తెలుగు చోడులు
స్వరూపం

తెలుగు చోడులు లేదా తెలుగు చోళులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, దక్షిణ ఒడిషా ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశం.[1] వీరు కొద్ది కాలం పల్లవులకు, కొంత కాలం చోళులకు సామంతులుగా ఉన్నారు.[2][3] వీరు తమిళ సంగం యుగానికి చెందిన కరికాళ చోళుడి వారసులమని ప్రకటించుకున్నారు.[4]
రేనాటి చోడులు
[మార్చు]తెలుగు చోడులలో రేనాడు ప్రాంతాన్ని పరిపాలించిన రాజులను రేనాటి చోడులు అంటారు. ఈ ప్రాంతం ప్రస్తుతం కడప జిల్లాలో ఉంది. ఈ వంశ మూలాలు కడప జిల్లాకు చెందిన ఎరికాల్ (ప్రస్తుతం కమలాపురం, కడప జిల్లా) లో ఉన్నాయి.[5] రేనాటి చోడుల రాజ్యాన్ని గురించి సా.శ 7 వ శతాబ్దంలో చైనా యాత్రికుడైన యువాన్ చాంగ్ తన రచనల్లో వర్ణించాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ KRISHNA CHANDRA PANIGRAHI (1961). Chronology of the Bhauma-karas and the Somavamsis of Orissa. p. 41.
- ↑ Chetty, K Ramachandra (1984). "A HistoryCHOLAS of theRENADU Telugu Cholas in Southern AndhraPOTTAPI" (PDF). Chapter. KarnatakIV Universityof CHOLAS of POTTAPI.
- ↑ Dutta, Amaresh (1987). Encyclopedia of Indian literature. Sahitya Akademi. ISBN 8126018038.
- ↑ Sanikommu Venkateswarlu; S Murali Mohan (2021). "Different political dynasties in Medieval Andhra (CA. 1000-1400 AD): A study" (PDF). International Journal of History. p. 114.
Since they owed allegiance to the Chalukya-Cholas, they held the name 'Choda' as prefix in their names and as a mark of their respect towards their overlords.
- ↑ Sailendra Nath Sen. Ancient Indian History and Civilization. New Age International, 1999. p. 471.
- ↑ K. A. NILAKANTA SASTRI (1958). A History of SOUTH INDIA from Prehistoric Times to the Fall of Vijayanagar. Oxford University press. p. 139.