తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ
Telangana logo (New).jpg
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ-గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు, ఉర్దూ
శాఖామంత్రికేటీఆర్
ఐటి ముఖ్య కార్యదర్శిజయేశ్ రంజన్
జాలగూడుwww.it.telangana.gov.in

తెలంగాణ సమాచార, సాంకేతిక శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ సేవల సమాచారాన్ని అందించడంకోసం తెలంగాణ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన శాఖ.[1] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఐటీశాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3]

శాఖ ఏర్పాటు[మార్చు]

సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ సాధారణ పరిపాలన (స్పెషల్-ఎ) శాఖ, జి.ఓ.ఆర్.టి.నెం.2125, తేదీ. 9-5-1997 ప్రకారం ఆర్థిక, ప్రణాళిక (ప్రణాళిక విభాగం) శాఖలో ఒక భాగంగా ఏర్పాటయింది. 2000, సెప్టెంబరు 11న సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ శాఖ, జి.ఓ.ఎం.ఎస్.నెం.12 ప్రకారంగా ఈ శాఖకు స్వయం ప్రతిపత్తి కల్పించబడింది. 2013, జూలై 24న ప్రధాన పరిపాలన (ఎఆర్టి-I) శాఖ, జి.ఓ.ఎంఎస్.నెం. 575 ద్వారా శాఖకు సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ల శాఖగా నామకరణం చేయబడింది. 2014, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ శాఖ తెలంగాణ ప్రభుత్వంలో విలీనమయింది.

కార్యకలాపాలు[మార్చు]

వివిధ రకాలైనటువంటి ఇ-గవర్నెన్సు ప్రణాళికలు ప్రవేశపెట్టడం, ఐ.టి. పెట్టుబడులను ప్రోత్సహించడం, ఐ.టి. ఆధారిత సర్వీసులను రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తయారీ యూనిట్ల అమలును ప్రవేశపెట్టడం వంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది.

ఐటి విధానాలు[మార్చు]

ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్‌ నెట్‌ వర్క్‌ విభాగాలు:[4]

ఇతర వివరాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రం సమాచార సాంకేతిక (ఐటీ) రంగంలో దేశంలోనే ఐటీ దిగ్గజ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 17.93% ఎగుమతుల వృద్ధిని (ఏకంగా రూ.1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు) సాధించి, ఐటీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. 2018-19లో రాష్ట్రం నుంచి రూ.1,09,219 కోట్ల ఐటీ ఎగుమతులు, 2019-20లో రూ.1,28,807 కోట్ల ఎగుమతులు చేసింది. ఇందులో భాగంగా 2018-19లో 5,43,033 మందికి ఉద్యోగాలు, 2019-20లో 5,82,126 మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. ఉద్యోగాల కల్పన వాటా కూడా 13.06% నుంచి 13.34 శాతానికి పెరిగింది.[5] 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లు కాగా లక్షన్నర మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 2022 మే నెలనాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉండగా, ఈ ఎనిమిదేళ్ళకాలంలో 4.1 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.[6]

బడ్జెట్ వివరాలు[మార్చు]

  • 2016-17 బడ్జెటులో ఈ శాఖకు 254 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

మూలాలు[మార్చు]

  1. "About IT, Electronics & Communications Department". IT, Electronics & Communications department. Retrieved 1 January 2022.
  2. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 1 January 2022.
  3. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 1 January 2022.
  4. telugu, NT News (2022-06-25). "టీ హబ్‌ 2.0". Namasthe Telangana. Archived from the original on 2022-06-25. Retrieved 2022-06-25.
  5. "ఐటీలో రాష్ట్రం మేటి". andhrajyothy. Archived from the original on 2022-01-01. Retrieved 2022-01-01.
  6. telugu, NT News (2022-06-01). "ఎనిమిదేళ్లలో ఐటీలో అద్భుతమైన పురోగతి : కేటీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-06-01. Retrieved 2022-06-01.

బయటి లంకెలు[మార్చు]