తెలంగాణ సైన్స్ అకాడమీ

వికీపీడియా నుండి
(తెలంగాణ సైన్స్‌ అకాడమీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలంగాణ సైన్స్‌ అకాడమీ
తెలంగాణ సైన్స్‌ అకాడమీ లోగో
స్థాపన2014
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణసైన్స్, టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేయడం
కార్యస్థానం
సేవలు2015, ఏప్రిల్ 30 (ప్రారంభం)

తెలంగాణ సైన్స్‌ అకాడమీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సైన్స్ సంస్థ. సైన్స్, టెక్నాలజీ రంగాలను అభివృద్ధి చేయడం, ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచడం, పుస్తకాలు-పత్రికల ప్రచురణ కోసం ఒక వేదికను అందించడం ఈ అకాడమీ ప్రధాన లక్ష్యం. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తార్నాకలో ఉంది.[1]

ఏర్పాటు[మార్చు]

1963లో ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ ఏర్పాటయింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ నుండి తెలంగాణ సైన్స్ అకాడమీ విభజించబడింది. 2015 ఏప్రిల్ 30 నుండి ఈ అకాడమీ తన కార్యకలాపాలు ప్రారంభించింది.

పాలకవర్గం[మార్చు]

పరమాణు జీవశాస్త్రవేత్త, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు అధ్యక్షతన కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను జనరల్ బాడీ ఎన్నుకుంది.

విధులు, లక్ష్యాలు[మార్చు]

 1. సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం
 2. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహిస్తూ అవార్డులు అందించడం[2]
 3. ప్రజలలో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించడం
 4. సైన్స్‌పై పుస్తకాలు & పత్రికల ప్రచురణ కోసం ఒక వేదికను అందించడం
 5. సైన్స్ రంగంలో కృషిచేసిన విద్యావేత్తలు, నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలకు ఫెలోషిప్స్ అందించడం

ప్రాంతీయ కేంద్రాలు[మార్చు]

అకాడమీ తన కార్యకలాపాలను విస్తరించడానికి, అందరికి చేరువయ్యేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తన ప్రాంతీయ కేంద్రాలను స్థాపించింది.[3]

 1. నిజామాబాద్ ప్రాంతీయ కేంద్రం (మెదక్ & నిజామాబాద్ జిల్లాలు)
 2. వరంగల్ ప్రాంతీయ కేంద్రం (వరంగల్ & ఖమ్మం)
 3. హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం (హైదరాబాద్ & రంగారెడ్డి)
 4. నల్గొండ ప్రాంతీయ కేంద్రం (నల్గొండ & మహబూబ్‌నగర్)
 5. కరీంనగర్ ప్రాంతీయ కేంద్రం (కరీంనగర్ & నిజామాబాద్)

సదస్సులు[మార్చు]

2018 డిసెంబరు 22 నుండి 24 వరకు వరంగల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అకాడమీ మొట్టమొదటి తెలంగాణ స్టేట్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడింది. మూడు రోజుల జరిగిన ఈ సదస్సులో 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సైన్స్ & టెక్నాలజీ' అనే అంశంపై అనేక చర్చలు, ప్రతిపాదనలు, పత్ర సమర్పణలు జరిగాయి.[4]

మూలాలు[మార్చు]

 1. "Telangana Academy of Sciences (TAS) Hyderabad". www.tasc.org.in. Archived from the original on 2021-11-20. Retrieved 2022-02-28.
 2. Watson, Shweta (2017-07-12). "Star in the making". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2017-07-16. Retrieved 2022-02-28.
 3. "Telangana Academy of Sciences (TAS) Hyderabad - About Us". www.tasc.org.in. Archived from the original on 2021-11-20. Retrieved 2022-02-28. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2020-06-07 suggested (help)
 4. India, The Hans (2018-12-21). "First Science Congress from tomorrow". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-28. Retrieved 2022-02-28.

బయటి లింకులు[మార్చు]