తెలుగు వ్యుత్పత్తి కోశం

వికీపీడియా నుండి
(తెలుగు వ్యుత్పత్తి కోశము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగు వ్యుత్పత్తి కోశం
Telugu vyutpatti kosam1.jpg
తెలువు వ్యుత్పత్తి కోసం, ప్రథమ సంపుటం ముఖచిత్రం.
This file is a candidate for speedy deletion. It may be deleted after బుధవారము, 1 జనవరి 2014.
కృతికర్త: లకంసాని చక్రధరరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
సీరీస్: ప్రథమ సంపుటం
ప్రక్రియ: తెలుగు భాష
విభాగం(కళా ప్రక్రియ): నిఘంటువు
ప్రచురణ: ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, విశాఖపట్నం
విడుదల: 1978
పేజీలు: 412
దీని తరువాత: రెండో సంపుటం

లకంసాని చక్రధరరావు , ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సంపాదకత్వంలో "తెలుగు వ్యుత్పత్తి కోశం " పేరుతో తెలుగు నుండి తెలుగు నిఘంటువు 1,08,330 పదాలతో 8 సంపుటాలుగా వెలువడినది.

సంపుటాలు[మార్చు]

 1. మొదటి సంపుటము: అ-ఔ (1978) 412 పేజీలు; ఇది పొట్టి శ్రీరాములు కి అంకితం. ఎమ్.ఆర్.అప్పారావు తొలిపలుకులు రాశారు. ఇందులో 12,219 పదాలు.
 2. రెండవ సంపుటము: క-ఘ (1981) 455 పేజీలు; ఇది కట్టమంచి రామలింగారెడ్డి కి అంకితం. ఆవుల సాంబశివరావు ముందుమాట రాశారు. ఇందులో 19,670 పదాలు
 3. మూడవ సంపుటము: చ-ణ (1981) 277 పేజీలు, ........... కి అంకితం, ఆవుల సాంబశివరావు ముందుమాట రాశారు. ఇందులో 11,000 పదాలు
 4. నాలుగవ సంపుటము: త-న (1985) 440 పేజీలు; ఇది వాసిరెడ్డి శ్రీకృష్ణ కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. ఇందులో 16,000 పదాలు.
 5. అయిదవ సంపుటము: ప-భ (1987) 498 పేజీలు, లంకపల్లి బుల్లయ్య కి అంకితం. కోనేరు రామకృష్ణారావు మున్నుడి. ఇందులో 19,000 పదాలు.
 6. ఆరవ సంపుతము: మ (1987) 268 పేజీలు, ఎమ్.ఆర్.అప్పారావు కి అంకితం కోనేరు రామకృష్ణారావు ముందుమాట. ఇందులో 9,754 పదాలు
 7. ఏడవ సంపుటము: య-వ (1989) 272 పేజీలు; ఇది ఆవుల సాంబశివరావు కి అంకితం. కనిశెట్టి వెంకటరమణ తొలిపలుకు. ఇందులో 10,132 పదాలు
 8. ఎనిమిదవ సంపుటము: శ-హ (1995) 315 పేజీలు; ఇది కోనేరు రామకృష్ణారావు కి అంకితం. మద్ది గోపాలకృష్ణారెడ్డి ప్రవచనం. ఇందులో 6,651పదాలు. 3904(అ-హ) అనుబంధం.

తెలుగు వ్యుత్పత్తికోశ సలహా సంఘం[మార్చు]

అధ్యక్షులు 
సభ్యులు 
 • డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, గౌరవాచార్యులు, రవీంద్ర సాహిత్యం, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు
 • వాజ్మయమహాధ్యక్ష డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య, కళాప్రపూర్ణ, డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అండ్ రిసర్చి ఇనిస్టిట్యూట్, హైదరాబాదు.
 • శ్రీమతి టి. ఎన్. అనసుయాదేవి, అధ్యక్షురాలు, అధికార భాషా సంఘం, హైదరాబాదు.
 • శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య, సత్తెనపల్లి.
 • ఆచార్య జి. ఎన్. రెడ్డి, తెలుగు శాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
 • ఆచార్య యస్వీ. జోగారావు, తెలుగు శాఖ, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు
 • డాక్టర్ ఎల్. చక్రధరరావు, కార్యదర్శి, డైరెక్టర్, ప్రధాన సంపాదకుడు, తెలుగు వ్యుత్పత్తి కోశ పథకం.

మూలాలు[మార్చు]