల నేపథ్యంలో డి. రవీందర్‌ గుప్తాను బాధ్యతల నుంచి తప్పించి విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్‌ వాకాటి కరుణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 జూలై 14న ఉత్తర్వులను జారీ చేసింది.[8][9]


  • కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగ అధిపతిగా పని చేయుచున్న ప్రొ,డా. టి యాదగిరిరావును రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీ వీసీగా నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వీసీలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేదీ:18 అక్టోబరు2024 న ఆమోద తెలిపారు.డా.టి.యాదగిరిరావు మూడేళ్ల పాటు ఉప కులపతి గా పదవి ల్లో కొనసాగుతాడు[10][11].

ఇతర వివరాలు

[మార్చు]
  1. ఈ విశ్వవిద్యాలయం భారత విశ్వవిద్యాలయ సంఘంలో సభ్యత్వం పొందింది.
  2. హరితహారంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది.

మూలాలు

[మార్చు]
  1. "Foundation stone laid for Telangana University". Hindustan Times (New Delhi, India) – via HighBeam (subscription required) . 29 July 2014. Archived from the original on 24 September 2015. Retrieved 4 June 2020. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. "Reports on Aspergillus Findings from Telangana University Provide New Insights". Biotech Week – via HighBeam (subscription required) . 29 July 2014. Retrieved 4 June 2020.[dead link]
  3. "Telangana University at Nizamabad". Archived from the original on 2007-02-19. Retrieved 2014-02-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-19. Retrieved 2014-02-20. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  5. Eenadu (25 May 2021). "దశ తిరగాలి.. విద్యార్థి ఎదగాలి". EENADU. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.
  7. Namasthe Telangana, యాదాద్రి > టీయూ వీసీగా నారాయణపురం వాసి (24 May 2021). "టీయూ వీసీగా నారాయణపురం వాసి". Namasthe Telangana. Archived from the original on 27 మే 2021. Retrieved 27 May 2021.
  8. Andhrajyothy (15 July 2023). "తెలంగాణ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా వాకాటి కరుణ". Archived from the original on 7 March 2024. Retrieved 7 March 2024.
  9. ETV Bharat News (14 July 2023). "తెలంగాణ వర్సిటీ ఇంఛార్జీ వీసీగా వాకాటి కరుణ". Archived from the original on 7 March 2024. Retrieved 7 March 2024.
  10. Velugu, V6 (2024-10-19). "9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు". V6 Velugu. Retrieved 2024-10-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  11. "తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరిరావు". Batukammanews (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-19.

బయటి లింకులు

[మార్చు]