తెలుగు సినిమాలు 1943
స్వరూపం

1943లో మొత్తం 7 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి.
విడుదలైన సినిమాలు
[మార్చు]- కృష్ణప్రేమ : కృష్ణప్రేమ 1943లో. మార్చి 27 న విడుదలైన తెలుగు చలన చిత్రం.[1] హెచ్.వి.బాబు దర్శకత్వం వహించాడు.
- పంతులమ్మ : పంతులమ్మ సినిమా సారధీ పిక్చర్స్ పతాకం క్రింద గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో తయారైనది.
- పతిభక్తి : పతిభక్తి 1943 లో విడుదలైన తెలుగు సినిమా.[2] బొంబాయి స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్.శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.
- భక్తకబీర్ ( చమ్రియా) : భక్త కబీర్ 1944 జనవరి 1న విడుదలైన తెలుగు జీవిత చరిత్ర చలనచిత్రం[3]. చమ్రియా టాకీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు.[4]
- భాగ్యలక్ష్మి : భాగ్యలక్ష్మి 1943లో వెలువడిన తెలుగు సినిమా. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ఇది 100వ తెలుగు టాకీ సినిమా. చిత్తూరు నాగయ్య నిర్మాతగా ఇది తొలి సినిమా.[5]
- చెంచులక్ష్మి : చెంచులక్ష్మి, 1943లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది. కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు.
- గరుడ గర్వభంగం : ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య.దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.
విశేషాలు
[మార్చు]- ఈ యేడాది ఎనిమిది చిత్రాలు విడుదల అయ్యాయి
- కృష్ణప్రేమ, చెంచులక్ష్మి చిత్రాలు విజయం సాధించాయి.
- చిత్తూరు నాగయ్య సొంతగా రేణుకా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి తీసిన తొలి చిత్రం భాగ్యలక్ష్మి సుమారుగా నడిచింది
- ఇదే యేడాది విడుదలైన పంతులమ్మ కూడా ఓ మోస్తరు విజయాన్నే మూటకట్టుకుంది.
మూలాలు
[మార్చు]- ↑ Karthikeya (2018-03-05). "Krishna Prema (1943)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-07-17.
- ↑ http://ghantasalagalamrutamu.blogspot.in/2013/03/1943.html[permanent dead link]
- ↑ FilmiClub. "Bhakta Kabir (1944)". FilmiClub (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2024-10-07. Retrieved 2024-10-06.
- ↑ "Bhakta Kabir (1944)". Indiancine.ma. Retrieved 2022-05-11.
- ↑ సంపాదకుడు (1 October 1974). "శ్రీ రేణుకావారి భాగ్యలక్ష్మి". విజయచిత్ర. 9 (4): 7.
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | | |